Skip to main content

G20 - వసుదైవ కుటుంబం

ఆదిమ మానవునికి కులం మతం అనే సంగతులు తెలియవు. 
తెలిసిందల్లా ఆ రోజు కడుపు నింపుకోవడానికి వేటాడి తినడం. 
నేటి ఆధునిక మానవుడు కూడా దాదాపు చేస్తున్నదిదే.
కడుపు నింపుకోవడానికి కష్టపడడం.

అప్పటి మనుషులు గుంపులు గుంపులుగా బ్రతికేవారట. అంటే అందరూ కలిసి జీవించేవారు. ఇద్దరు ముగ్గురుగా వేటకి వెళ్ళి, తెచ్చిన పదార్థాలను కలిసి కూర్చొని తినేవారట.
వీరిలో రంగు వృత్తి అనే తేడాలు ఉండేవి కావు.

మనిషి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వచ్చిన మార్పులలో ఆకలి మారలేదు, కష్టపడడం మారలేదు, చెమట చిందించడం మారలేదు కానీ, ఇతర మనుషులతో వ్యవహరించే విధానం మారింది. 
ఇప్పుడు రంగు,కులం,మతం,చదువు, డబ్బు, నేపథ్యం ఇలా చాలా విషయాలను బట్టి ఇతర మనుషులతో వ్యవహరించే శైలి మారింది.

అభివృద్ధి చెందిన వారముగా చెప్పుకుంటున్న ఈ ఆధునిక మానవులు అంతరిక్షాన్ని సైతం అందుకుంటున్నారు కానీ, నేల మీద గల తోటి ప్రజలను కుల మత ప్రాంత సంపద అనే అడ్డుగోడలు కట్టి దూరం దూరంగా ఉంచుతున్నారు.

ఈ మధ్య G20 దేశాల సమావేశం ముంబైలో జరిగింది. ఎక్కడ చూసినా ఆ పోస్టర్లు కనిపించాయి. ఆ పోస్టర్ల మీద ఒక వాక్యం నన్ను ఆకట్టుకుంది. అదే "వసుదైవ కుటుంబకం". ఈ సంస్కృత పదానికి "ప్రపంచం ఒక కుటుంబం" అని అర్థం.
ప్రపంచం సంగతి పక్కన పెడితే మన దేశంలో ఈ వాక్యం అమలులో ఉందా ?
ఈ ప్రశ్నకు జవాబు, లేదు అని మనందరికీ తెలిసిందే.
కుటుంబంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. వివిధ రకాలైన ప్రజలు, వివిధ నేపథ్యాల నుండి వచ్చిన మనుషులు ఒక్కటే అనే తత్వం ఉంటుంది. 
కానీ, గోడల మీద, పోసర్ల మీద, సభలలో చెప్పడానికి మాత్రమే ఇలాంటి వాక్యాలు పనికొస్తాయి. చెప్పే వాళ్ళు సైతం పాటించని వాక్యం ఇది.
ఏ ఒక్క దేశానికో చెందిన సమస్య కాదిది.
ప్రపంచంలో ప్రతిచోట గల ప్రజల్లో ఈ రకమైన విబేధాలు ఉన్నాయి. 

ప్రపంచం ఒక కుటుంబం అవ్వాలంటే ప్రపంచంలో గల ప్రతి మనిషిని భగవంతుడు చేశాడు, ప్రతి వ్యక్తి మనలాంటి వాడే అనే సత్యాన్ని మనసుల్లో నింపుకోవాలి. 
మన పక్కనే గల వ్యక్తులను వారి రంగు,కులం,మతం,డబ్బు,చదువు మొదలైన వాటిని బట్టి కాకుండా, వారు కూడా మనలాంటి మనుషులే అని వారితో సమానంగా వ్యవహరించాలి.
ఇది ముందు మనతోనే మొదలవ్వాలి.

- డా.శంకర్ బాబు 





Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...