మార్కు 11:25,26 - మీకు ఒకనిమీద విరోధమేమైనను కలిగియున్న యెడల , మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. పైన ప్రస్తావించబడిన వచనం స్వయానా ప్రభువైన యేసుక్రీస్తు వారే తన శిష్యులతో చెప్పారు. మీకు ఎవరి మీదనైనా ఏదైనా విరోధ భావన ఉంటే, మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తిని క్షమించండి అని ఇక్కడ బోధిస్తున్నారు. విరోధమంటే , ఎవరిమీదనైనా కోపం , ద్వేషం , అసూయ మొదలైనవి అని అర్థం. సాధారణంగా, ఇతరుల మీద కోపం లేదా ద్వేషం ఎందుకుంటాయి ? ఇతరులు మనల్ని గాయపరిచినప్పుడు లేదా మన అంచనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వారిపై కోపం కలుగుతుంది , అది ద్వేషంగా మారుతుంది. మనకన్నా ఎక్కువగా ఇతరులను దేవుడు దీవించినప్పుడు మనకు అసూయ కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మొదటగా వారి కొరకు ప్రార్థన చేయమని , రెండవదిగా వారిని క్షమించమని ప్రభువు ఇక్కడ చెబుతున్నాడు. ఇది కష్టమైనదిగా అనిపించొచ్చు కానీ, అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే , ఒకవేళ క్షమించడం అసాధ్యమైతే ప్రభువు క్షమించమని...