Skip to main content

మనకొరకు మీకా మాటలు

 


4:5 - సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు
మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.

రోజుల్లేనే ప్రజలు వివిధ దేవుళ్లు దేవతలను పూజించేవారు. అటువంటి ప్రజల మధ్య గల ఆయన నిబంధన ప్రజలు వారి దేవుడైన యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి అని మీకా ప్రవచిస్తున్నాడు.

స్మరించుకోవడం అంటే రోజంతా ఆయన నామాన్ని ఉచ్చరించడం కాదు, ఆయన అధికారం క్రింద ఉండి, ఆయనకు విధేయత చూపడం

1-4 వచనాల్లో అంతిమ విమోచన జరగబోతుంది, విమోచన కర్త తన పని సంపూర్ణం చేయబోతున్నాడు కావున మనం మన దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయన మాటలకు లోబడుతూ బ్రదుకుదాం, అని మీకా బోధిస్తున్నాడు

ఇది ప్రస్తుతం ఉన్న మనకు సరిగ్గా వర్తిస్తుంది. మన చుట్టూ వివిధ మతాలు, వారు పూజించే వివిధ దేవుళ్లు దేవతలు ఉన్నారు. వారు వారి దేవతలను దేవుళ్లను నిష్ఠగానే పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. తమ శరీరాలను నలగకొట్టుకుంటున్నారు, దూర ప్రయాణాలు చేస్తున్నారు, డబ్బు, బంగారం అర్పిస్తున్నారు, ఇతరులకు సాయం దానం చేస్తున్నారు

దేవుళ్లను దేవతలను సంతోషపర్చడానికి అవసరమైన కార్యాలను చేస్తున్నారు.


అయితే ఆయన నిబంధన ప్రజలమైన మనం ఏం చేస్తున్నాం

క్రియల ద్వారా కాకుండా కృప ద్వారా రక్షించబడిన మనం మన దేవుణ్ణి స్మరించుకుంటున్నామా

ఆయనకు లోబడి ఆయన మాటలకు విధేయత చూపడానికి ప్రయత్నం చేస్తున్నామా

ఆత్మీయ క్రమశిక్షణలను ఆనందంతో చేస్తూ కొనసాగుతున్నామా?

ఆయన మహిమ కొరకు సత్క్రియలు చేస్తూ దేవున్ని మహిమపరుస్తున్నామా

ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నామా?

ఆయన సంఘాన్ని సేవిస్తున్నామా?

ఆయన అంతిమ విమోచన దినం కొరకు ఆశతో ఎదురుచూస్తున్నామా


పరీక్షించుకుందాం, ప్రభువు రెండవ రాకడ దినం వరకు ఆయనను స్మరించుకుంటూ, ఆయన మాటలకు విధేయత చూపిస్తూ కొనసాగుదాం


  • డా. శంకర్ బాబు.

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...