Skip to main content

నూతన విశ్వాసులు కాపరిగా పరిచర్య చేయవచ్చా?

నేటి దినాలలో కొంతమంది ప్రభువును
కొత్తగా విశ్వసించి, ఆ పిదప తమకు తాము
సంఘకాపరులుగా ప్రకటించుకుంటూ
స్థానిక సంఘాలను మొదలుపెడుతున్నారు.
పరిచర్య చేయాలనే మంచి ఆశతోనే వారు
సంఘాలను స్థాపిస్తున్నను, దేవుని వాక్యము
కొత్తగా ప్రభువును నమ్ముకున్న వ్యక్తి
సంఘ కాపరిగా ఉండడానికి
ఒప్పుకుంటుందా లేదా చూసే ప్రయత్నం చేద్దాం.


అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన
మొదటి పత్రిక మూడవ అధ్యాయం
1-7 వచనాలలో సంఘ కాపరికి
ఉండాల్సిన లక్షణాలను విశదీకరించాడు.
6వ వచనంలో "అతడు క్రొత్తగా చేరినవాడై
యుండకూడదు "అని పౌలు చెబుతున్నాడు.
అనగా, యేసు ప్రభువును కొత్తగా అంగీకరించి
మరియు స్థానిక సంఘమునకు కొత్తగా
అంటుకట్టబడిన వ్యక్తి సంఘకాపరిగా
ఉండడానికి వాక్యం అనుమతించట్లేదు
అని మనం అర్థం చేసుకోవాలి.

ఎందుకు పౌలు ఈ విధమైన నియమం
విధించాడు ?  

కొన్ని సంగతులు ఇక్కడ విశదీకరించే ప్రయత్నం చేస్తాను .


1.కొత్తగా ప్రభువును విశ్వసించిన వ్యక్తికి
లోతైన వాక్యపు సత్యములు తెలియదు.
అవి తెలుసుకోడానికి చాలా సమయం
పడుతుంది.
సంఘముకు వాక్యమును బోధించవలసిన
బాధ్యత గల కాపరి, ముందుగా
దేవుని వాక్యంనుండి నేర్చుకోవాల్సిన
వాడైయున్నాడు.
పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుడు
ఎంతో చదివి, పరీక్షలు వ్రాసి
తన సబ్జెక్టును విద్యార్థులకు బోధిస్తాడో,
అదే విధంగా దేవుని వాక్యమనే సబ్జెక్టును
సంఘమునకు బోధించుటకు ముందు
కాపరి ఎంతో చదవాల్సినవాడై యున్నాడు.


2.బోధ చేయడానికి ముందు, ఆ వ్యక్తి
1-7 వచనాలలో చెప్పబడిన
దైవిక లక్షణాలు కలిగియుండడం
చాలా ప్రాముఖ్యం.
ఎందుకనగా నాయకుని బోధ కన్నా
తన మాదిరికరమైన జీవితం
శక్తివంతమైన ప్రభావం చూపిస్తుంది.
ఈ లక్షణాలు కొత్త వ్యక్తిలో గమనించి
పరీక్షించడానికి కొన్ని రోజులు లేదా
నెలలు పట్టే అవకాశమున్నది.


ఇక్కడ ఒక ప్రశ్న. ఎవరు పరీక్షిస్తారు?  

సంఘమే పరీక్షించాలి.
అనగా ఒక వ్యక్తి కాపరిగా పరిచర్య చేయాలంటే,
ఆ వ్యక్తిని స్థానిక సంఘమే పరీక్షించి
ఎన్నుకొని ఆమోదించాలని అర్థం.
అనగా తమంతట తామే కాపరిగా
ప్రకటించుకొని సంఘమును
మొదలుపెట్టుట ఆరోగ్యకరమైనది
కాదని తెలుసుకోగలం.


3. కొత్త వ్యక్తికి కాపరిగా అధికారమిస్తే ఆ వ్యక్తి
గర్వాంధుడై, సాతానుకు లోబడి
పాపం చేసే అవకాశమున్నదని (వ6)
పౌలు చెబుతున్నాడు.
ప్రతి విశ్వాసి పాపము చేయుటకు
అవకాశమున్నను
పరిణితి చెందిన వ్యక్తి, తనకు ఎదురయ్యే
శోధనలు దేవుని జ్ఞానముతో  ఎదుర్కొంటు,
సంఘమునకు మాదిరిగా నిలబడతాడు.


4. సంఘమును కాయడం అనగా తండ్రివలె
దేవుని కుటుంబమును దేవునిలో పెంచి
పోషించే కార్యం.
వారి తప్పులు సరిచేస్తూ, స్వంత జ్ఞానంతో కాక
దేవుని నియమాలను అనుసరిస్తూ
కౌన్సిలింగ్ చేయడం, వారి ఆత్మీయ స్థితిని
అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా
ప్రోత్సహించడం అనే పనులు
పరిణితి చెందిన వారికే కాని,
కొత్త వ్యక్తికి సాధ్యం కాదు.
ఎందుకంటే కొత్త వ్యక్తికి సంఘ సభ్యుల
ఆత్మీయ స్థితిని గూర్చిన అవగాహన
సంపూర్ణముగా ఉండదు కాబట్టి.


5.సంఘ కాపరులను సాతానుడు ఎక్కువగా
శోధించుటకు ప్రయత్నిస్తుంటాడు.
నాయకుడు పడిపోతే సంఘము కూడా
చెదిరిపోవుటకు ఆస్కారం ఉంటుంది కావున
కాపరులను ఇబ్బంది పెట్టుటకు సాతాను
ప్రయత్నిస్తుంటాడు.
కొత్త విశ్వాసి, వాడి కుతంత్రములు
తెలుసుకొలేక పడిపోయే పరిస్థితి
కలగవచ్చు.
క్రీస్తులో ఎదిగిన విశ్వాసి వాక్యపు శక్తి, ప్రార్ధన,
దేవుని జ్ఞానము, అనుభవం కలిగినవాడై
వాడిని ఎదుర్కొనుటకు సిద్ధముగా
ఉంటాడు.


దేవుని యందు విశ్వాసం, సంఘ సహవాసం,
వాక్య జ్ఞానం, ప్రార్థనా జీవితం ఇవన్నీ
కొనసాగిస్తూ స్థానిక సంఘములో
నమ్మకమైన పరిచర్య చేయుట
ప్రతి నూతన విశ్వాసి యొక్క
కర్తవ్యమైయున్నది.
దేవుడు తగిన సమయంలో ఆయనకిష్టమైన
రీతిలో సంఘము ద్వారా కాపరిగా
నియమించువరకు మనకు
అప్పగింపబడిన పనిని చేస్తూ కొనసాగుదాం.

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...