Skip to main content

డెంగ్యూ జ్వరం - సంఘ సహవాసం

 

గత వారం విపరీతమైన తలనొప్పి, జ్వరం రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిందిరక్త పరీక్షలలో డెంగ్యూ జ్వరం అని తేలింది. తల బద్దలైపోతున్నట్లు నొప్పి, ఒళ్ళంతా కాలడం వలన నిద్ర కూడా సరిగా పట్టలేదు. మూడు రోజులు ఆస్పత్రిలో ఇంజెక్షన్స్ మరియు iv ఫ్లూయిడ్స్ ఇచ్చారు. నాలుగవ రోజు డిశ్చార్జ్ చేశారు

నాకు బాగాలేదని చెప్పగానే పని పక్కన బెట్టి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లింది ఒక ఫ్యామిలీ

నేను వెళ్ళేలోగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని, ఇన్సూరెన్స్ తాలూకు పేపర్ వర్క్ అంతా సిద్ధం చేశాడు ఒక తమ్ముడు

కొంతమంది బ్రదర్స్ నాతో ఆస్పత్రిలో ఉండి నాకు సహాయం చేశారు

నా గురించి ప్రార్థించిన వారు, నన్ను కలిసి వెళ్ళినవారు మరికొందరు

వంతుల వారిగా రాత్రులు నాతో ఉండి సపర్యలు చేసింది మరికొంతమంది బ్రదర్స్

మరోవైపు మా పిల్లలకు టైఫాయిడ్ జ్వరం ఉండడంతో వారిని రక్తపరీక్షలకు తీసుకెళ్లింది మరో బ్రదర్.

ఇంట్లో ఉండి నా భార్యకు సహాయం చేశారు కొందరు సిస్టర్స్

తిరిగి నన్ను ఇంటి దగ్గర దింపేసే వరకు నన్ను సొంత కుటుంబ సభ్యునిగా సేవ చేసిన వీరందరూ, మా కుటుంబాన్ని వారి కుటుంబముగా భావించి సహాయం చేసిన వీరందరూ మా సంఘ సభ్యులు

వీరిలో మా పాత సంఘానికి చెందిన తమ్ముళ్లు కూడా ఉన్నారు


సంఘమంటే ఆదివారం జరిగే కార్యక్రమం కాదు, సంఘమంటే దేవుని కుటుంబం (గలతీ 3:26; ఎఫెసీ 2:19,1తిమో 3:15). 

కుటుంబంలో గల సభ్యులు పరస్పర ప్రార్థన మాత్రమే కాదు, పరస్పర సహాయ సహకారాలు కూడా అందించుకోవాలి

సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్ధులమైయున్నాము (1యోహాను 3:16) అనే ఆజ్ఞను పాటించడానికి పిలవబడిన సంఘము, సంఘములో సభ్యుల అత్యవసర పరిస్థితుల్లో నిలబడి సమయం,శక్తి వెచ్చించాలి

 

సంఘములో మంచి బోధ ఉంటే సరిపోదు, సంఘము ఎన్నో కార్యక్రమాలు చేస్తే చాలదు, సంఘము ఒకరిపట్ల ఒకరు ప్రార్థన చేస్తే సరిపోదు, సంఘము క్లిష్ట సమయాల్లో ఒకరికొరకు ఒకరు నిలబడాలి

అప్పుడే కదా సంఘము క్రీస్తు ప్రేమలో ఎదుగుతున్నట్లు. అందుకేనేమో పౌలు సంఘములో ప్రేమ గురించి ఒక అధ్యాయం రాశాడు (1 కొరింథీ 13). 

 సంగతులను బోధించిన నేనుఆస్పత్రిలో ఉన్నపుడు సంఘము ద్వారా  ప్రేమను అనుభవించాను


నేటి దినాల్లో కేవలం కార్యక్రమం మీద దృష్టి పెట్టి సభ్యులతో సంబంధాలు లేకుండా పరిచర్యలు కొనసాగిస్తున్నారు

ఆదివారం ఆరాధన కార్యక్రమానికి ప్రజలు వస్తే చాలని నాయకులు అనుకుంటున్నారు, అదే ఆరాధన కార్యక్రమానికి వెళ్తే చాలని విశ్వాసులు అనుకుంటున్నారు. కానీ,నూతన నిబంధన ఎక్కడా కూడా ఇటువంటి సంఘ కార్యక్రమాలు కలిగి ఉండాలని చెప్పలేదు


నూతన నిబంధన బోధ ప్రకారం, విశ్వాసులు ఒకరిపట్ల ఒకరు ప్రేమలో అభివృద్ధి చెందే విధంగా సంఘ కాపరి సంఘాన్ని ప్రోత్సహించాలి

సంఘస్తులు కూడా కేవలం ఆదివారం పైపై పలకరింపులు చేయకుండా ఇతరుల కష్ట నష్టాలలో, సంతోష దుఃఖ సమయాల్లో ఆసరాగా ఉండాలి (రోమా 12:9-16)

అప్పుడే సంఘము దేవునికి ఇష్టమైన సంఘముగా దినదినము అభివృద్ధి చెందుతూ దేవుని మహిమ కొరకు పరిచర్య చేయగలుగుతుంది. అటువంటి సంఘాలుగా ఉండడానికి దేవుడు సహాయం చేయును గాక


- డా. శంకర్ బాబు 


Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...