Skip to main content

కాపరి చేయాల్సిన ప్రార్థన

ఆదివారం సంఘంగా కూడుకున్నపుడు చేసే పరిచర్యలలో ఒక పరిచర్య, సంఘ కాపరి సంఘం కోసం చేసే ప్రార్థన.నెలలో ఒక ఆదివారం సంఘ ఆరాధన సమయంలో దాదాపు 10 నిమిషాల పాటు సంఘ కాపరిగా నేను మా సంఘం కొరకు ప్రార్థన చేస్తాను.

యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. అపోస్తలుడైన పౌలు సంఘాల కొరకు ప్రార్థన చేశాడు.
సంఘ కాపరిగా సంఘము కొరకు ప్రార్థన చేయడం వాక్యానుసారమైన పరిచర్య.
వారమంతా ప్రతి విశ్వాసుల ఆత్మీయ,భౌతిక విషయాల కోసం కాపరి ప్రార్థన చేయాలి అని నేను నమ్ముతాను, అలా ప్రార్థిస్తాను.అయితే ఆదివారం చేసే ఈ ప్రార్థన అందరి కొరకు ఒకేసారి ఆత్మీయ విషయాల కోసం ప్రార్థించడం.

గత వారం మా ఆరాధన కార్యక్రమం అవ్వగానే ఒక సోదరి వచ్చి " అన్న, మీరు చేసిన ప్రార్థన నన్ను చాలా ప్రోత్సాహపరించింది. ముందు రోజు రాత్రి నాలో చెలరేగిన కలవరాన్ని పోగొట్టింది, థాంక్యూ " అని చెప్పింది. 
దేవునికి స్తోత్రము.

దేవుడు మన పరిచర్యలను చూస్తున్నాడు. సంఘ క్షేమాభివృద్ది కొరకు మనం చేసే ప్రతి పరిచర్యను దేవుడు వాడుకుంటాడు.అందుకే, సంఘంగా కలవడానికి వచ్చే ముందు " దేవా, ఈ రోజు నన్ను ఎవరికైనా ప్రోత్సాహకరంగా వాడుకో " అని ప్రార్థన చేసి రావడం అలవాటు చేసుకోవాలి. కేవలం ప్రార్థన మాత్రమే చేయకుండా, సంఘములో సభ్యులను కలిసి మాట్లాడి బాగోగులు అడిగి ప్రార్థించి ప్రోత్సాహకరంగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయాలి.

కేవలం పాస్టర్ మాత్రమే ప్రార్థన చేస్తే దేవుడు చాలా శ్రధ్ధగా విని జవాబిస్తాడు అనే మాటలను నేను నమ్మను.కాపరిగా నేను కూడా ఎన్నో శోధనలు, సవాళ్లు ఎదుర్కుంటాను.అలాంటి బలహీనమైనవాడనైన నేను చేసిన ప్రార్థనను దేవుడు ఒకరిని ప్రోత్సాహకరంగా వాడుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లించాను.

కాపరులారా, దేవుడు మీకు అప్పజెప్పిన మంద కొరకు ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చేయకండి.విశ్వాసులారా, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చేయకండి.

- డా.శంకర్ బాబు 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...