Skip to main content

Posts

Showing posts from April, 2026

క్రైస్తవులు బాధపడడం, ఏడ్వడం తప్పా?

అది ఆదివారం. సంఘ ఆరాధనలో జాన్ కనిపించకపోయేసరికి డేవిడ్ ఆరాధన అవ్వగానే జాన్ ఇంటికి వెళ్లాడు.   జాన్ చాలా కృంగిపోయి తన జీవితంలో ఎదురవుతున్న శ్రమలను గురించి డేవిడ్ తో పంచుకున్నాడు. జాన్ బాధను చూసిన డేవిడ్ ఏ మాత్రం తడబడకుండా  “ మనం క్రీస్తుశిష్యులం ,  దేవుడు లేనివారిలా అలా బాధపడతావేంటి? క్రైస్తవులు బాధపడొద్దు, పిరికివాళ్లలా ఏడవద్దు ”  అని సూటిగా చెప్పాడు .  ఇలా చెప్పడం సరైనదిగానే అనిపించినప్పటికీ క్రైస్తవులు కృంగిపోవడం ,  బాధల్లో ఏడవడం తప్పు అనే విధంగా డేవిడ్ మాటలున్నాయని మనకు అర్థమౌతుంది. సంఘాల్లో కూడా మనకు తెలియకుండానే ఇటువంటి బోధ కూడా జరగడం నేను గమనించాను. మనుషుల ఎమోషన్స్ మీద సరైన అవగాహన లేకపోవడం వలన బాధల్లో ఉన్నవారికి ఆత్మీయంగా చెడ్డ మాటలు చెప్పకపోయినా, ఆ భావోద్వేగాలు వ్యక్తపర్చడం కూడా తప్పే అనే తత్వం తరచుగా మనకు కనిపిస్తుంది. క్రైస్తవులకు, దేవుని వాక్యం మీద కాస్త జ్ఞానం లభించగానే ఇతర మనుషుల భావోద్వేగాల వాస్తవికతను మర్చిపోతారేమో అని నాకు అనిపిస్తుంటుంది.    దేవుడు భావోద్వేగాలు గల వ్యక్తి  దేవుడు భావోద్వేగాలు కలిగినవాడని బైబిల్ గ్రంథం మనకు బోధ...

ఈ మాటలు మననం చేసుకో

2 కొరిం 5:15 - "జీవించువారికమీదట తమకొరకు కాక ,   తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము". దేవుడు తన మహా కృపలో నిన్ను నన్ను రక్షించాడు.  రక్షించబడిన మనం మన క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు మళ్లీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను :  1. ఎందుకు బ్రదుకుతున్నావో జ్ఞాపకం చేసుకో  – క్రీస్తును మహిమ పర్చడానికి,ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన కుమారుడిగా కుటుంబంలో సంఘంలో సమాజంలో జీవించడానికి మనం రక్షించబడ్డాం అని మర్చిపోవద్దు.  2.  అనవసరమైనవాటిని వదులుకో –  మనల్ని క్రీస్తు నుండి దూరం చేసేవాటిని, క్రీస్తు నుండి మనల్ని దూరం చేసే మనుషులను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి.  క్రీస్తులో గల రక్షణానందం నుండి వేరు చేసే పాపాన్ని, ఆ పాపాన్ని ప్రోత్సహించే మనుషులను సైతం విడిచిపెట్టాలి.  3.  అందరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదని తెలుసుకో –  ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞలు, బాధ్యతలు నెరవేర్చాలంటే, కుటుంబానికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే అందరినీ సంతోషపెట్టడం కుదరదని...

అసూయ వలన కలిగే అనర్థము

  1 సమూయేలు పుస్తకంలో దావీదు గొల్యాతును చంపే సన్నివేశం బైబిల్ మొత్తంలో ఒక అద్భుతమైన దేవుని కార్యంగా మనకు కనిపిస్తుంది. ఒక బాలుడు యుద్ధంలో వాడే యుద్ధోపకరణాలు వాడకుండా ఒక యుద్ధశూరుణ్ణి చంపడం కేవలం దేవుని శక్తి వలననే సాధ్యం అని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథను ఎన్నో సార్లు మనం వినుంటాం, చదివుంటాం. అయితే, ఆ తర్వాత జరిగిన విషయాలను కూడా మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది.  1సమూ 18:7లో ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతము చేసిరనిరి.  ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపి పట్టణంలోకి ప్రవేశించాడో ప్రజలు ఇలా చెప్పడం సౌలుకు అసూయను కలిగించింది.  దావీదు అంతకుముందు నుండే సౌలు దగ్గరికి వచ్చి సితారా వాయిస్తూ దురాత్మ నుండి సౌలుకు ఉపశమనం కలిగించేవాడు  (1సమూ 16:23). అంటే సౌలు, దావీదు ద్వారా వ్యక్తిగతంగా ఆశీర్వదించబడ్డాడు. సౌలు,  గొల్యాతుతో యుద్ధం చేయడానికి భయపడ్డాడు  (1సమూ 17:11).  సౌలు, ఎవరైనా  గొల్యాతును ఓడిస్తే తన ఐశ్వర్యం ఇచ్చి, ఆ వ్యక్తికి తన కూతురిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు  (1సమూ 17:25). అంటే, సౌలుక...