Skip to main content

శిక్ష తప్పించేదెవరు ?

హైదరాబాదులో నవంబర్ నెలలో జరిగిన
సంఘటన యావద్భారత దేశాన్ని కలిచివేసింది. 
అంతకు ముందు కూడా ఎన్నో సార్లు
ఇటువంటివి జరిగినా, ఈసారి జరిగిన సంఘటన
వేగంగా దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది.
అది డాII ప్రియాంక పై జరిగిన అత్యాచారం
మరియు ఆమె సజీవ దహనం.

అత్యంత దారుణంగా,కిరాతకంగా ఆ అమ్మాయిని
హత్య చేయడం ఎంతో మందిని బాధించింది.
ఆ నలుగురు కుర్రాళ్ళు చేసిన ఈ పైశాచికకార్యాన్ని
దేశమంతా ముక్త కంఠంతో ఖండించింది.
మనం కూడా ఇటువంటి చర్యలను
ఖండించాల్సిందే. 

ఈ పని చేసిన వారిని తమకు అప్పగించమని,
వారిని మేమే చంపుతాం అని ప్రజలు
పోలీస్ స్టేషన్ ముట్టడించి ధర్నాలు చేయడం
కూడా మనందరికీ తెలిసిందే. 
ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో ఆ నలుగురు
చనిపోవడం చూసి,వారు చేసిన పాపానికి
తగిన శిక్ష పడిందని ప్రజలు సంబరాలు
చేసుకున్నారు. 


అవును,వారు చేసింది పాపమే,వారికి
శిక్ష పడాల్సిందే. ఎందుకంటే
ప్రతి తప్పుకు,పాపానికి శిక్ష తప్పనిసరి కాబట్టి. 

అయితే, దయచేసి నన్ను కొన్ని ప్రశ్నలు
అడగనివ్వండి. 


వ్యభిచారపు చూపుతో ప్రతి రోజు హృదయంలో
వ్యభిచారం చేస్తున్న వారికి పడాల్సిన శిక్ష ఏమిటి ? 


అక్రమ సంబంధాలతో కుటుంబ సభ్యుల
హత్యలకు ఆత్మహత్యలకు కారణమవుతున్న
వారికి ఇవ్వాల్సిన శిక్ష ఏమిటి ?

పెళ్ళికి ముందే లైంగిక సంబంధాలు కలిగి
వ్యభిచరిస్తున్న టీనేజీ యువత పరిస్థితి ఏమిటి ?


అశ్లీల వీడియోలు,సినిమాలు చూస్తూ
పాపము చేస్తున్న యవ్వనస్తులకు రావాల్సిన
శిక్ష ఏమిటి? 


అబద్ధాలాడుతూ, మోసంచేస్తూ, అన్యాయం,
అవినీతిలో అభివృద్ధిచెందుతున్నవారికి
పడాల్సిన శిక్ష ఏమిటి? 


ఎందుకంటే, చిన్నదైనా, పెద్దదైనా
పాపం పాపమే కదా.
ఆ కుర్రాళ్లు తప్పు చేసి దొరికారు అందుకే
మన దృష్టిలో వారు దుర్మార్గులయ్యారు.
ఎవరికీ దొరక్కుండా, కనబడకుండా మనం చేసే
పైన చెప్పబడిన తప్పుల సంగతేమిటి? 


ఒకవేళ ఆ నలుగురు వారుచేసిన తప్పుకు
ఫలితం అనుభవిస్తుంటే, మన కన్నులతో,
ఆలోచనలతో పనులతో చేసే
ప్రతి తప్పుకు కూడా మనం శిక్షను
అనుభవించాల్సినవారమైయున్నాం.


ఏమిటా శిక్ష ? 


మనిషి చేసే ప్రతి పాపము దేవునికి విరోధమైనది
కాబట్టి, దేవుడు పాపమును, పాపిని ద్వేషిస్తాడు
కాబట్టి, మనిషి దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు.
దేవుడు స్వభావరీత్యా న్యాయవంతుడు కావున,
మనిషి యొక్క పాపమును బట్టి
శిక్షించువాడైయున్నాడు.

ఆ శిక్షనే చారిత్రక గ్రంథమైన బైబిల్
నరకముగా నిర్వచిస్తుంది. 

ఈ లోకములో నేను ఏ తప్పుచేయలేను అని
చెప్పేవారు లేనే లేరు.
ఏ కులానికి చెందినా ఏ మతానికి చెందినా
ఏ ప్రాంతానికి చెందినా మనందరం పాప స్వభావం
కలిగి ఎదోరకంగా పాపము చేస్తున్నవారమే,
మనకు రావాల్సిన శిక్షదేవుని ప్రమాణాల ప్రకారం
నిత్య నరకమే.


శిక్షను తప్పించేదెవరు ?


ఒకవేళ ప్రియాంకను చంపిన వారు పోలీసు
కాల్పుల్లో చనిపోకపోయినా, జీవిత ఖైదులుగా
లేదా ఉరిశిక్షకు పాత్రులుగా చేయబడేవారు.
ఎందుకంటే, పాపానికి తగిన మూల్యం
చెల్లించాల్సిందే కాబట్టి.  

మరి మన పాపములకు ఎవరు వెల చెల్లిస్తారు?
ఎవరు మనలను మన శిక్ష నుండి తప్పించగలరు? 
ప్రతి మనిషి కూడా పాపానికి దాసుడే కాబట్టి
మన పాప ప్రాయశ్చిత్తం మరొక వ్యక్తి చెల్లించలేడు.

ఈ సమస్యను పరిష్కరించేదెవరు? 


తననితాను రక్షించుకోలేని నిస్సహాయతలో ఉన్న
పాపులని రక్షించుటకు దేవుడు ఈ లోకమునకు
రావాల్సిన అవసరం ఏర్పడింది.
ఆ విధంగా దేవుడే మానవుడిగా రెండువేల
సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు.
ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.

అంతే కాకుండా, వెల చెల్లించకుండా పాపముకు
విడుదల లేదు కనుక పాపులైన ప్రజల నిమిత్తం
యేసు క్రీస్తు ప్రభువు మరణానికి తనను తాను

అప్పచెప్పుకున్నాడు.

రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు
అనే మాటను నెరవేర్చేలా, సమస్త మానవాళి
పాప ప్రాయశ్చిత్తం కొరకు, యేసు క్రీస్తు ప్రభువు
తన ప్రాణము అర్పించాడు. 

మానవ పాపములను వాటి ఫలితమైన
దేవుని ఉగ్రతను సిలువలో భరించి,
మానవ శిక్షను ఆయన అనుభవించాడు. 
తనను నమ్మినవారిని , పాపమునుండి,
శాపము నుండి విడుదలనిచ్చుటకై
సిలువలో మరణించాడు. 
అంతే కాక మూడవ దినమున మరణము
జయించి తిరిగి లేచాడు. 

ఎవరైతే యేసుక్రీస్తు వద్దకు వచ్చి, తమ పాపాలు
ఒప్పుకొని, ప్రాయశ్చిత్త మనసుతో ఆయనయందు
విశ్వాసముంచుతారో వారిని నిత్యనరకము
నుండి,  ఆత్మీయ మరణము నుండి రక్షించి,
నిత్య జీవము అనుగ్రహిస్తానని, తన వాక్యమైన
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సెలవిచ్చాడు. 


ప్రియాంకను చంపిన ఆ నలుగురే కాదు,
పాపముతో మలినమైన తన ప్రజలందరినీ
రక్షించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు.

ప్రియ సోదరా, సోదరీ, నీ కొరకు మరణించిన
యేసును విశ్వసించు, నిత్య శిక్ష నుండి
విడిపించబడి నిత్యజీవముతో
నిత్య రాజ్యములో నివసించు.

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...