యేసుక్రీస్తు ప్రభువు పునరుత్తానుడైన తరువాత "మీరు సర్వ లోకమునకు వెళ్లి సువార్త ప్రకటించి శిష్యులను చేయుడి" అని శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ప్రతి తరంలో గల క్రీస్తు శిష్యులకు వర్తిస్తుంది. సువార్త సందేశం ప్రజలకు చెప్పే బాధ్యత విశ్వాసులందరిది. ప్రతి సంఘము సువార్త పరిచర్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. విశ్వాసులను సువార్త ప్రకటన చేయాలని సంఘ నాయకత్వం ప్రోత్సాహించాలి. ఈ క్రిస్మస్ సీజన్లో సువార్త చేయడానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని, దేవుని శుభవార్తను ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మా సంఘంలో గల విశ్వాసులు వారి కాలనీలో, అపార్ట్మెంట్లో చిన్న క్రిస్మస్ మీటింగ్ ఉంది రండి అని ఇరుగుపొరుగు వారిని పిలవమని చెప్పాం. అలా దాదాపు నాలుగు ప్రదేశాలలో సువార్త ప్రకటనకు ప్రణాళిక సిద్ధమయ్యింది. కేవలం క్రీస్తుని ఎరుగని వారినే ఆహ్వానించమని చెప్పాము. మొన్న ఒక మీటింగ్, నిన్న మరో మీటింగ్ ప్రభువు కృపలో ముగించబడినాయి. సంఘమంతా పాల్గొని పరిచర్య చేశారు. ఈ వారం మరో రెండు సువార్త మీటింగ్స్ ఉన్నాయి. ప్రసంగీకులుగా సువార్త సభల్లో లేదా క్రిస్మస్ మీటింగ్స్ లో బోధించడం వల్ల ఒకే సారి చాలా మందికి సువార్త చెప్ప...