హైదరాబాద్ నుండి ముంబైకి ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాము.
మా సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి.
నా పక్కనే ఉన్న సీట్లో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. వారి సీట్ RAC అంటే కూర్చోడానికి అవకాశం ఉంటుంది కానీ, పడుకోవడానికి బెర్త్ ఉండదు.
ఈ ఇద్దరిలో ఒకరు హిందూ బ్రదర్ మరొకరు ముస్లిం బ్రదర్.
ఇద్దరూ సగం సగం బెర్త్ పంచుకొని కూర్చున్నారు.
ట్రైన్ గుల్బర్గాలో ఆగింది. ఒక మహిళ వీరి సీట్ దగ్గరికొచ్చి, ఇది నా సీట్ నాకు కన్ఫర్మ్ అయిపొయింది అని చెప్పింది. అలా కాదు ఒకసారి ట్రైన్ నంబర్ చూడండి అని చెప్పారు ఆ ముస్లిం బ్రదర్.
ఆమె ఫోన్లో ట్రైన్ నంబర్ చూసి నేను ఇది మీ ట్రైన్ కాదు, మీరు వేరే ట్రైన్ ఎక్కారు అని చెప్పాను.
ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడంతో షోలాపూర్ లో దిగండి అని చెప్పి అక్కడే కూర్చోనిచ్చారు. సో, ఆ సీట్లో ఇప్పుడు ముగ్గురు కూర్చున్నారు
మా సీట్లల్లో ఆల్రెడీ పిల్లలతో సహా కలిపి పదకొండు మందిమి ఉండడంతో మా దగ్గర కూడా ఆ మహిళ కూర్చోవడానికి సీట్ ఇవ్వలేకపోయాము.
ఆ మహిళ తెగ టెన్షన్ పడుతుంది.
నెక్స్ట్ ట్రైన్ దొరుకుతుందో లేదో అనే ఆందోళనతో కూర్చుంది.
ఈ ముస్లిం బ్రదర్ దాదాపు 5 సార్లు ఆమెను టెన్షన్ పడొద్దు, మీ ట్రైన్ వెనకాలే ఉంది, మీకు దొరుకుతుంది అని చెప్తూనే ఉన్నాడు.
ఆ మహిళ కూడా ఒక హిందూ మహిళే.
షోలాపూర్ కి ముందే ఒక స్టేషన్లో ట్రైన్ ఆగింది. మా ట్రైన్ పక్కనే మరో ట్రైన్ ఆగింది. ఈ ముస్లిం బ్రదర్ వెళ్లి ఆ పక్క ట్రైన్ ఈ మహిళ వెళ్లాల్సిన ట్రైన్ అని తెలుసుకొని గబ గబ వచ్చి ఆమెకు చెప్పి ట్రైన్ దించి ఆమెను తన ట్రైన్ వైపు సాగనంపాడు.
ఆ మహిళ రావడంతోనే ఇది నా సీట్ అని కాస్త గట్టిగా అనింది. ఈ ముస్లిం బ్రదర్ నెమ్మదిగానే జవాబిచ్చాడు.
తనకే బెర్త్ లేదు, ఆ సీట్లో కూర్చోవడానికి అనుమతిచ్చాడు.
ఆమె టెన్షన్ పడుతుంటే ప్రోత్సహించాడు.
ఆమె ఎక్కాల్సిన ట్రైన్ కనుగొని ఆమెకు సహాయం చేశాడు.
అదే సీట్లో ఉన్న మరో వ్యక్తి ఈ తతంగం అంతా చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు. అది తప్పు అని నా అభిప్రాయం కూడా కాదు. ఆయన తనకు సీట్ దొరికితే చాలు అనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు కావచ్చు.
ఈ ముస్లిం బ్రదర్ కూడా సైలెంట్ గా ఉండొచ్చు కానీ తన చెల్లెలు లాగా ఆ మహిళకు సహాయం చేశాడు.
హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే దుర్మార్గులకు ఈ సంఘటన గురించి చెప్పాలనిపించింది.
మతం పేరుతో రాజకీయాలు చేసే వారికి అందరూ మనుషులేనని గుర్తు చేయాలనిపించింది.
ప్రతి మతానికి చెందిన వారిలో చెడ్డ వాళ్ళు ఉంటారు.అలాగని ఆ మతంలో ఉన్న వారందరూ చెడ్డ వారు అనే అభిప్రాయానికి రావడం, మతాల మధ్య అడ్డుగోడలు నిర్మించి మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అమానుషం.
మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది. మతాన్ని పాటించడం మంచిది. ప్రతి మతం మన జీవితాల్ని సన్మార్గంలో నడిపించాలి, నిజమైన స్వాతంత్ర్యం కలిగించాలి. ఒక మతం మనుషులను ప్రేమించుకుండా, ఇతరుల్ని ద్వేషించేదిగా ఉంటే అంతకన్నా చెడ్డ మతం ఉండదేమో !
- డా.శంకర్ బాబు
Comments
Post a Comment