Skip to main content

పవిత్రమైన వివాహములో అపవిత్రమైన ఆచారం

వరకట్నం అనగా నేమి ?
వివాహ విషయములో పెళ్లికుమారుని
కుటుంబానికి, పెళ్లి కుమార్తెతో పాటుగా
ఆమె  కుటుంబీకులు ఇచ్చే డబ్బు,
వస్తు సంపదలను వరకట్నముగా
నిర్వచిస్తారు.

వివాహ శుభ  ఘడియకు ముందు
ఈ కట్న కానుకల
సంప్రదింపులు చాలా ముఖ్యమైనవిగా
పరిగణించబడుతాయి.


భారతదేశములో మొట్టమొదటిగా ఈ
ఆచారము ఎప్పుడు మొదలైందో
చెప్పడం కష్టమే.
ఆ రోజుల్లో ఆడపిల్ల తండ్రి తన ఆస్తిలో
కొంతభాగం బాధ్యతగా, కాబోయే
పెళ్ళికూతురికి ఇచ్చేవాడు.

తన కూతురు కొత్త ఇంటికి వెళ్తుందనే
ఆలోచనతో ఆమెకు సహాయంగా
డబ్బు, వస్తు సంపదను
ఇష్టపూర్వకంగా ఇచ్చేవారు.
కాలానుగుణంగా ఈ ఆచారము
ఇష్టపూర్వకమైన కానుక నుండి
దురాశతో నిండిపోయి
డిమాండ్ చేసే స్థాయికి దిగజారిపోయింది.


సమాజమును పట్టి పీడిస్తున్న సామాజిక
దురాచారమైన వరకట్న వ్యవస్థను
క్రైస్తవులు కూడా పాటించడం
చాలా  బాధాకరం.
కొందరు వరకట్నపు మూలాలను మరియు
చరిత్రను ఎరుగకుండా, మరికొందరు
డబ్బు మీద ఆశతో
ఈ దురాచారాన్ని పాటిస్తున్నారు.
క్రైస్తవ జీవితమునకు పునాదియైన
బైబిల్ గ్రంథము దీనిని గూర్చి
ఏమి  బోధిస్తుందో తెలుసుకోవాల్సిన
అవసరతయున్నదని
నమ్మబద్ధులమైయున్నాము.

వరకట్నం వాక్య విరుద్ధం అనడానికి గల
కారణాలు ఈ పుస్తకంలో వివరంగా
చర్చించాము. కొన్ని సంగతులు
క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను.
వరకట్నం చెరిపివేస్తుంది.
దేవుడే వివాహమునకు కర్త మరియు కేంద్రముగా
ఉండాలి కానీ, నేడు ఈ కట్నం పెళ్ళిళ్లకు
ప్రధాన కేంద్రబిందువుగా మారిపోయింది.
వివాహ పత్రికలో పరిశుద్ధ వివాహం అని ముద్రించి,
వెనకాల వరకట్నమనే అపరిశుద్ధ సంప్రదాయమును
చాలా క్రైస్తవులు పాటించడం బాధాకరం.

2.  ఒక అమ్మాయిని వివాహం చేసుకోడానికి ధనమును,
ఆస్తులను షరతుగా పెట్టినట్లయితే అది మనకు
వాటిపై గల దురాశను, వాంఛను తెలియజేస్తుంది.
ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ( 1తిమోతి 6:10).
కానీ నేడు ధనమే వివాహాలకు మూలం అన్నట్లుగా
క్రైస్తవులు వరకట్నపు ఆచారమును పోషించడం  దుఃఖకరం.

3. క్రీస్తు సంఘమును ప్రేమించి తనను తాను
అప్పగించుకొన్నట్లుగా,పురుషులు తమ భార్యలను
ప్రేమించవలెనని (ఎఫెసీ 5:25) ఆజ్ఞాపించబడ్డారు.
అనగా తన భాగస్వామి క్షేమాభివృద్ధికై
నిస్వార్థంగా ఇవ్వడమే ప్రేమ కలిగియుండడం.
తాను వివాహం చేసుకోబోయే అమ్మాయికి
ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ, అమ్మాయి దగ్గర
గల డబ్బు, వస్తువులను
ఆశించే వ్యక్తిగా ఉండుట సరియైనది కాదు.
ప్రేమను పక్కనబెట్టి వ్యాపార లావాదేవీలతో
వివాహం చేసుకోవడం ఖచ్చితంగా తప్పే.

4. మనుష్యులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు
వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి (మత్తయి 5:14-16).

దేవుని ఎరుగని వారు పాటించే ఈ సాంఘిక దురాచారమును
వెలుగు సంబంధులుగా పిలవబడే క్రీస్తు శిష్యులు
అనుసరించడం వలన, లోకస్తులకు ,
క్రైస్తవులకు తేడా లేకుండా పోతుంది.

5. మీ అధికారులకు లోబడియుండుడి అని చెప్పే
దేవుని ఆజ్ఞను వరకట్న ఆచారం అతిక్రమిస్తుంది.
భారత చట్టం ప్రకారం వరకట్నం డిమాండ్ చేయడం,
ఇవ్వడం, పుచ్చుకోవడం నేరం.
చట్టవ్యతిరేక పనులు చేసి దేవుడిచ్చిన ఆజ్ఞను
వ్యతికేరించడం పాపమే.  

భారత ప్రభుత్వం ఒక దురాచారాన్ని రూపు మాపడానికి
చట్టాన్ని తీసుకువచ్చిందంటే అది ఎంత తీవ్రమైన
ఫలితాలకు దారి తీసి ఉంటుందో మనం
ఒకసారి ఆగి ఆలోచించాలి.

ప్రియమైన యవ్వన క్రైస్తవులారా మరియు
క్రైస్తవ తల్లిదండ్రులారా, మీరు ఉప్పుగా,
అనగా లోకము ఎదుట మంచి సాక్ష్యం కలిగియున్నారా ?

కేవలం క్రైస్తవ పనులు అనగా వాక్యం చదవడం,
ప్రార్థన చేయడం, సువార్త చెప్పడం మాత్రమే కాక
సమాజ దురాచారాన్ని ఎదిరించి నిలబడే
క్రీస్తు శిష్యులుగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు.

వరకట్నం యొక్క పరిణామాలు,
వరకట్నమును సమర్థించుకోడానికి సాకులు మరియు
ఈ అంశము పై మరింత సమాచారమునకు
పూర్తి పుస్తకం చదవగలరు.

పుస్తకం యొక్క కాపీల కొరకై,

www.ekklesiabooks.com

మొబైల్ నం : 09581829219




Comments

  1. Praise the Lord
    Dear brothers and sisters and all

    All words are wonderful
    thank God ,thank u dear loving brothers in Christ Jesus ...

    Note add it new ...
    warning

    Obey and be blessed
    Disobey brings curse
    Choose for obey future good & great results for u dear friends

    Abraham son isaac obeyed for marriage , To his father ...All things see sacrifices time ...His himself Obeyed ... Because of that ...Great nation of Jacob sons 12 tribes .... Came

    My dear saved children of God
    God loves u , His desire up on u ..To obey ....Like him

    Should not accept culture of world
    Behind cures ....Is there...


    Obey God ways wonderful future ...For ...All
    So Reject Dowrry...
    And come out of lover of money ,

    but be Lover of God and word ,wife ...
    Gift ... Precious life ... Sweetheart....

    Take repent and and renuwal heart in jesus mighty love be fill in everyone ... To be blessed of holy way and Gods will bless u , jesus grace be with u all ....Thank u ....

    My hope let everyone obey and
    let everyone be blessed Amen

    Happy to share
    Make it like speed breaker} Warning note ..Add some reference

    This by Servert of God
    Few and sweet words for u ....


    Thank u so much Dead and great Holy Friends of God .......See u ...Tq

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...