Skip to main content

ఒకవేళ

 


ఒకవేళ ఆదాము పాపం చేయకపోతే ఏమయ్యేది? ఒకవేళ హవ్వ అపవాది మాటలను నమ్మకుండా ఉంటే ఏమయ్యేది?  ఒకవేళ ఆదాము హవ్వలు జీవ వృక్ష ఫలం తింటే ఏం జరిగేది? 

ఈ ప్రశ్నలు ఊహాజనితమైనవి. ఎందుకంటే, ఇవన్నీ కూడా దేవుడు ఉద్దేశించిన సృష్టి పతనం విమోచన నూతన సృష్టి అనే దేవుని పనికి వేరుగా అడుగుతున్న ప్రశ్నలు. 

మన థియాలజీ "ఏమైయుండవొచ్చు" లేదా "ఒకవేళ"  అనే ప్రశ్నలపై కట్టే ప్రయత్నం చేయకూడదు. దేవుడు తన చిత్తంలో ఏం చేశాడు అనే దానిపై మాత్రమే మన థియాలజీ కట్టుకోవాలి. 

దేవుడు మనిషి పతనం గురించి ముందే అవగాహన లేనివాడు కాడు. ఆయన సర్వజ్ఞాని. అందుకే ఆదాము హవ్వల పాపం దేవుణ్ణి ఆశ్చర్యపరిచి ఉండదు. ఎందుకంటే ఆయన విమోచన ప్రణాళికలో భాగంగా ఆ పతనాన్ని అనుమతించాడు. అనుమతించడం, పాపాన్ని ఆమోదించడం ఒకటిగా చూడకూడదు. ఒకవేళ ఆమోదిస్తే పాపానికి శిక్ష వేయకూడదు. కానీ దేవుడు పాపాన్ని శిక్షించాడు. ఇక్కడ దేవుని సార్వభౌమత్వం, మనిషి బాధ్యత రెండూ మనకు కనిపిస్తాయి. తన సార్వభౌమ చిత్తంలో తన ప్రణాళిక నెరవేర్చడానికి తద్వారా తన మహిమ నిమిత్తం దేవుడు పతనాన్ని అనుమతించాడు. 

మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనిషి చేసిన పాపాన్ని దేవుడు ఒక మంచి పనికి వాడుకున్నాడు. అదే క్రీస్తు ద్వారా రక్షణ కార్యం. క్రీస్తు ద్వారా రక్షణ ప్రణాళికను దేవుడు జగత్తు పునాదికి ముందే రచించాడు. సిలువ కార్యం ముందుగానే సిద్ధం చేశాడు. ఈ విధంగా చేయడానికి దేవుడు నిశ్చయించాడు అంటే దేవునికి మరో ప్రణాళిక లేదని అంటే Plan B లేదని మనం అర్థం చేసుకోవాలి. 

'' మన దేవుడు పరలోకమందున్నాడు; ఆయన తనకిష్టమైనదంతయు చేయుచున్నాడు. '' — కీర్తన 115:3

కావున, మనము ఊహాజనిత ప్రశ్నలతో కాకుండా ఆయన తన గ్రంథంలో మనకు తెలియజేసిన ఆయన  ప్రత్యక్షతను అంగీకరించాలి. ఈ ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల్లో సైతం సంపూర్ణ సత్యం మనకు దొరకదు. దేవుని చిత్తము పరిపూర్ణమైనది, ఆయన ప్రణాళిక మార్పులేనిది, ఆయన ఉద్దేశములు మంచివి. వాటిలో సంతృప్తిగా సేద తీరే క్రైస్తవులుగా ఉందాం. 

రోమా 11:33-36  : ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

- డా.శంకర్ బాబు 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...