Skip to main content

క్రీస్తు కేంద్రిత కుటుంబం


 






నేటి రోజుల్లో చాలా మంది భార్యా భర్తలు
సరియైన వాక్యానుసారమైన అవగాహన
లేకపోవడం వల్ల,
తిట్టుకుంటూ, కొట్టుకుంటూ అంతే కాక
విడాకులు కూడా తీసుకొని, కుటుంబాలను
విచ్ఛిన్నం చేసుకుంటున్నారు.
ఇది సమాజానికి, ఆ కుటుంబంలో గల పిల్లలకి
మంచి పరిణామం కాదు.

భార్యా భర్తలు తమతమ బాధ్యతలు
చక్కగా నిర్వర్తించినప్పుడు ఆ కుటుంబం
స్థిరంగా నిలబడుతుంది.

ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ,
నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు
ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను.

I. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి (ఎఫెసీ 5:33)

ఏ విధంగా ప్రేమించగలం?

1. నీ భార్యతో ప్రత్యేక సమయం గడపడం.
అంటే, రోజువారీ పనుల్లో మాట్లాడే
మాటలు కాకుండా,
ఒక ప్రత్యేక సమయంలో తను ఎలా ఉంది,
తనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా,
తను ఏమైనా నీ నుండి ఆశిస్తుందా
అన్న ప్రశ్నలు వేస్తూ చర్చించుకోవాలి.

2. నీకు వీలైనప్పుడల్లా, కొన్నిసార్లు
వీలుచేసుకొని ఇంట్లో పనుల్లో
నీ భార్యకి సహాయం చేయడం.

3. భర్తగా, కుటుంబ పెద్దగా నువ్వు తీసుకునే
నిర్ణయాల్లో తన అభిప్రాయం కూడా తీసుకోవడం.
అంతిమ నిర్ణయం నీదే అయినా
నీ భార్య అభిప్రాయం తీసుకోవడం
ఆమెని ప్రేమించే అవకాశం పొందుకోవడమే.

4. ఆత్మీయ విషయాల్లో ఆమెను ప్రోత్సాహపర్చడం,
సంఘములో తను ఇతర చెల్లెళ్ళతో అక్కలతో
ప్రేమ సంబంధాలు పెంచుకునేలా,
వాళ్లకు మాదిరిగా ఉండేలా చూడడం.

5. ఆమె ఇంట్లో చేస్తున్న పనులు,బాధ్యతలను బట్టి
ఆమెను అభినందించడం, వెన్ను తట్టి ప్రశంసించడం.

6. తన ఆరోగ్య విషయంలో జాగ్రత్త
కలిగి యుండడం, తన లైంగిక అవసరాలు
కూడా తీర్చడం.


7. నీ భార్యను గురించి ఇతరుల
( ఫ్రెండ్స్&ఫ్యామిలీ మెంబెర్స్ ) మందు
చులకనగా మాట్లాడకపోవడం.


II. భార్యలారా, మీ భర్తలకు లోబడియుండుడి
( ఎఫెసీ 5:22,33)

లోబడియుండడం బలహీనత కాదు,
రెండవ తరగతి జీవితం కూడా కాదు.
లోబడుట దేవుని దృష్టిలో విధేయత.

ఎలా లోబడి ఉండగలం ?

1. నీ భర్తను గౌరవించడం.
బైట పని చేసి ఇంటికి రాగానే
ప్రేమగా పలకరించడం,
నీళ్ళిచ్చి, భోజనం పెట్టడం.
సాధ్యమైనంత వరకు ఇతరుల ముందు
పేరు పెట్టి పిలవకపోవడం.

2. మీ అభిప్రాయం చెబుతూనే,
భర్త నిర్ణయానికి సరే అని చెప్పడం.

3. నీ భర్తను గురించి ఇతరుల
( ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబెర్స్ ) ముందు
చులకనగా మాట్లాడకపోవడం.

4. నీ భర్త కష్టపడుతున్న విషయంలో
అప్పుడప్పుడూ ప్రశంసించడం,
అతన్ని ప్రోత్సహించడం.

5. నీ భర్త నీకు దేవుడు కాడు కానీ,
వాక్య ప్రమాణాలకు కట్టుబడి,నీ భర్తకు లోబడటం,
దేవునికి లోబడటమే అని అంగీకరించడం.
అలా అని, పాపం విషయంలో లోబడాల్సిన
అవసరం లేనే లేదు.

6. తన లైంగిక అవసరాలు తీర్చడం.
అలా అని అడ్డూ అదుపు లేని
అంచనాలకు లోబడక,
సున్నితంగా తిరస్కరించడం.

ఒక్క మాట గుర్తుంచుకోవాలి,
దేవుడు ఉద్దేశించిన ప్రకారం
కుటుంబం కట్టుకోవాలంటే,
దేవుని వాక్యానికి లోబడి
బ్రతకాల్సిందే.

- డా.శంకర్ బాబు



Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...