Skip to main content

ఈ నెలలో ఆయన కొరకు


ప్రభువు పని చేయాలంటే నాకు సమయం లేదు, చాలా బిజీగా ఉన్నాను అని చాలా మంది చెబుతుంటారు. మనలో చాలా మందికి ఉన్న సమస్య సమయం లేకపోవడం కాదు, సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోవడం. అనవసరమైన విషయాలకు ఎక్కువ సమయం వెచ్చించడం ఆపగలిగితే చాలా సమయం, చాలా అవసరమైన విషయాలకు మనం వాడుకోగలం.

ఈ నెల ప్రారంభం నుండి నేను చేసిన విషయాలను మీ ప్రోత్సాహం కొరకు రాస్తున్నాను. 

 

1.    సిరిసిల్లలో పాస్టర్ల సమావేశంలో శారీరక ఆరోగ్యం మరియు ఆత్మీయ ఆరోగ్యం అనే అంశం మీద ప్రసంగం కొరకు దాదాపు 5-8 గంటల స్టడీ చేశాను. 

2.   పాస్టర్ అంతరంగం అనే పుస్తకం మళ్ళీ ఒక 50 పేజీలు చదివి అక్కడ వారికి బోధించాను (8th august).

3.   హామిల్టన్ రాసిన what is Biblical Theology పుస్తకం మొత్తం చదివాను (95 పేజీలు).

4.   Biblical Theology కి సంబంధించి ఇతర పుస్తకాలు ఆర్టికల్స్ దాదాపు 50 పేజీలు చదివాను.

5.   what is Biblical Theology సగం పుస్తకం తెలుగులో తర్జుమా చేసి discipleship training లో బోధించాను (10th august)

6.   Doctrine of God చదవడం యొక్క ప్రాముఖ్యతను గురించి చదివి, సిద్ధపడి సంఘానికి బోధించాను (14th august).

7.   జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎలా అనే సెమినార్ కొరకు singleness,marriage and the will of God అనే పుస్తకం అక్కడక్కడా దాదాపు 30 పేజీలు చదివాను (ప్రశ్న - జవాబుల కొరకు).

8.   ఆ సెమినార్లో నా టాపిక్ కొరకు దాదాపు 5-6 గంటల సమయం వెచ్చించాను, ఆ రోజు బోధించాను (15th august).

9.   ఎఫెసీ పత్రిక నుండి ప్రసంగం కొరకు రెండు 10-15 గంటలు సిద్ధపడి ప్రసంగం (పరిశుద్ధాత్మను దుఃఖరచకుడి) చేశాను (18th august). 

10.                 Ask pastor John 17వ ఆర్టికల్ ఎడిట్ చేసి దానికి వాయిస్ రికార్డింగ్ చేశాను (23rdausust).

11.                  రాబిన్ శర్మ రాసిన who will cry when you die పుస్తకం చదివాను ( 20th, 21stAugust ).

12.                 కవితలకు సంబంధించిన పుస్తకాల్లో గల కొన్ని కవితలు చదివాను. ఒక కవిత మరియు ఒక పాట రాశాను. ఆ పాట రికార్డింగ్ చేయడానికి రికార్డింగ్ స్టూడియోకి వెళ్లాను. 

13.                 ఇద్దరు విశ్వాసులకు కౌన్సిలింగ్ చేశాను.

14.                 కుటుంబంగా ఒక కుటుంబానికి ఆతిథ్యం ఇచ్చాము.

15.                 అనారోగ్యంగా ఉన్న సంఘ సభ్యులను దర్శించాను. 

16.                 ఆరోగ్య పరమైన సలహాలు సూచనలు కొందరికి చేశాను. 

17.                 ఇవన్నీ కూడా డాక్టర్ గా ఆస్పత్రికి వెళుతూ నా ఉద్యోగం నేను చేస్తూనే చేశాను. 

 

ఇవన్నీ నేను గొప్ప పనులు చేశాను అని డబ్బా కొట్టుకోడానికి కాదు, కేవలం మీ ప్రోత్సాహానికే పంచుకుంటున్నాను. 

దేవుడు ఈ పనులు చేయడానికి సహాయం చేశాడు. ఆయన ఇచ్చిన కృప మరియు బలం మరియు జ్ఞానం చేత కష్టపడ్డాను కాబట్టే దేవుడు సహాయం చేశాడు. 

Be encouraged My dear brothers and sisters

సామెతలు 12:27 – సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. 

ప్రియులారా, దేవుడు మనకిచ్చింది ఒకటే జీవితం, దానిని ఆయన కొరకు వెచ్చిద్దాం. 

దేవుడు మనందరికీ ఆ కృపనిచ్చును గాక. అమెన్.

 

-        డా.శంకర్ బాబు 

 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...