Skip to main content

క్రికెట్ నేర్పిన సంఘ పాఠాలు


కొన్ని రోజుల క్రితం సంఘాలుగా కలిసి క్రికెట్ ఆడాము. ఇలా ఆడటానికి గల ముఖ్య ఉద్దేశం, సంఘాలుగా కలిసి పనిచేయడానికి గల సహవాసం పెంపొందించడానికీ మరియు ప్రేమ సంబంధాలు కట్టుకోవడానికి

రోజంతా చక్కగా క్రికెట్ ఆడటానికి దేవుడు మంచి స్థలం, వాతావరణం దయచేశాడు. మధ్య మధ్యలో వర్షం కురిసినా, మళ్ళీ ఆడేందుకు వాతావరణం చక్కగా సమకూర్చాడు

అయితే, రోజు క్రికెట్ ఆడడం ద్వారా దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను


1. క్రికెట్ ఆటలో జట్టులోని సభ్యులందరూ కలిసి ఆడినప్పుడే విజయం లభిస్తుంది

మా జట్టు బౌలింగ్ చేసినపుడు చక్కగా బౌలింగ్ చేసేవారికి మాత్రమే అవకాశం ఇవ్వబడింది

బ్యాటింగ్ చేసినపుడు మొదటగా బ్యాటింగ్ లో నైపుణ్యం కలవారికే మొదట అవకాశం ఇవ్వబడింది

జట్టు నాయకుడు ఇతరులతో కలిసి ఎవరిని ముందుగా పంపాలి అనే నిర్ణయం చేసాడు

అలాగని మిగతా వారు తక్కువ స్థాయి కలవారు అని అర్థం కాదు

జట్టుకి ఎప్పుడు ఏది అవసరమో ముందు దానికి ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే అని ఇక్కడ గమనించాలి


సంఘములో కూడా ఇదే జరుగుతుంది. సంఘము ఒక జట్టుగా చేసే పరిచర్య

ఎవరైతే దేవుని తలాంతులు వరాలు కలిగి ఉంటారో వారికి అవకాశం ఇవ్వబడుతుంది

అలాగని మిగతా వారు అసలు దేనికీ అవసరం లేని వారని కాదు

మిగతా వాళ్ళు కూడా ఇది మన జట్టు కొరకే మన సంఘము కొరకే అని సంతోషపడాలి

సంఘ క్షేమం కొరకు మొదటగా ఎవరు దేవుడిచ్చిన వరం ద్వారా వాడబడతారో సంఘ కాపరికి తెలుసు కాబట్టి విధమైన అవకాశాలు ఇస్తాడు

(1 కొరింథీ 12:6,7).


2. జట్టులో ఎవరో ఒకరు ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేసి ఇతర జట్టులోని వారిని అవుట్ చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన సంగతి. అంత మాత్రాన ఇద్దరు బౌలర్లు మాత్రమే గ్రౌండ్లో ఆడరు. వారికి ఇతర ఆటగాళ్ల సహాయం అవసరం.

తను వేసే బంతి పట్టుకోడానికి కీపర్, ఫీల్డర్లు కావాలి. ఇతర జట్టులోని ఆటగాళ్లను అవుట్ చేయడానికి ఇతరులు క్యాచ్ పట్టాలి లేదా బంతి విసిరి రన్ అవుట్ చేయాలి

జట్టులో ఒకరిద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఎక్కువ రన్స్ కొడతారు కానీ జట్టులో ఇతరుల సహాయం లేకుండా చేయలేరు. అసలు ఒక్కడే బ్యాటింగ్ చేయలేడు


సంఘ పరిచర్య కూడా అంతే. దేవుడు సంఘ క్షేమం కొరకు కొంత మందిని వాడుకుంటున్నపుడు ఇతరులు వారికి సహాయం చేయాలి. లేదంటే సంఘము క్షేమాభివృద్ధి చెందదు

అది ఎంత చిన్నదైనా, పెద్దదైనా ఇతరులతో కలిసి పని చేస్తేనే అందరికీ క్షేమం. ఇక్కడ సహాయం చేసేవారి పాత్ర చాలా విలువైనది. అప్పుడే సంఘ పరిచర్య ప్రభావవంతంగా ఉంటుంది (1 కొరింథీ 14:26).  


దేవుని సంఘములో కాపరులు ఆత్మీయ నాయకులుగా ఉండి సంఘమును వాక్యములో,ప్రార్థనలో నడిపిస్తుంటారు. పరిచారకులు సంఘములో గల ఇతర అడ్మినిస్ట్రేషన్ పనులు చూసుకుంటుంటారు. కానీ, సంఘ సభ్యులు వీరికి సహరించకపోతే పని జరగదు

కాపరులు ముందుగా అందరికీ నాయకులుగా కనిపించి పరిచర్య చేస్తారు కానీ ఎవరికీ కనిపించకుండా సభ్యులు చేసే పనులు కూడా దేవుడు మెచ్చుకునేవే


3. చివర్లో ఒక క్రికెట్ జట్టు విజయం సాధిస్తుంది. జట్టు మొత్తానికి కప్ ఇస్తారు. కేవలం ఎక్కువ వికెట్స్ తీసుకున్నవారికి, ఎక్కువ పరుగులు తీసినవారికి కాదు. అంటే జట్టు మొత్తానికి విజయం ఆపాదిస్తారు ఒకరిద్దరికి కాదు. 

సంఘము అంటే దేవుని కుటుంబం. కుటుంబానికి గల ఒక లక్షణం, ఐక్యత

క్రీస్తు తన సంఘము ఐక్యంగా ఉండాలని ప్రార్థించాడు ( యోహాను 17:11), ఆజ్ఞాపించాడు (ఎఫెసీ 4:1,2). 


దేవుడు అటువంటి సంఘాలుగా మన సంఘాలు ఉండడానికి సహాయం దయచేయును గాక


NOTE : మా సంఘమే గెలిచిన జట్టు


- Dr. Shankar Babu 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...