Skip to main content

విస్తారమైన కోత - పరిష్కారం ప్రార్ధన




 మత్తయి 9:37,38 - కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారుగనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను.


మాటలు యేసు ప్రభువు జన సమూహమును చూసి అన్నట్లుగా 36 వ వచనం మనకు చెబుతుంది. ఎంతో మంది వ్యాధులతో, బాధలతో ఆయన దగ్గరికి వచ్చారు. వారిని సరైన విధానంలో నడిపించే నాయకులు లేరు. బహుశా, పరిసయ్యులు ప్రజల మీద పెట్టిన కఠినమైన నియమాలను కూడా ఖండిస్తూ ఇక్కడ క్రీస్తు మాట్లాడుతున్నాడని కొంతమంది బైబిల్ పండితులు చెబుతారు


గొర్రెల వలె అని వాడినప్పుడు ప్రజలు కూడా బహుశా గాయాలతో, పాపంతో ఉన్నారని క్రీస్తు ప్రస్తావిస్తున్నాడు. వారికి దేవుని రాజ్యం గురించి  చెప్పే నిజమైన నాయకుల అవసరం ఉంది అని క్రీస్తు ఆనాడే చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు


ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రభువు చెబుతున్నాడు. కోతకు పనివారు కావాలి అయితే పనివారిని పంపుమని యజమానిని వేడుకోవాలి. అంటే ప్రార్థన చేయాలి

దేవుడు మాత్రమే దయచేసే పనికి పనివారిని దేవుడే పంపాలి, మనం ప్రార్థన చేయాలి

కేవలం ఒక ప్రాంతంలో నిలబడి అక్కడున్న జనసమూహాన్ని చూసి క్రీస్తు మాటలు చెబితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జన సమూహానికి వర్తించేలా ఇంకా ఎక్కువ పనివారు అవసరం ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు


ఇప్పుడున్న సంఘాలు చేయాల్సిన ప్రార్థన : దేవా, ఎంతో మంది దేవుడంటే తెలియక నశించిపోతున్నారు. వారిని చాలా మంది తప్పుదోవ పట్టిస్తున్నారు. విస్తారమైన జన సమూహాలు నిజ దేవుని గురించి తెలియక నరకానికి వెళ్తున్నారు. పనివారిని పంపు ప్రభువా! మమ్మల్ని కూడా పని చేయించుకో ప్రభువా


విచారకరంగా, చాలా సంఘాలు ప్రార్థన చేయట్లేదు, పనికొరకు సిద్ధపడట్లేదు. కేవలం స్వస్థత, అద్భుతాలు అంటూ నిజమైన సువార్తను పక్కనబెట్టేశారు


దేవా, కనికరించు, సంఘాలను ఉజ్జీవించు, పనివారిని పంపు, ప్రార్థన చేయడానికి మాకు పురికొల్పు ఇవ్వు


- డా.శంకర్ బాబు 


Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...