Skip to main content

వ్రాయడం ఒక క్రమశిక్షణ

 

రోజు మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామంటే దానికి ఒక ప్రధానమైన కారణంపుస్తకాలు. 

మన విద్యా విధానంలో గల పుస్తకాలు చదివి మనం ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాంవ్యాపారాలు చేస్తున్నాంసంస్థలను నడుపుతున్నాం. అంతేకాదు, ప్రతి దేశానికి ఆ  దేశంలో నాయకులు, ప్రజలు ఏ విధంగా పనిచేయాలి? వారికున్న బాధ్యతలు ఏమిటి? వారు పాటించాల్సిన నియమాలు ఏమిటి? అనే సంగతులు కలిగిన పుస్తకం ఉంటుంది. అందుకే, దేశాలను నడిపించేది కూడా పుస్తకాలే అని మనం అనొచ్చు. 

అందువల్లే, ఒకాయన “ చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో,” అన్నాడు. పుస్తకాల్లో గల సాహిత్యంలో, సంగతుల్లో ఉన్న శక్తి అలాంటిది. 

 

అయితేవ్రాయడం అనేది కొందరికి మాత్రమే ఉండే దేవుని వరం. 

రోజూ ఏదో ఒకటి రాయడం వారికి అలవాటుగా ఉంటుంది. 

వ్రాయడం, దేవుడు వరంగా ఇచ్చినాఆ వరాన్ని క్రమశిక్షణగా వాడే వారే ఎక్కువగా వ్రాయగలరు. క్రమశిక్షణ కలిగి వ్యాసాలు పుస్తకాలు రాయడం అందరూ చేయలేరు. 

 

ఎందుకంటే, ఒక వ్యాసం లేదా పుస్తకం రాయడం సామాన్యమైన విషయం కాదు. ఎంతో ఆలోచించాలిసరైన పదాలు వాడాలిఆ పదాలను సరైన వాక్యాలుగా అల్లాలిమధ్యలో ఉదాహరణలు జోడించాలిఇదంతా చాలా ఒత్తిడితో కూడిన పని. చాలా సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. 

ఇతర పనులు పక్కనబెట్టి మనసును కేంద్రీకరించి ఆలోచనలను పేపరు మీద పెట్టాలి. కానీ, ఇవేవీ రచయితలకు భారం అనిపించవు. 

 

నాకెంతో ఇష్టమైన టిమ్ ఛాలీస్ అనే రచయిత “గాయకులు పాడతారురన్నర్లు పరుగెత్తుతారుచిత్రకారుల పెయింట్ వేస్తారు మరియు రచయితలు వ్రాస్తారు.వారు రాయాలని కలలు కంటారు,కాబట్టి వారు వ్రాస్తారు. వారు వ్రాయుటను ఆనందిస్తారుకాబట్టి వారు వ్రాస్తారు,వారు వ్రాయుటకు పిలువబడ్డారుకాబట్టి వారు వ్రాస్తారు ” అని అంటాడు.

 

ఒక వ్యాసం లేదా పుస్తకం పూర్తిగా సిద్ధం అయ్యాకఅవి కొందరికైనా ఉపయోగకరంగా ఉంటే వచ్చే ఆనందం ముందు రాయడానికి పడిన శ్రమ మొత్తం ఎగిరిపోతుంది. ఇతరులను దేవుని మాటలతో ప్రభావితం చేయడం అనే మంచి పని చేసిన సంతృప్తి దొరుకుతుంది.

 

ఇక్కడ వ్రాయడం అనే క్రమశిక్షణ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటేక్రైస్తవ సమాజంలో సరైన అర్ధవివరణతో క్రైస్తవ రచనలు వ్రాసేవారి సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోవడం నేను గమనిస్తున్నాను. 

మొబైల్ ఫోన్స్ వాడకం ఎక్కువయ్యాక పుస్తకాలు కొని చదవడం తగ్గిపోయిందివ్రాసేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. 

 

క్రైస్తవ నాయకులు కూడా సాహిత్యం వ్రాయడం కన్నాప్రసంగాలు చెప్పడం సులభమని ఎక్కువగా ప్రసంగ పరిచర్యకు సమయం ఇస్తుంటారు. 

నేను ప్రసంగ పరిచర్యను ఇక్కడ తక్కువ చేయడం లేదు. నేను కూడా ప్రసంగీకూడనే. 

కూర్చొని వ్రాసే సమయం చాలా ఎక్కువ కాబట్టిఅంత సమయం ఇవ్వలేము కాబట్టి మిగతా పనులు చేయడం మీద దృష్టి పెడుతున్నారు. వీరిలో వ్రాసే వరం ఉన్నవారు కూడా ఉన్నారు. 


సి ఎస్ లూయిస్ అనే క్రైస్తవ రచయిత “ప్రపంచానికి ఎక్కువ క్రైస్తవ సాహిత్యం అవసరం లేదు. మంచి సాహిత్యాన్ని వ్రాసే ఎక్కువమంది క్రైస్తవులు అవసరం” అన్నారు. 

 

మీకు వ్రాసే అలవాటు ఉంటే, దానిని మెరుగుపర్చుకొని మంచి క్రైస్తవ సాహిత్యం రాయండి. చిన్న చిన్న పేరాలు రాయడం మొదలుపెట్టండి. ప్రతి రోజూ రాయడం అలవాటు చేసుకోండి. మీకు తెలిసిన రచయితల సహాయం తీసుకోండి. 

చదివే అలవాటు లేకపోతే వ్రాసే అలవాటు ఉండదు అంటారు, కావున ఇతర పుస్తకాలు చదవండి. 

దేవుడు మీకు దయచేసిన వరమును పదునుపెట్టి, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడండి.


- డా.శంకర్ బాబు. 



Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...