Skip to main content

దేవుని క్రమ"శిక్ష"ణ


యిర్మీయా
34 అధ్యాయంలో బబులోను రాజైన నెబుకద్నెజరు, జెరూసలేం మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల మీద యుద్ధం చేస్తుంటే, దేవుడు యిర్మీయాకి మాటలు చెప్పాడు - నీవు యూదా రాజైన సిద్కియా దగ్గరకు వెళ్లి, "ఇదిగో నేను నగరాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దానికి మంటలు అంటించి కాల్చివేస్తాడు". 

యూదా దేశం మీదికి దేవుడే బబులోను రాజును లేపి నాశనం చేయడానికి పంపించాడు

ఎందుకు ? ఎందుకంటే వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమే.


యిర్మీయా 25:6-8 - యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. 

అయితేమీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులవలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చు చున్నాడు. 

సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్నెజరను బబులోనురాజును పిలువ నంపించుచున్నాను.


ఏలయనగా ఇశ్రాయేలువారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నాయెదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు, తమ చేతుల క్రియవలన వారు నాకు కోపమే పుట్టించువారు; ఇదే యెహోవా వాక్కు (యిర్మీయా 32:30). 


పాఠం : దేవుడు తనకు వ్యతిరేకంగా పాపం చేసిన తన ప్రజలను శిక్షించడానికి అన్యుడైన నెబుకద్నెజరును లేపాడు. అంతే కాదు నెబుకద్నెజరును "నా సేవకుడు" అంటున్నాడు. 

మనం ఆయనకు విరోధంగా చేస్తున్న పాపాన్ని బట్టి, దేవుడు మనకు శిక్ష వేస్తాడు

శిక్షను కొన్నిసార్లు ఇతరుల నుండి అంటే అన్యులనుండి కూడా మనకు దేవుడు దయచేసే అవకాశం ఉంటుంది. 


ఇది విన్న సిద్కియా రాజు హెబ్రీ దాసులను వదిలేయాలని యెరూషలేము ప్రజలతో నిబంధన చేసి, దాసులను దాసురాండ్రను విడుదల చేశారు

అంటే, మొదటగా ఈ దాస దాసీలను ధర్మశాస్త్రం ప్రకారం 7 సంవత్సరాల తర్వాత విడిపించకుండా ఇంకా సేవ చేయించుకున్నారని మనకు తెలుస్తుంది. 


దేవుని శిక్ష నుండి తప్పించుకోవడానికి ఈ దాస దాసీలకు వెంటనే విడుదల ఇచ్చి ఉంటారు. 

కానీ, తర్వాత వారు మనస్సు మార్చుకున్నారు. తిరిగి తాము విడుదల చేసిన దాస దాసీలను మళ్ళీ తెచ్చుకొని వారిని దాస్యంలో ఉంచారు (34:11). 


పాఠం : దేవునికి భయపడి పాపం చేసి, తర్వాత పాపానికి దేవుని క్షమాపణ పొందుకొని, మళ్ళీ అదే పాపం మాటిమాటికి చేయడం ఘోరమైన పాపం

కృప విస్తరించాలని పాపము యందు నిలిచి యుండకూడదు (రోమా 6:1). 


అప్పుడు దేవుడున్నాడు " ఎవరైనా దాసులు మీకు అమ్మబడితే ఆరు సంవత్సరాల తర్వాత ఏడవ సంవత్సరంలో వారిని విడిచిపెట్టాలి. మీ పూర్వీకులు  నా మాట వినలేదు. ఇటీవల మీరు పశ్చాత్తాపపడి నా దృష్టికి ఏది మంచిదో అది చేశారు - ఒక్కొక్కరూ సాటివారిని విడుదల చేస్తామని ప్రకటన చేశారు

మీరు నిబంధన కూడా చేశారు. ఇప్పుడైతే మీరు మనసు మార్చుకొని నీ పేరు దూషణకు గురిచేశారు. దాసులను మళ్ళీ తెప్పించుకొని దాస్యంలో ఉంచారు. గనుక ఖడ్గానికీ కరువుకు ఘోరమైన అంటురోగానికీ గురియై మీరు చావడానికి అప్పగిస్తాను, మిమ్మల్నీ లోక రాజ్యాలన్నిటికీ అసహ్య కారణంగా చేస్తాను" (34:12-17). 


పాఠం : పై విధంగా దేవుడు మన పాపాలను బట్టి శిక్ష వేస్తె మనలో ఎవరూ కూడా భూమి మీద బ్రతకలేం. మన ప్రవర్తన దేవుడు చూడడు అనుకోవద్దు

క్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన కృపను, క్షమాపణను నిర్లక్ష్యం చేసి మళ్ళీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. ఆయన వాక్యం పాటిస్తూ, ఆయనతో సంబంధం కలిగి ఉంటూ, ఆయన మీద ఆధారపడుతూ కొనసాగాలి


దేవా, ఎన్నో సార్లు నీ కొరకు భక్తితో, పవిత్రంగా బ్రతుకుతాను అని చెప్పి తర్వాత పాపాన్ని ప్రేమించినవాడను, నీ మాటను జవదాటిన వాడను. నన్ను క్షమించు దేవా, నీ కుమారుని ద్వారా ఇచ్చిన కృపను తేలిగ్గా తీసుకోకుండా నాకు సహాయం చేయు ప్రభువా

నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము. నీ మీద నా దృష్టి కేంద్రీకరించి కొనసాగే కృపనివ్వమని నీ కుమారుని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రీ, ఆమేన్


- డా. శంకర్ బాబు 


Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...