Skip to main content

తప్పటడుగులు

 


ఈ రోజు నా బైబిల్ రీడింగ్ ప్లాన్ ప్రకారం ఆదికాండం 27 వ అధ్యాయం చదువుతున్నాను. ఈ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక యదార్థ సంఘటన నుండి నాకు కలిగిన ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను. 

పాపం ఎంత తీవ్రమైనదోఅది ఎటువంటి ఫలితాలను తీసుకువస్తుందో మనం గ్రహించడానికి ఈ మాటలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. 

 

 ఆది 27:18,19 యాకోబు తన తండ్రి వద్దకు వచ్చి - నా తండ్రి అని పిలువగాఅతడు - ఏమి నా కుమారుడా నీవెవరివి అని అడిగెను. అందుకు యాకోబు - నేను ఏశావు అను నీ పెద్ద కుమారుడను 

ఇది మొదటి తప్పు. తన తల్లి చేయమన్నట్లుగా చేయడం వలన ఇప్పుడు తప్పులు చేయడం ప్రారంభించాడు. 


కొన్నిసార్లుదేవుడు చేయమన్నది చేయకుండాలోకం చేయమన్నది చేసినప్పుడు మనం కూడా ఇలాగే తప్పులు లేదా పాపం చేసే అవకాశం ఉన్నది.


27:20 అప్పుడు ఇస్సాకు నా కుమారుడాఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగాఅతడునీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను. 


రెండవ తప్పు. చేసిన తప్పు కప్పి పుచ్చుకోవాలంటే మరొక తప్పు చేయడం ఇక్కడ మనం చూడగలం. 

పాపం చేయడంఆ పాపం కప్పి పుచ్చుకోవడం మరో పాపం. ఒప్పుకోని ప్రభువు క్షమాపణ అడగడం క్షేమం. 

ఇక్కడ మరో తప్పు కూడా కనిపిస్తుంది. దేవుడే నా ఎదుటకి దాన్ని తెచ్చాడు. అంటే తన తప్పులో దేవుణ్ణి కూడా కలుపుతున్నాడు. 

చాలా సార్లుమనకు తోచింది చేసిదేవుడే చేయమన్నాడు అన్నట్లుగా చేసే ప్రవర్తన ఇలాంటిదే.

 

27:21 -ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. 


మరో తప్పు.  ఇస్సాకుఎందుకు ఇన్నిసార్లు ఈ ప్రశ్నలు,సందేహాలు అడిగాడుఎందుకంటేతనకి కూడా నమ్మబుద్ధి కావట్లేదు కాబట్టి. 

కానీతప్పు చేయడానికి కొన్నిసార్లు ఎంతవరకు వెళ్లొచ్చోఎంత చాకచక్యంగా పనిచేయొచ్చో యాకోబు బాగా నేర్చుకున్నాడు. 

పాపం చేయడానికి కొన్నిసార్లు మనం చూపే శ్రద్ధనైపుణ్యత దేవుని మాటలను పాటించడానికి చూపము. 

 

ఆ తర్వాత ఏమైంది

 

27:41తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావునా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవిఅప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. 


అన్నదమ్ముల మధ్య ప్రేమ పోయిపగ శత్రుత్వం పాతుకుపోయింది. 

పాపానికి ఉన్న శక్తి ఇదే. మరణాన్ని తీసుకువస్తుంది. 

ప్రజలతో గల సంబంధాలను నాశనం చేస్తుంది.

 

27:43,44నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకునీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము

కుటుంబం ముక్కలయ్యిందిమరణ భయం పంచన చేరింది.    

సామె 28:13 - అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడువాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.

సామె 14:25 - నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.

ఎఫెసీ 4:15 - ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకుమనమన్ని విషయములలో ఎదుగుదము.

 

           డా.శంకర్ బాబు 

 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...