Skip to main content

Posts

Showing posts from October, 2026

ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నేర్పించే పాఠాలు!

  నాలుగు రోజుల క్రితం నా కిడ్నీలో ఉన్న రాయికి చికిత్సలో భాగంగా స్టెంట్ వేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లాను. రోజంతా రక్తపరీక్షలు, CT స్కాన్, గుండెకు సంబంధించిన పరీక్షలు ఇలా చాలా సమయం గడిచిపోయింది. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యే వరకు చాలాసేపు ఏమీ తినకుండా ఉండాల్సి వచ్చింది. చివరకు సాయంత్రం ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత నన్ను పోస్ట్ ఆపరేషన్ వార్డులో ఉంచారు. కొద్దిసేపటికే నొప్పి మొదలైంది. నాకు ఆసుపత్రిలో ఉండటం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే, ఎలాగైనా ఆ రాత్రికే ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నాను. ఇన్సూరెన్స్‌కు కూడా దరఖాస్తు చేశాము. అది కన్ఫర్మ్ కావడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని చెప్పారు. సరే, మరో నాలుగు గంటలు ఓపికగా ఎదురుచూద్దామని అనుకున్నాను. అయితే, మూడు గంటల తర్వాత ఇన్సూరెన్స్ నుంచి కొంత మొత్తం కన్ఫర్మ్ అయినట్లు మెసేజ్ వచ్చింది.  “సరే, మిగిలిన మొత్తం కూడా కన్ఫర్మ్ అయితే ఇక ఇంటికి వెళ్లిపోవచ్చు”  అనుకున్నాను. కానీ, అసలు సమస్య అప్పుడే మొదలైంది! ఆసుపత్రి వారు కోట్ చేసిన బిల్లు ఎక్కువగా ఉండటంతో, ఇన్సూరెన్స్ వారు మళ్లీ బిల్లు పంపించమని అడిగారు. అప్పటికే రాత్రి పన్నెండు గంటలు కావస్తో...

విధేయత – విశ్వాసం యొక్క ఫలితం

 విధేయతను గురించి ఆదికాండము 17:22–27 నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు:  1. నిజమైన విశ్వాసం విధేయతగా ఫలిస్తుంది. అబ్రహాము దేవుని ఆజ్ఞను విన్నాడు, అంగీకరించాడు, వెంటనే ఆచరణలో పెట్టాడు. విశ్వాసం కేవలం మాటల్లోనే కాదు, మన క్రియల్లో కూడా కనిపించాలి. Faith alone saves, but the faith that saves is never alone. 2. విధేయతలో ఆలస్యం చేయకూడదు. దేవుడు అబ్రహాముకు సున్నతి చేయమని ఆజ్ఞాపించినప్పుడు, అతడు తనకు అనుకూలమైన సమయం కోసం ఎదురుచూడలేదు. అదే దినమున తనకు, ఇష్మాయేలుకు, తన ఇంటివారందరికీ సున్నతి చేయించాడు. కీర్తన 119:60లో దావీదు ఇలా అంటున్నాడు: “నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని.” దేవుని చిత్తం మనకు స్పష్టంగా తెలిసినప్పుడు, “తర్వ...