గత వారం ముంబైలో జరిగిన ఒక క్రైస్తవ కాన్ఫరెన్స్ కి తెలుగు రాష్ట్రాలనుండి దాదాపు 100కి పైగా పాస్టర్లు, సంఘములో బోధకులు, పరిచర్యలో వాడబడుతున్న వారు హాజరవడం జరిగింది.
మాకు తెలిసిన బ్రదర్స్ తో కలిసి మేము ట్రైన్లో వెళ్ళాము. వెళ్తున్నపుడు వచ్చేటపుడు మాతో పాటు ఉన్న సహోదరులు చేసిన ఒక పని నన్ను బాగా ఆకట్టుకుంది. అదేమిటంటే వారందరూ యేసుక్రీస్తును విశ్వసించకముందు వారి జీవితం, సువార్త ఎలా విన్నారు, ఎలా దేవుడు రక్షించాడు అని ఒకరితర్వాత ఒకరు పంచుకోవడం.
వీరందరూ వివిధ సంఘాలకు చెందినవారు, వివిధ వయసుల్లో ఉన్నవారు, వివిధ ప్రదేశాలనుండి వచ్చినవారు కానీ, ఒకే దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని పరస్పర ప్రోత్సాహం కొరకు పంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
ఊరికే పిచ్చాపాటి మాటలు మాట్లాడకుండా, క్రీస్తులో క్షేమాభివృద్ధి కలిగించే మాటలు వారి ప్రయాణంలో, సహవాస సమయంలో వారు కలిగియుండడం నేను గమనించాను.
ఇతర విశ్వాసులతో మనం సమయం గడిపేటపుడు ఏం మాట్లాడుతున్నాం? పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాం ?
ఒకసారి పరీక్షించుకుందాం.
ప్రియ క్రైస్తవ సోదర సోదరీమణులారా, ప్రభువు త్వరలో రాబోతున్నాడు. మన సమయాన్ని సహవాసాన్ని క్రీస్తు కేంద్రీకృతమైనదిగా చేయడానికి దేవుడు మనకు సహాయం దయచేయును గాక.

Comments
Post a Comment