Skip to main content

సూది బెజ్జములో ఒంటె దూరడం




మత్తయి సువార్త 19 అధ్యాయంలో ధనవంతుడైన యవ్వనస్తుడునిత్యజీవం పొందడానికి నేనేమీ చేయాలిఅని ప్రభువుని అడిగినపుడునీకున్నదంతా అమ్మి బీదలకివ్వు, నీవు నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనం కలుగుతుందిఅని క్రీస్తు చెబుతాడు.

ఇక్కడ ప్రభువు, బీదలకు ప్రధానంగా సహాయం చేయమనే ఉద్దేశంతో మాట చెప్పడం లేదు, ధనవంతుడైన యవ్వనస్తునికి గల ప్రధాన సమస్య దాన ధర్మాలు చేయకపోవడం కూడా కాదు. ధనవంతుడైన యవ్వనస్తుడు తనకున్న ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం సమస్య. స్వార్థం ఆయన సమస్య. ఆయనకున్న సంపదే ఆయన సమస్య. దేవునికి ఆ వ్యక్తికి మధ్యగల అడ్డుగోడ ఆ వ్యక్తికి గల అధిక ధనమే. అందుకే, ప్రభువు దానిని అమ్మేసి తనను వెంబడించమని ఆజ్ఞాపించాడు. ఆ ధనవంతుడైన యవ్వనస్తుడు ఆ పని చేయలేక వెళ్ళిపోయాడు. 

క్రైస్తవులందరూ తమకున్న ఆస్తి మొత్తం అమ్మేసి తనను వెంబడించమని కూడా ప్రభువు ఇక్కడ చెప్పడం లేదు. ప్రభువు స్థానంలో ధనాన్ని పెట్టి, ప్రభువుని పక్కనబెట్టి స్వార్థంగా జీవించకూడదు అని ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు. 

మనకున్న ధనం దేవునికి మనకి మధ్య అడ్డుగోడలా నిలబడి మనం దేవుణ్ణి విడిచిపెట్టేలా చేస్తుంది. దేవుణ్ణి వెంబడించకుండా, తనని (ధనం) వెంబడించేలా చేసుకుంటుంది. ఈ లోకంలో ధనవంతునిగా చేసి, పరలోకానికి (నిత్యజీవానికి) వెళ్లకుండా చేస్తుంది. 

క్రైస్తవులు ఈ లోకంలో ధనవంతులు కాకపోవచ్చు కానీ క్రీస్తు కొరకు నిస్వార్థంగా బ్రతుకుతూ, ఇతరులను సేవిస్తూ, తమ డబ్బు క్రీస్తు రాజ్యం కొరకు వెచ్చిస్తూ పరలోకంలో ధనవంతులవుతారు. 

కానీ, చాలా మంది పరలోకంలో ధనవంతులవ్వడానికంటే ఇక్కడ ధనవంతులవ్వడానికి మాత్రమే ప్రయాసపడుతున్నారు. అది వ్యర్థమే అని ధనవంతుడైన సొలోమోను చెపుతున్నాడు (ప్రసంగి 2:1-11). 

పౌలు కూడా ఇదే విషయాన్ని రాస్తాడు : ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి (1 తిమోతి 6:9,10).


అలాగని, అసలు ధనం సంపాదించకూడదు అని బైబిల్ చెప్పడం లేదు. అదే 1 తిమోతి 6:17-19 వచనాల్లో పౌలు ఈ మాటలు రాస్తాడు : ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికకయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనముగలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.


మన సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు మొదలైన వాటిపై మన ఖర్చు, మనతో దాదాపు సమానంగా సంపాదిస్తున్న వారితో సమానంగా ఉంటే, మనం బహుశా చాలా తక్కువ ఇస్తున్నాము. మన దాతృత్వ జీవితం మనల్ని ఇబ్బంది పెట్టకపోతే, మనం దేవునికి ఇతరులకు ఇచ్చేది చాలా తక్కువ  అని నేనంటాను. మనం దాతృత్వానికి ఎక్కువ వెచ్చిస్తున్నందున, మనం కొన్నిటిని కొనాలని ఉన్నా కొనలేని స్థితిలో ఉండేలా జీవించాలి -C.S. లూయిస్


విధమైన క్రైస్తవ జీవితం జీవించుటకు ప్రభువు మనకు సహాయం చేయును గాక


డా.శంకర్ బాబు 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...