ఎందుకు కాదో ఈ మాటలు చదివితే మనకు అర్థమవుతుంది.
రక్షించబడిన తర్వాత మనలో ఇంకా పాపం ఎందుకుంది అంటే, పాపం యొక్క అధికారం నుండి మరియు అంతిమ ఫలితం అంటే నిత్య నరకం నుండి విడిపించబడ్డాం. మనం సంపూర్ణంగా పాపము యొక్క ఉనికి నుండి విడుదల చేయబడలేదు.
పాపము మనల్ని శోధిస్తుంది, తన ఉచ్చులో పడేయాలని ప్రయత్నం చేస్తుంది. మనం మనలో గల పాప స్వభావం వలన ఆ శోధనకు ఆకర్షించబడి పాపం చేస్తాం.
ఇక్కడ శోధన బైటి నుండే రావొచ్చు కానీ అంతరంగంలో గల భోగేచ్ఛల వలన పాపం చేస్తాడు అని వాక్యం చెబుతుంది.
యాకోబు 1:14- ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.
యాకోబు 4:1 - మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?
యోహాను విశ్వాసులకు రాస్తూ 1 యోహాను 1:8 లో "మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు" అంటాడు.
పేతురు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనే మాటను 1 పేతురు 1:14 లో రాస్తాడు. అసలు పాపము చేసే అవకాశమే లేకపోతే, మనం సంపూర్ణంగా పవిత్రులమైతే ఆ ఆజ్ఞ పరిశుద్ధాత్ముడు రాయించేవాడు కాదు.
అందుకే, యేసుక్రీస్తుతో కలిసి జీవించిన పేతురు క్రీస్తు ఎవరో తెలియదు అని అబద్ధం చెప్పాడు. అననీయ సప్పీరాలు పరిశుద్దాత్మకు వ్యతిరేకంగా పాపం చేసి వేషధారులయ్యారు, పౌలు తనను తాను ప్రధాన పాపి అని పిలుచుకున్నాడు.
సంపూర్ణ పాపరహిత స్థితి కేవలం పరలోకంలో మాత్రమే మనం పొందుకుంటాము. అప్పటి వరకు దేవుని వాక్యముతో, దేవుని సంఘముతో కలిసి పాపముతో పోరాటం చేస్తుంటాము.
- డా. శంకర్ బాబు
Comments
Post a Comment