Skip to main content

సంఘంలో సెక్స్ మీద అవగాహన

మా సంఘంలో ఉన్న యవ్వనస్తులు కలిసి ఒక పుస్తకం చదువుతున్నారు. దానిలో భాగంగా Sex అనే చాప్టర్ మీద మాట్లాడడానికి నన్ను పిలిచారు. 
గతవారం ఆ పుస్తకంలోని విషయాలను, నా ఆలోచనలను కలిపి వారితో సెక్స్ గురించి మాట్లాడడం జరిగింది. 

దేవుడు, వివాహ పరిధిలో, భార్యా భర్తల మధ్య మాత్రమే లైంగిక సంబంధం అనుమతించాడు మరియు ఆజ్ఞాపించాడు
(ఆది 1:28,2:24).
పెళ్ళికి ముందు సెక్స్ చేయడం పాపం 
(1 కొరింథీ 6:9,7:1,2; గలతీ 5:19,20).
పెళ్లికి ముందే సెక్స్ వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి (లైంగిక వ్యాధులు HIV/AIDS మొదలైనవి). 

ఆడవారిని సెక్స్ వస్తువులుగా చూపిస్తున్న నేటి సమాజంలో దేవుడు దృష్టిలో ఆడవారు ఎవరు ? పురుషులు స్త్రీల పట్ల ఏ విధమైన దృక్పథం కలిగి ఉండాలి ? 
ఇలాంటి చాలా విషయాలు బోధించడం జరిగింది.
ఆ తర్వాత వారిని ప్రశ్నలు అడగండి అని చెప్పడంతో, మంచి ప్రశ్నలు అడిగారు. 

Sex అనే పదాన్ని మరియు సెక్స్ చేయడాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్న జనరేషన్లో మనం ఉన్నాము. 
పెళ్ళికి ముందు సెక్స్ చేయకపోతే నువ్వు మగాడివి కాదు, పెళ్లికి ముందే చేస్తే నీకు అనుభవం వస్తుంది, తప్పేం లేదు అనే సమాజంలో మన యవ్వనస్తులు ఉన్నారు.

సెక్స్ మీద యవ్వన స్తులకు చాలా ప్రశ్నలు ఉంటాయి. అడగమని చెప్పాలి, ఆ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు కూడా మనం చెప్పాలి. లేదంటే బైట నేర్చుకొని అదే సత్యం అనుకుంటారు. 
సోషల్ మీడియాల్లో,సినిమాల్లో చాలా విపరీతంగా, విచ్చలవిడిగా, చెడ్డగా సెక్స్ గురించి చూపిస్తున్నపుడు, 
సత్యమైన దేవుని వాక్య పరంగా బోల్డ్ గా మనం మాట్లాడడంలో తప్పేం లేదని నేను అనుకుంటాను.

కుటుంబంలోనే ఈ డిస్కషన్స్ మొదలైతే చాలా మంచిది.
తండ్రి తన కొడుకు టీనేజీ వయసుకి రాగానే సెక్స్ గురించి తనకు చెప్పాలి. 
తల్లి తన కూతురితో కూడా మాట్లాడాలి.
సంఘం యవ్వనస్తులకు ఇటువంటి విషయాల్లో సెమినార్లు చేసి సరైన అవగాహన కలిగించాలి. 
దేవుడు కేవలం భార్యా భర్తల మధ్య మాత్రమే సెక్స్ అనుమతించాడు అనే విషయం యవ్వనస్తులు గుర్తుపెట్టుకునేలా,
లైంగిక సంబంధాల విషయంలో దేవుని దృక్పథాన్ని వారికి బోధించాలి.

- డా.శంకర్ బాబు 


Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...