2 కొరిం 5:15 - "జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము".
దేవుడు తన మహా కృపలో నిన్ను నన్ను రక్షించాడు.
రక్షించబడిన మనం మన క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు మళ్లీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను :
1. ఎందుకు బ్రదుకుతున్నావో జ్ఞాపకం చేసుకో – క్రీస్తును మహిమ పర్చడానికి,ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన కుమారుడిగా కుటుంబంలో సంఘంలో సమాజంలో జీవించడానికి మనం రక్షించబడ్డాం అని మర్చిపోవద్దు.
2. అనవసరమైనవాటిని వదులుకో – మనల్ని క్రీస్తు నుండి దూరం చేసేవాటిని, క్రీస్తు నుండి మనల్ని దూరం చేసే మనుషులను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తులో గల రక్షణానందం నుండి వేరు చేసే పాపాన్ని, ఆ పాపాన్ని ప్రోత్సహించే మనుషులను సైతం విడిచిపెట్టాలి.
3. అందరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదని తెలుసుకో – ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞలు, బాధ్యతలు నెరవేర్చాలంటే, కుటుంబానికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే అందరినీ సంతోషపెట్టడం కుదరదని తెలుసుకోవాలి.
4. ప్రయాసపడడం నేర్చుకో – జీవితంలో అన్నీ దగ్గరికి రావు, కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, ఓడిపోయినా తిరిగి లేవాలి, సోమరిగా ఉండకుండా కష్టపడడం నేర్చుకోవాలి. ప్రభువు సహాయం చేస్తాడు.
5. నేర్చుకున్న వాటిని ఆచరించడం మరువకు – వారం వారం దేవుని వాక్యం నుండి సత్యాలు వినడం మాత్రమే సరిపోదు. మన అనుదిన జీవితంలో విన్నవాటిని ఆచరించడానికి ప్రతి ప్రయత్నం చేయాలి.
వాక్యానుసారమైన క్రైస్తవుడిగా వాక్యానుసారమైన కుటుంబాన్ని కట్టుకుంటూ వాక్యానుసారమైన సంఘంలో దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడే మనకు సహాయం చేయును గాక. ఆమెన్.
-డా.శంకర్ బాబు
Comments
Post a Comment