Skip to main content

బుద్ధిగల మరియు బుద్ధిలేని కన్యకలు


 
అనేకమంది మత్తయి 25:1-13లో క్రీస్తు చెప్పిన బుద్దిగల కన్యకల ఉపమానములో పేర్కొనబడిన నూనెను పరిశుద్ధాత్మకు చిహ్నంగా వ్యాఖ్యానిస్తారు. నా ప్రశ్న ఏమిటంటే: కొంతమంది పరిశుద్ధాత్మను తక్కువగా కలిగియుండగా, మరికొందరు ఎలా ఎక్కువగా కలిగియుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తునందు విశ్వాసముంచిన వారి దేహాల్లో నివసిస్తాడు, ఆయన దేవుని కృప ద్వారా లభించిన వరముగా ఉన్నాడు.  అలాంటప్పుడు, ఈ ఉపమానములో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మను  ఇతరుల నుండి "కొనుక్కోవడం" ఎలా సాధ్యమవుతుంది? దేవుణ్ణి కొనుక్కోవడం సాధ్యమా? 

ఈ విధంగా అన్వయించడాన్ని Allegorism అంటారు. అంటే, దేవుడు ఉద్దేశించని, రచయిత ఉద్దేశించని విషయాన్ని పక్కనబెట్టి మనం అనుకున్నది వాక్యంలో జొప్పించి, ఆత్మీయ అర్థాన్ని ప్రకటించడం. ఇది చాలా ప్రమాదం. 

బుద్ధిలేని కన్యకలు అవిశ్వాసులను సూచిస్తున్నారు. ఎందుకంటే వారు రాగానే వారికి తలుపు మూసివేయబడింది. పెండ్లికుమారుడు వారితో "నేను మిమ్మలని ఎరుగను" అని చెప్పాడు. మత్తయి 7లో కూడా ప్రభువా ప్రభువా నీ నామంలో మేము దయ్యాలను వెళ్లగొట్టాము, అద్భుతాలు చేశాము అని చెబితే, నేను మిమ్మలని ఎరుగను అని క్రీస్తు చెబుతాడు. ఇక్కడ ఎరుగను అంటే ఆయనకు వీరెవరో అసలు మొత్తానికే తెలియదు అని అర్థం కాదు. ఎందుకంటే, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వజ్ఞాని కాబట్టి. ఇక్కడ నేను మిమ్మల్ని ఎరుగను అంటే "మీరు నాకు చెందినవారు కారు" అని అర్థం.  మరోవిధంగా చెప్పాలంటే, వారు రక్షించబడని వారు. ఈ ఉపమానము పెండ్లికుమారుడు అకస్మాత్తుగా వచ్చుటను వివరిస్తుంది మరియు అతని రాకడ కొరకు సిద్ధపరచబడుట యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

- డా. శంకర్ బాబు 

Comments

Post a Comment

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...