అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు.
చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు.
తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు.
కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనని నమ్ముకున్న వారు శ్రమల గుండా హింస గుండా వెళ్తారని, క్రీస్తు కొండమీద ప్రసంగంలో ముందుగానే చెప్పాడు: “నీతి నిమిత్తం హింసింపబడినవారు ధన్యులు” (మత్తయి 5). చార్లీ కర్క్ ఆ ధన్యుల్లో ఒకరిగా ఇప్పుడు నిలిచిపోయాడు.
చార్లీ జీవితం మనకు నేర్పే పాఠాలు:
సత్యాన్ని విశ్వసించాలి – సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది.
సత్యం కోసం నిలబడాలి – ఎటువంటి కష్టమైనా వచ్చినా వెనుకాడకూడదు.
సత్యాన్ని ప్రకటించాలి – యేసు చెప్పినట్టుగా సమస్త లోకానికి సువార్తను తెలియజేయాలి.
సత్యం కోసం చావడానికైనా సిద్ధంగా ఉండాలి – శరీరమును మాత్రమే చంపువారిని కాదు, ఆత్మను రక్షించగల దేవుని భయపడాలి.
చార్లీ కర్క్ జీవితాన్ని పరిశీలించినప్పుడు మనకు ఒక స్పష్టమైన పాఠం కనబడుతుంది: సత్యం కోసం జీవించాలి, సత్యం కోసం అవసరమైతే ప్రాణం అర్పించాలి.
ఒక ఇంటర్వ్యూలో చార్లీ కర్క్ ను "మీరు మరణిస్తే ప్రజలు మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని ఆశిస్తున్నారు? " అనే ప్రశ్న అడిగారు. దానికి చార్లీ కర్క్ ఇచ్చిన సమాధానం : "నా విశ్వాసం పట్ల నేను కనపరచిన ధైర్యాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తున్నాను" అన్నాడు.
దేవుడు మనల్ని కూడా అటువంటి ధైర్యవంతమైన విశ్వాస జీవితం జీవించడానికి సహాయం దయచేయును గాక.
- డా.శంకర్ బాబు

This comment has been removed by the author.
ReplyDelete