Skip to main content

క్రైస్తవుడు, స్థానిక సంఘానికి అంటుకట్టబడి ఉండవలెనా ?

మొదటిగా నూతన నిబంధన, సంఘమును
గూర్చి ఏమి బోధిస్తుందో చూద్దాం.

సంఘమనగా,యేసుక్రీస్తు నందు
విశ్వాసం ద్వారా ,
రక్షించబడిన వ్యక్తుల సమూహం.
ఈ సంఘమును క్రీస్తు శరీరముగా బైబిల్
నిర్వచిస్తుంది.

యేసుక్రీస్తు ప్రభువు, నా సంఘమును నేను
కట్టెదను అనగా నా ప్రజలను నేను
కట్టెదను అని బోధించాడు.

ఆయన శిష్యులు అపోస్తలుల కార్యముల
అధ్యాయములో ఆదిమ సంఘస్థాపన
మరియు విస్తరణలో పాల్గొన్నారని
మనకు తెలిసిందే.

ఎక్కడెక్కడైతే సువార్త విత్తనం నాటబడిందో,
ఆ ప్రదేశాలలో దేవుడు తన శిష్యులతో
స్థానిక సంఘములను స్థాపించాడు.

ఉదాహరణకు, థెస్సలొనిక  పట్టణముకు పౌలు
వెళ్లి సువార్త బోధించిన పిదప(ఆపోస్త 17:1-3)
అక్కడ సంఘము ఆవిర్భవించింది.
పౌలు ఎఫెసీ పట్టణమునకు వచ్చి
(అపోస్త 19:1-7) అక్కడ గల
12 మంది పురుషులతో
సువార్త పంచుకొని ప్రార్థన చేసి వెళ్లిన తర్వాత
అక్కడ సంఘముగా విశ్వాసులు
కూడుకొనుట మొదలయింది.

ఆ పిదప పౌలు వివిధ ప్రదేశాలలో గల
“స్థానిక సంఘములకు” పత్రికలను
పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసి  వాటిని
మన ప్రోత్సాహం కొరకు
బైబిల్ గ్రంథంలో అందించాడు.

దేవుని ప్రణాళికలో  స్థానిక సంఘము
ప్రాధాన్యమైనదని నూతన నిబంధన గ్రంథం
మనకు తెలియజేస్తుంది.

విశ్వాసి బాధ్యత

యేసుక్రీస్తు ప్రభువు ప్రజలను వారి
పాపములనుండి రక్షించుటకు వచ్చెను.
ఈ రక్షించబడిన వ్యక్తులను తన శరీరములో
సభ్యులుగా ఆయన పరిగణిస్తున్నాడు
(1కొరింథీ 12:27).
సంఘము ఆయన శరీరమైనప్పుడు,
విశ్వాసి ఒక స్థానిక సంఘమునకు
అంటుకట్టిబడి యుండుట
ఆవశ్యకరమైయున్నది.

అంతే కాక, సంఘమును దేవుని ఇల్లు
మరియు కుటుంబముగా కూడా
బైబిల్ బోధిస్తుంది (ఎఫెసీ 2:19).
ఆయన ఇంటిలో రక్షించబడిన వ్యక్తులు
సభ్యులుగా మరియుదేవుని పిల్లలుగా
కొనసాగుతారు.
దేవుని పిల్లలమైన మనము ఆయన
కుటుంబానికి అంటుకట్టబడి యుండుట
తప్పనిసరియైయున్నది.

ఒక కుటుంబములో పుట్టిన బిడ్డ
మానసికముగా, శారీరకంగా ఎదగడానికి
కేవలం పాలు, భోజనం మాత్రమే సరిపోవు.
కుటుంబ సభ్యుల సహవాసం, సహాయం
మరియు ప్రోత్సాహం అవసరం.

అదేవిధంగా క్రీస్తులో జన్మించిన వ్యక్తి
ఆత్మీయ ఎదుగుదలకై సహాయం మరియు
ప్రోత్సాహం అవసరమే.
స్థానిక సంఘ సహవాసములో
ఆత్మీయ అభివృద్ధిని విశ్వాసి పొందుకోగలడు.

కొందరు, నేను రక్షించబడ్డాను,
ఏ స్థానిక సంఘమునకు వెళ్ళను
అని వాదిస్తుంటారు.
వాక్యం ఈ ప్రవర్తనను అంగీకరించదు.

రక్షించబడటం, క్రీస్తు సంఘములో సభ్యులవడం
విడదీయలేని మరియు
ఒకేసారి జరిగే ప్రక్రియ అని గమనించాలి.  
సార్వత్రిక సంఘము, స్థానిక సంఘముల
కలయికనే కదా.

మరికొందరు,ప్రతి ఆదివారం వివిధ సంఘాలకు,
కార్యక్రమాలకు హాజరవుతుంటారు కానీ
ఒక ప్రత్యేకమైన సంఘమునకు
అంటుకట్టబడి ఉండరు.
ఈ సంఘము సరిగా లేదు, అక్కడ ప్రజలు
ప్రేమించరు  అని సాకులు  చెబుతుంటారు.
ఇది కూడా ఆత్మీయ జీవితమునకు
మంచిది కాదు.

ఇంటిని వదిలి తిరిగే వారిని దేశదిమ్మరి
అన్నట్లుగా వీరిని ఆత్మీయ దిమ్మరులుగా
చెప్పొచ్చు.

ఈ ప్రపంచములో కొరత లేని సంపూర్ణమైన
సంఘము ఏదీ లేదు.
వాక్యానుసారమైన బోధ, ప్రేమ సహవాసం గల
సంఘమును గుర్తించి
ఆ సంఘమునకు అంటుకట్టబడి ఉండడం
మంచిది.
దేవుడు తన చిత్తములో తన సమయములో
సంఘమును నీకు ఆశీర్వాదకరముగా
వాడుకుంటాడు.

ఈ విషయం మరవద్దు : దేవుడు మనలను
ఇతర విశ్వాసులతో కలసి ఆరాధించుటకు,
కలసి సువార్త పనిచేయుటకు,
కలసి జీవించుటకు ఎన్నుకున్నాడు.

క్రీస్తు సంఘముకై మరణించాడు,
క్రీస్తు తన సంఘమును కడుతున్నాడు,
క్రీస్తు తిరిగి తన సంఘముకై తిరిగి
రాబోతున్నాడు.  
ఆ క్రీస్తు సంఘములో (స్థానికంగా)
సభ్యుడవకుండా
జీవించడం వాక్యానుసారమైనది కాదు.

ప్రతి వ్యక్తి ఒక స్థానిక సంఘముతో నిబంధన
చేసుకున్నప్పుడే దేవుడు సంఘములోని
సభ్యులద్వారా ఆ వ్యక్తిని
ఆత్మీయ జీవితములో
అభివృద్ధి చెందిస్తాడు.

దేవుడు సంఘమును తన ప్రశస్త రక్తముతో
విమోచించి దయచేసినాడు,
ఆ సంఘములో సభ్యుడిగా స్థానికంగా
దేవుని కొరకు బ్రతుకుటే
మన బాధ్యతయై యున్నది.

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...