పిల్లలు దేవుడు ఇచ్చే బహుమానం ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము (కీర్త 127:3).
ఎవరికైతే దేవుడు పిల్లలను బహుమానంగా అనుగ్రహిస్తాడో, ఆ తల్లిదండ్రులు వారి పిల్లలను దేవునిలో పెంచుట దేవుడిచ్చిన బాధ్యత అని గ్రహించాలి.
బాధ్యత కలిగి పిల్లలను దేవునిలో పెంచకపోవడం దేవుని బహుమానమును నిర్లక్ష్య ధోరణితో చూడడమే.
ఆయన ఇచ్చిన సంతానమును,ఆయన నియమాలను అనుసరిస్తూ, ఆయన సువార్తలో బాధ్యతగా పెంచడం విశ్వాసులైన తల్లిదండ్రులకు దేవుడిచ్చిన ఆత్మీయమైన ఆజ్ఞ (ద్వితీయో 6:4-9; ఎఫెసీ 6:4; కొలస్సీ 3:21)
విశ్వాసులైన తల్లిదండ్రులకు దేవుడు తన బహుమానమైన పిల్లలను ఇవ్వడం ద్వారా ఎన్నో పాఠాలను నేర్పుతాడు.
పిల్లల ద్వారా తల్లిదండ్రుల హృదయంలో గల విగ్రహాలను దేవుడు బయలు పరుస్తాడు.
పిల్లల ద్వారా అంతరంగంలో గల పాపాన్ని చూపిస్తాడు.
పిల్లల ద్వారా దేవుని వాక్యంలో ఎదిగే అవకాశం కలిగిస్తాడు.
పిల్లల ద్వారా తల్లిదండ్రుల గృహనిర్వాహకత్వాన్ని పరీక్షిస్తాడు.
దేవుడిచ్చిన పిల్లలు దేవుని సారూప్యంలో తల్లిదండ్రులను పెంచే దేవుని సాధనాలు.
దేవుడు దయచేసిన దేవుని పిల్లలను దేవునిలో పెంచుటకు విశ్వాసులైన తల్లిదండ్రులకు దేవుడు సహాయం చేయును గాక.
ఆమేన్.
Comments
Post a Comment