Skip to main content

Posts

Showing posts from March, 2026

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

ప్రసంగంలో "హల్లెలూయ,స్తోత్రం" పదాల ప్రస్తావన

  ఈ మధ్య ఒక క్రైస్తవ మీటింగ్ కి వెళ్లాను. అక్కడ ప్రసంగం చేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతంలో చాలా పెద్ద బోధకుడు. ఆ ప్రసంగంలో చాలా సార్లు  “హల్లెలూయా” ,   “స్తోత్రం”   అనడం నేను గమనించాను. కొన్నిసార్లు వాక్యం చూడడానికి, చెప్పదలచుకున్నది గుర్తుచేసుకోడానికి ఈ పదాలను ఆయన ఉపయోగించడం గమనించాను.    “హల్లెలూయా” ,  “స్తోత్రం”  అనే మాటలు మంచి మాటలే. ఇవి దేవునికి మహిమను ఆపాదించే మాటలే. బైబిలు గ్రంథంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి.  ఉదాహరణకు, కీర్తనల గ్రంథములో ఈ మాటలు మనం చదువుతాం. కానీ కీర్తనాకారులు ఆ మాటను మళ్లీ మళ్లీ చెప్పరు. 104,105,106, 111, 146-150 మొదలైన కీర్తనలను గమనిస్తే ప్రారంభంలో మరియు చివర్లో మాత్రమే ‘హల్లెలూయా’ అనే పదం వారు ప్రస్తావించడం మనం చూడగలం. అలాగే ప్రకటన 19:1లో కూడా బహుజనుల శబ్దం వంటి స్వరం ప్రభువును స్తుతించుడి (హల్లెలుయ) అని చెప్పడం మనం చదువుతాం.  అయితే, ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రసంగం యొక్క ప్రధాన ఉద్దేశం దేవుని వాక్యాన్ని స్పష్టంగా వివరించడం. అందుకే ప్రసంగీకులు, 2 తిమోతికి 4:2 లో "వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమం...