Skip to main content

యేసుక్రీస్తు vs తల్లిదండ్రులు

మార్కు 3:31-35లోయేసుక్రీస్తు సహోదరులు, ఆయన తల్లియైన మరియ వచ్చారని వారు యేసును వెదకుచున్నారని యేసుతో చెబుతారు. అప్పుడు యేసు, తన చుట్టూ కూర్చున్న వారిని చూచి “ఇదిగో నా తల్లి, నా సహోదరులు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి” అని చెప్పాడు. 

ఈ మాటలు చదివినపుడు, యేసుక్రీస్తు తన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని మనకు అనిపించొచ్చు. 

 

అంతేకాదు, ఎవరైనా తనను వెంబడించాలనుకుంటే తన తల్లినైనను, తండ్రినైనను, సహోదరులనైనను, సహోదరీమణులను, తన స్వంత ప్రాణమునైనను విడిచిపెట్టి, తన సిలువనెత్తుకుని వెంబడించకుంటే,వారు నా శిష్యులు కానేరరు (లూకా 14:26,27) అని చెప్పడం కూడా చూస్తాం. 

ఈ మాటలు చదివినపుడు, యేసుక్రీస్తు ప్రభువు, తనను ఎవరైనా వెంబడించాలంటే తల్లిదండ్రులను విడిచిపెట్టమని చెప్పినట్లుగా మనకు అనిపించొచ్చు. 

 

కానీ, క్రీస్తు చెబుతున్న విషయం అది కాదు. క్రీస్తే స్వయాన తన తల్లిదండ్రులతో కలిసి ముప్పై సంవత్సరాలు వారికి లోబడి జీవించాడు (లూకా 2:51).  

మార్కు 3:31-35లో, క్రీస్తు చెప్పదల్చుకున్న ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఎవరైతే దేవుని మాటలకు లోబడి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారే దేవుని పిల్లలు. దేవుని చిత్తానికి లోబడకుండా ఉన్న వారు భౌతికపరంగా కుటుంబసభ్యులే అయినప్పటికీ ఆత్మీయంగా కారు. క్రైస్తవ జీవితం అంతిమంగా ఆత్మీయసంబంధమైన జీవితమే కదా!

ఇక క్రీస్తు తన తల్లిదండ్రులను విడిచి నన్ను వెంబడించుమని చెప్పినప్పుడు, దేవుణ్ణి వారి తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్థానంలో ఉంచకుండా, దేవుడే ప్రప్రథమ ప్రాధాన్యతగా కలిగి, దేవుణ్ణి అనుసరించమని చెబుతున్నాడు. 

దేవుడు తప్ప ఇంకెవరూ దేవుని స్థానంలో ఉండకూడదు, అది తల్లిదండ్రులైనా లేదా అక్కాచెల్లెళ్లైనా లేదా అన్నాతమ్ముళ్లైనా!


క్రీస్తు, తన తల్లియైన మరియను ప్రేమించాడు, ఆమె పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు. సిలువ మీద నుండి “ఇదిగో నీ తల్లి” అని తన శిష్యునికి ఆ బాధ్యతను అప్పగించాడు (యోహాను 19:27).  

క్రీస్తు, పరిశుద్ధాత్మ ద్వారా “పిల్లలారాప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడిఇది ధర్మమే.

నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము (ఎఫెసీ 6:1,2) అని రాయించాడు. 

 

ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం : దేవుడు మన సృష్టికర్త. ఆయనే మన తల్లిదండ్రుల లైంగిక కలయిక ద్వారా మనల్ని పుట్టించాడు,ఆయనే తల్లి గర్భంలో మనల్ని రూపొందించాడు,ఆయనే తల్లి గర్భం నుండి మనల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు,ఆయనే రక్షణ దయచేశాడు,ఆయనే నడిపిస్తున్నాడు,ఆయనే మనల్ని పరలోకానికి తీసుకెళ్లడానికి రాబోతున్నాడు. ఆయనకు మాత్రమే మన జీవితంలో మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. 

ఒకవేళ దేవునితో మన సంబంధాన్ని నాశనం చేసేది మన తల్లిదండ్రులైనా, కుటుంబ సభ్యులైనా వారిని దేవుని స్థానంలో ఉంచకుండా ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మీయ జీవితాల్లో నిర్ణయాలు తీసుకోవాలి, దేవుణ్ణి మహిమపర్చాలి.

 

-  డా.శంకర్ బాబు. 

 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...