Skip to main content

నా శ్రమలలో ఎక్కడున్నావు దేవా ?

 










ఇన్ని బాధలు పడుతున్నాను,
ఎక్కడున్నావు దేవా?
ఇంతగా శ్రమలు నన్ను ఇబ్బంది
పెడుతున్నాయి,ఏమైపోయావు దేవా?
ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు
మనందరం వేసినవారమే.

మన కష్టాల్లో మొదటిగా ప్రశ్నించేది దేవున్నే.

అంతా సాఫీగా సాగిపోతున్నపుడు
రాని ఈ ప్రశ్నలు,
శ్రమలు పలకరించగానే పుంఖాను పుంఖాలుగా
పుట్టుకొస్తుంటాయి.


కొందరు సూటిగా ప్రశ్నించక పోయినా
ప్రభువా, అసలు మా గూర్చి నీకు చింత లేదా
అనే మాటలను మాటి మాటికీ నెమరు వేస్తూ
కాలం వెళ్లదీస్తుంటారు.


కానీ, ఈ ప్రశ్నలకు బైబిల్ ఎప్పుడో జవాబులు
ఇచ్చేసింది. ఇక్కడ సమస్య
జవాబులు దొరక్క కాదు,
జవాబులను అంగీకరించి,
అన్వయించుకోకపోవడమే.

నిజమా అని మీరు ఆశ్చర్యపడేలోపు
మనుష్యులు శ్రమల్లో ఉన్నపుడు
దేవుడు ఎక్కడ ఉంటాడో,ఎక్కడ ఉన్నాడో
బైబిల్ నుండే చూపించే ప్రయత్నం చేస్తాను.


దానికంటే ముందు దేవునికి గల
ఒక ప్రాముఖ్యమైన గుణ లక్షణం గురించి
మాట్లాడుకుందాం.

దేవుడు ఆత్మ.అంటే ఆయనకు శరీరం
ఉండదు. ఈ ఆత్మ అయిన దేవుడు
అన్ని ప్రదేశాల్లో తన ఉనికిని పూర్తిగా
కలిగి ఉంటాడు.అందుకే దేవుడు
సర్వవ్యాపి అని అంటుంటారు.

సర్వవ్యాపి అయిన దేవుడు,
మనుష్యులు శ్రమల గుండా వెళ్లనప్పుడు
ఎక్కడ ఉంటాడో, అదే మనుష్యులు
శ్రమల గుండా వెళ్ళినపుడు కూడా
అక్కడే ఉంటాడు అనే విషయం ముందుగా
మన బుర్రల్లో గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి.

సరే, ఇక బైబిల్లో కష్టాల గుండా వెళ్లిన ప్రజలను,
ఆ కష్టాల్లో దేవుడు ఎక్కడ వారిని పలకరించాడో
ఇప్పుడు చూద్దాం.


మొదటిగా, యోసేపును అడుగుదాం.
యోసేపు, నీ అన్నలే నిన్ను గుంటలో పడేశారు,
ఇష్మాయేలీయులకు అమ్మేశారు.
పోతీఫరు చేత చేయని తప్పుకు చెరసాలలో
బంధింపబడ్డావు,
ఎన్నో కష్టాలు అనుభవించావు.
దేవుడెక్కడ అనే ప్రశ్న నీకు రాలేదా?

ఆది 39:20,21-యోసేపు చెరసాలలో ఉండెను,
అయితే యెహోవా యోసేపునకు
తోడైయుండెను అనే ఈ వచనం చూపించి,
నా శ్రమలలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు
అని యోసేపు జవాబు చెప్తాడేమో.

రెండవదిగా, దానియేలుని ప్రశ్నిద్దాం.
అదేంటయ్యా, శ్రేష్టమైన బుద్ధి గలవాడవై
ప్రధానులలో ప్రఖ్యాతి గలవాడవై,
నమ్మకస్తుడవైన నిన్ను
సింహాల బోనులో పడేసారు కదా.
యెహోవా దేవా, నేనేం తప్పు చేశాను,
అసలు ఎక్కడున్నావు
అని ఎందుకు ప్రశ్నించలేదు అని
దానియేలుని అడుగుదాం.

ఆప్పుడు దానియేలు 6:22 నేను నా దేవుని
దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఆయన
తన దూతను పంపించి
సింహములు నాకు ఏ హాని చేయకుండా
వాటి నోళ్లు మూయించాడు,
అక్కడే ఆ సింహాల బోనులోనే దేవుడు
నాతో ఉన్నాడు అని మనకు జవాబిస్తాడేమో !

మూడవదిగా, యేసు క్రీస్తు శిష్యులను
అడుగుదాం.
మీరున్న దోనెమీద పెద్దతుఫాను రేగింది కదా,
ప్రభువా మీకు చింత లేదా అని
ప్రశ్నించారు కదా !
ఎక్కడున్నాడు దేవుడు ఆ సమయంలో ?
అప్పుడు,క్రీస్తు మాతో పాటు అదే దోనెలో
ఉన్నాడు,మేమే నమ్ముకలేక భయపడ్డాం,
దేవున్ని ప్రశ్నించాం అని మనకు శిష్యులు
హిత బోధ చేస్తారేమో (మార్కు 4:35-41)!

చివరిగా, ఈ ఇద్దరు పెద్ద మనుష్యులను కూడా
అడిగేద్దాం రండి.
హలో, పౌలు సీల సార్లు,అసలే చాలా
దెబ్బలు తిన్నారు, కాళ్ళకు చేతులకు సంకెళ్లు వేసి,
కరెంటు లేని చీకటి గుహలో గల
చెరసాల్లో మిమ్మల్ని పడేశారు.
బాగా నొప్పి, జీవితం మీద నిరాశ,
చస్తే బాగుంటుంది అనే నిస్పృహ
ఇవన్నీ ఉండాల్సిన సమయంలో
వెరైటీగా పాటలు పాడుతూ,
దేవునికి ప్రార్థన చేశారట కదా!
అసలు ఎక్కడున్నావ్ దేవా,
ఇంతగా మేము బాధపడుతుంటే
నీకు పట్టట్లేదా అసలు నువ్వు మమ్మల్ని
ప్రేమిస్తున్నావా అని కదా ప్రశ్నించాలి.

అప్పుడు పౌలు సీలలు,
మీకింకా అర్థం కాలేదా,ఆ మధ్యరాత్రి వేళ,
ఆ చీకటి చెరసాలలో,
మా శ్రమల సంద్రంలో,అక్కడే దేవుడున్నాడు,
అందుకే మేము ఆయన్ను కీర్తించాం
ప్రార్థించాం
అని నవ్వుతూ జవాబిస్తారేమో
(అపోస్త 16:19-26) !

మన జీవితంలో శ్రమలు,మన పాపం వల్ల
కలిగిన ఫలితాలు.
అవి మనతో ఉండాల్సిందే, మనం వాటితో
పయనించాల్సిందే.
శ్రమల ద్వారానే మనం సంపూర్ణతలోకి
ఎదుగుతాం,
సర్వాధికారియైన దేవునిపై ఇంకా
ఆధారపడతాం.
ఆ శ్రమలలోనే దేవుడు మనకు
తోడుగా ఉంటాడు.

ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము
మీతో కూడా ఉన్నాను (మత్తయి 28:20) అని
యేసు చెప్పిన మాటకి,
యుగ సమాప్తి వరకు మనకు కలిగే శ్రమలలో,
కష్టాలలో, కన్నీళ్లలో
దేవుడు తోడై ఉంటాడు అని అర్థం.

శ్రమలలో దేవున్ని ప్రశ్నించడం కాదు,
దేవున్ని స్తుతించడం నేర్చుకోవాలి.









Comments

Post a Comment

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...