Skip to main content

Posts

Showing posts from June, 2026

యేసుక్రీస్తు vs తల్లిదండ్రులు

మార్కు 3:31-35లో ,  యేసుక్రీస్తు సహోదరులు, ఆయన తల్లియైన మరియ వచ్చారని వారు యేసును వెదకుచున్నారని యేసుతో చెబుతారు. అప్పుడు యేసు, తన చుట్టూ కూర్చున్న వారిని చూచి “ఇదిగో నా తల్లి, నా సహోదరులు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి” అని చెప్పాడు.  ఈ మాటలు చదివినపుడు, యేసుక్రీస్తు తన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని మనకు అనిపించొచ్చు.    అంతేకాదు, ఎవరైనా తనను వెంబడించాలనుకుంటే తన తల్లినైనను, తండ్రినైనను, సహోదరులనైనను, సహోదరీమణులను, తన స్వంత ప్రాణమునైనను విడిచిపెట్టి, తన సిలువనెత్తుకుని వెంబడించకుంటే,వారు నా శిష్యులు కానేరరు (లూకా 14:26,27) అని చెప్పడం కూడా చూస్తాం.  ఈ మాటలు చదివినపుడు, యేసుక్రీస్తు ప్రభువు, తనను ఎవరైనా వెంబడించాలంటే తల్లిదండ్రులను విడిచిపెట్టమని చెప్పినట్లుగా మనకు అనిపించొచ్చు.    కానీ, క్రీస్తు చెబుతున్న విషయం అది కాదు. క్రీస్తే స్వయాన తన తల్లిదండ్రులతో కలిసి ముప్పై సంవత్సరాలు వారికి లోబడి జీవించాడు (లూకా 2:51).    మార్కు 3:31-35లో, క్రీస్తు చెప్పదల్చుకున్న ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఎవరైతే దేవ...