Skip to main content

Posts

Showing posts from May, 2026

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...

విడిచిపెట్టాల్సినవేమిటో?

దేవుడు అబ్రామును పిలిచినప్పుడు " నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము" (ఆది 12:1) అని ఆజ్ఞాపించాడు. దేవుడు ఇక్కడ అబ్రాముతో మనవి చేయట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. సార్వభౌముడైన సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రాముకు ఆజ్ఞను జారీచేస్తున్నాడు. అబ్రాము, నీ దేశం విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, ఇక్కడి నుండి బయలుదేరు అన్నట్లుగా ఆ ఆజ్ఞ మనకి కనిపిస్తుంది. అబ్రాము బహుశా అక్కడే పుట్టుంటాడు, అక్కడే పెరిగి ఉంటాడు, అక్కడే చంద్రుణ్ణి ఆరాధించే భక్తిని నేర్చుకుని ఉంటాడు. అన్యదేవతలను పూజిస్తున్న కుటుంబంలో నుండి  “అబ్రాము, నువ్వు వారికి వేరుగా ఉండాలి, ఈ ప్రాంతానికి వేరుగా వేరే ప్రాంతానికి వెళ్లాలి” అని దేవుడు చెప్పాడు. అదే దేవుడు అటువంటి పరిస్థితులు ఉన్న ప్రస్తుత సమాజం నుండి ఇప్పటికీ ప్రజలను పిలుస్తున్నాడు. అబ్రామును పిలిచినట్లుగా అతనితో సూటిగా మాట్లాడి పిలవడం లేదు కానీ, ఈ దినములలో తన కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షణ కోసం మనల్ని పిలుస్తున్నాడు (హెబ్రీ 1:1,2).   యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యలో ఆ పిలుపును మార్కు ...