Skip to main content

Posts

Showing posts from 2022

మీరు సంఘమును విడిచిపెట్టడం గురించి ఆలోచిస్తుంటే. . .

మీరు సంఘం నుండి వెళ్లాలని నిర్ణయించుకునే ముందు 1. ప్రార్థన చేయండి. 2. మీరు మరొక చర్చికి వెళ్లే ముందు లేదా మరొక నగరానికి మకాం మార్చడానికి మీ నిర్ణయం తీసుకునే ముందు మీ ఆలోచన గురించి మీ ప్రస్తుత పాస్టర్‌కు తెలియజేయండి. అతని సలహా కోసం అడగండి. 3. మీ ఉద్దేశాలను బేరీజు వేసుకోండి. పాపం, వ్యక్తిగత వైరుధ్యం లేదా నిరాశ కారణంగా మీరు విడిచిపెట్టాలనుకుంటున్నారా? ఒకవేళ సిద్ధాంతపరమైన కారణాల వల్ల అయితే, ఈ సిద్ధాంతపరమైన సమస్యలు ముఖ్యమైనవా? 4. ఏవైనా సంబంధాలలో ఘర్షణ ఉంటే పునరుద్దరించటానికి మీ శక్తి మేరకు ప్రతిదీ చేయండి. 5. సంఘ జీవితంలో దేవుని పనిని మీరు చూసిన "కృపా సాక్ష్యాలను" పరిగణించండి.  దేవుని కృపకు సంబంధించిన ఏవైనా రుజువులను చూడలేకపోతే, మీరు మీ స్వంత హృదయాన్ని మరోసారి పరిశీలించుకోండి (మత్త. 7:3-5). 6.వినయంగా ఉండండి.  మీ దగ్గర అన్ని వాస్తవాలు లేవని తెలుసుకొని వ్యక్తులను మరియు పరిస్థితులను స్వచ్ఛందంగా అంచనా వేయండి. మీరు వెళితే. . . 1. సంఘాన్ని చీల్చకుండా చూసుకోండి. 2. మీ సన్నిహిత మిత్రులలో కూడా మీ అసంతృప్తిని పంచకుండా అత్యంత జాగ్రత్త వహించండి.   ఈ సంఘంలో దయతో వారి ఎ...

దేవుని దయ

"క్రైస్తవ జీవితంలోని అద్భుతమైన వాస్తవాలలో ఒకటి ఏమిటంటే,  ఈ క్షయమవుతున్న ప్రపంచంలో,  దేవుని దయ ఎప్పుడూ పాతబడదు అనే వాస్తవం. ఆయన దయ ఎప్పటికీ ఆగిపోదు,ఎండిపోదు.   ఆయన దయ ఎప్పుడూ బలహీనమైపోదు, అలసిపోదు.  అవసరాన్ని తీర్చడంలో దేవుని దయ ఎప్పుడూ విఫలం కాదు. ఆయన దయ ఎప్పుడూ నిరాశపరచదు,ఎన్నటికీ విఫలం కాదు. ఎందుకంటే ఆ దయ ప్రతి ఉదయం నిజంగా కొత్తగా మనకు లభిస్తుంది.  విస్మయం కలిగించే దయ మందలించే దయ బలోపేతం చేసే దయ  ఆశలు కలిగించే దయ హృదయాన్ని బహిర్గతం చేసే దయ కాపాడే దయ మార్పు తెచ్చే దయ  క్షమించే దయ పోషించే దయ అసౌకర్యం కలిగించే దయ మహిమను బయల్పరిచే దయ సత్యాన్ని వెలిగించే దయ ధైర్యాన్నిచ్చే దయ దేవుని దయ ఒక రంగులో రాదు; ఆయన కృప అనే ఇంద్రధనస్సు యొక్క ప్రతి రంగు యొక్క నీడలో వస్తుంది.   దేవుని దయ వాయిద్యం యొక్క ఒక ధ్వని కాదు; ఆయన కృప అనే వాయిద్యం నుండి వెలువడే ప్రతి సంగీత ధ్వని దయగా వెలువడుతుంది. దేవుని దయ సాధారణమైనది;   ఆయన పిల్లలందరూ ఆయన దయలో మునిగిపోయారు.  దేవుని దయ నిర్దిష్టమైనది; ప్రతి వ్యక్తి వారి వారి నిర్దిష్ట క్షణం కోసం రూపొంద...

తీర్పు తీర్చడం పాపమా ?

మత్తయి సువార్త 7: 3-5 నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?  నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?  వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.  పై వచనాల అర్థమేంటి ?  మనం ఇతరులను క్రిటిసైజ్ చేస్తాం అనగా సులువుగా విమర్శిస్తాం. తప్పుడు ఉద్దేశాలతో తీర్పు తీరుస్తుంటాం. మన సొంత జీవితాలను పరీక్షించుకోవడంలో మనల్ని మనం తీర్పు తీర్చుకోవడంలో ఫెయిల్ అవుతుంటాం. నలుసు చాలా చిన్నది దూలము అంటే చెట్టు యొక్క పెద్ద కాండం.  ఇక్కడ యేసు చెబుతున్న విషయం ఏంటంటే మనలోనే చాలా బలహీనతలు తప్పులు ఉంచుకొని ఇతరుల జీవితాల్లో గల చిన్న విషయాలను బట్టి విమర్శ చేస్తుంటాం అనే సంగతి. అందుకే, ఒకాయన  మనం ఇతరుల తప్పులను బట్టి తీర్పు తీర్చే మంచి న్యాయాధిపతులం కానీ, మన తప్పులను మనమే సమర్థించుకునే న్యాయవాదులం అన్నాడు అంటే డిఫెన్స్ లాయర్స్ మని అర్థం. దీనినే స్వనీతి వైఖరి అనొచ్చు.  ఇతరుల ఉద్దేశాలను వారి హృదయంలో ఉన్న విషయాలన...

సంఘం ఎవరిది ?

మత్తయి 16:18  మరియు నీవు పేతురువు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. చాలామంది ఈ వచనాలను బోధిస్తూ పేతురు మొట్టమొదటి బిషప్ గా నియమించబడ్డాడు, ఆయన అధికారిగా ఆయన మీద కొత్త నిబంధన సంఘం కట్టబడింది అని చెబుతుంటారు. ఈ బోధ మొదలుపెట్టింది రోమన్ క్యాథలిక్ ప్రజలు. పేతురుకు సంఘం మీద అధికారం ఇచ్చి ఆయనను మొట్టమొదటి పోపుగా వాళ్ళు నియమించి ఈ బోధను అప్పట్లో చేశారు. ఆ తర్వాత పోప్ సిస్టమ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆదిమ అపోస్తుల బోధ ద్వారా దేవుడు సంఘాన్ని కట్టడం వాక్యం చెబుతున్నప్పటికీ (ఎఫేసీ 2:20), పేతురు లేదా ఇతర అపోస్తలులు మూల రాయిగా లేదా పునాదిగా దేవుడు తన సంఘం కట్టాడని, కడుతున్నారని చెప్పడం సరియైనది కాదు. ఈ వాక్య భాగాన్ని సరైన విధంగా అర్ధ వివరణ చేయకపోవడం వలన ఇటువంటి వాక్య విరుద్ధమైన విషయాలను సంఘానికి బోధించడం జరుగుతుంది. ఈరోజు ఆ వాక్యాన్ని వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. 1. నువ్వు పేతురువు ఇక్కడ పేతురు అన్న పదానికి అర్థం (లాటిన్ లో పెట్రస్ లేదా పెట్రోస్ ) రాయి అని.  ఈ పదం లాటిన్ భాషలో masculine prop...

వాక్యానుసారమైన శిష్యత్వం

మత్తయి 28:19,20 కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి;  తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు  నామములోనికి  వారికి బాప్తిస్మమిచ్చుచు  నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.  ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. శిష్యులను ఎందుకు తయారు చేయాలి?   ఎందుకంటే అది ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ. ఎవరు శిష్యులను చేయాలి? ఈ మాటలు,యేసు తాను పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళేముందు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు.  అప్పుడు ఆయన శిష్యులుగా ఉన్నవారికి, నేడు ఆయన శిష్యులుగా ఉన్నవారికి కూడా ఆ మాటలు వర్తిస్తాయి కాబట్టి, పాస్టర్లు, నాయకులు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు శిష్యులను చేయమని క్రీస్తు ఆజ్ఞాపించాడు అని ఈ వాక్యం బోధిస్తుంది. ఎందుకంటే పై వాక్యం ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది కాబట్టి. శిష్యులను చేయడం అనేది మన తోటి సోదరులు మరియు సోదరీమణులను క్రీస్తుతో సంబంధంలోకి ప్రవేశించడం ద్వారా క్రీస్తు పోలికలో ఎదగడానికి సహాయం చేయడం తప్ప మరొకటి కాదు. అదే వాక్యానుసార...

కిరిస్తానీయులం

లచ్చిమీ, లేవే, అయ్యో, నా పాణాన్ని పొట్టనవెట్టుకుండ్రు అని గుండెల మీద లచ్చమ్మ శవాన్ని వెట్టుకొని ఏడుస్తుండు రాములు. ఎవరో ఆమెను మెడ మీద కత్తితో పొడిచి చంపేశారు.  ఊరవతల రైస్ మిల్లు దగ్గర శవం దొరికింది. లచ్చమ్మ, రాములు మంచి భార్యా భర్తలు. ఒకరంటే ఒకరికి మస్త్ ప్రేమ. రాములు పెద్ద కులంకి చెందినోడు.  లచ్చమ్మ అదే ఊర్లో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన చిన్న కులపామె.  రాములు మొదటిసారి లచ్చమ్మను సూడంగనే మనసు పారేసుకుండు.  పోయి లచ్చమ్మని పెండ్లి చేస్కుంటనని వాళ్ల అయ్య దగ్గరికి పోయి అడిగిండు. అట్ల కాదయ్యా, మేము కిరిస్తానీయులం, మీరు పెద్ద కులం వాళ్ళు అని వద్దన్నారు. రాములు పట్టు వదలకుండా ప్రయత్నించాడు. వాళ్ళ పాస్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. పాస్టర్ సారు రాములును కూసోబెట్టి, బైబిల్ నుండి కొన్ని మాటలు సూయించి, యేసు సామి మన కోసం మన పాపాల కోసం సచ్చిపోయిండు అని మొత్తం చెప్పి, ముందు ఆ సామిని నమ్ముకో, పెళ్లి సంగతి తర్వాత అని సూటిగా చెప్పిండు. రాములు,ఆలోచనలో పడిండు.  పాస్టర్ జెప్పిన మాటలు బాగా తాకినయి. నెల రోజుల తరవాత ఆయన దగ్గరికి పోయి " సార్, నేను యేసు సామిని నమ్ముకుంట...

హుస్సేన్ సాగర్ దగ్గర..

ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని హుస్సేన్ సాగర్ కి చేరుకున్నాడు కిరణ్.  ప్రేమించినవాడు మోసం చేయడంతో జీవితం మీద విరక్తి చెంది చావాలని అదే హుస్సేన్ సాగర్ కి వచ్చింది సుధ. ఇద్దరూ కాస్త దూరంలో నిల్చున్నారు. ఒకరికి ఒకరు పరిచయం లేదు.  ఇద్దరూ నీళ్ల వైపు సీరియస్ గా చూస్తున్నారు. ఇక దూకేద్దాం అనుకుని కిరణ్ రెడీ అవుతున్నాడు. ఇనుప రేలింగ్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు.  ఎందుకో అటువైపు చూసిన సుధకి, కిరణ్ దూకబోతున్నాడని అర్థమయ్యింది. పరుగున వచ్చి, ఏ అబ్బాయి ఏమైంది, ఎందుకు చావాలనుకుంటున్నావ్ ? అని అడిగింది. ఉలిక్కి పడిన కిరణ్ దూకే ప్రయత్నం ఆపి నిలబడ్డాడు.  విరక్తి ఈ జీవితం మీద విరక్తి అన్నాడు. తను కూడా అదే ఆలోచనలో ఉన్న సంగతి పక్కన బెట్టి, జీవితం మీద విరక్తి పుడితే జీవితాన్ని ముగించమని ఎవరు చెప్పారు ? తనకు తాను చెప్పుకుంటూ కిరణ్ తో అనేసింది సుధ. కష్టాలు, కన్నీళ్లు జీవితంలో కామన్. అసలు అవి లేకపోతే జీవితమే బోరింగ్ గా ఉంటుంది. నీకే కష్టం ఉందో నాకు తెలియదు కానీ, కాస్త ఓపిక పట్టు అన్నీ సర్దుకుంటాయేమో అంటూ చిన్న లెక్చర్ ఇచ్చేసిం...

ఇక్కడ కల్పనా కథలు అమ్మబడును

పాపని స్కూల్ లో జాయిన్ చేద్దామని తనని తీసుకొని బైకులో బయల్దేరాడు శంకర్.  అడ్మిషన్ ఫార్మ్ లో ఏమేమి రాయాలో తలుచుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు రాగానే ఆ రోడ్డుని చూసి ఆశ్చర్యపోయాడు.  ఏమాత్రం గుంతలు లేకుండా చక్కగా ఉంది.  చాలా క్రమశిక్షణగా కార్లు, బైకులు వెళ్తున్నాయి, అసలు హార్న్ సౌండ్స్ వినపడటమే లేదు.  ఇది మా పట్టణమేనా?  రాత్రికి రాత్రి ఏమైంది ఈ నగరానికి అంటూ బైక్ ముందుకు పోనిచ్చాడు. రోడ్డు మీద అసలు చెత్త కనిపించడం లేదు. ట్రాఫిక్ లైట్ దగ్గర బండి ఆపగానే పరుగెత్తుకొని వచ్చే పిల్లలు కూడా అక్కడ లేరు.  కొత్త మున్సిపల్ కమిషనర్ ఎవరైనా వచ్చి ఇలా మార్చేసారేమో అనుకున్నాడు శంకర్. అంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా, సైడ్ నుండి వచ్చి బైక్ ని గుద్దేసాడు ఓ యంగ్ మ్యాన్.  శంకర్ మరియు పాప ఇద్దరూ కింద పడ్డారు.  పాపకి తనకి ఏం అవ్వలేదని ఊపిరి పీల్చుకున్నాడు. బట్టలమీద పడ్డ దుమ్ము దులిపేసుకుంటుంటే, సారీ అంకుల్, నాదే తప్పు, సారీ అంటూ దండం పెడుతున్న యవ్వనస్తుణ్ణి చూస్తూ విస్తుపోయాడు.  తప్పు మనదైనా, ఇటువంటి పరిస్థితిలో పక్కవాడినే  టార్గెట్ చేసి పైసలు వసూలు చేయడం...

నా శ్రమలలో ఎక్కడున్నావు దేవా ?

  ఇన్ని బాధలు పడుతున్నాను, ఎక్కడున్నావు దేవా? ఇంతగా శ్రమలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఏమైపోయావు దేవా? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు మనందరం వేసినవారమే. మన కష్టాల్లో మొదటిగా ప్రశ్నించేది దేవున్నే. అంతా సాఫీగా సాగిపోతున్నపుడు రాని ఈ ప్రశ్నలు, శ్రమలు పలకరించగానే పుంఖాను పుంఖాలుగా పుట్టుకొస్తుంటాయి. కొందరు సూటిగా ప్రశ్నించక పోయినా ప్రభువా, అసలు మా గూర్చి నీకు చింత లేదా అనే మాటలను మాటి మాటికీ నెమరు వేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ, ఈ ప్రశ్నలకు బైబిల్ ఎప్పుడో జవాబులు ఇచ్చేసింది. ఇక్కడ సమస్య జవాబులు దొరక్క కాదు, జవాబులను అంగీకరించి, అన్వయించుకోకపోవడమే. నిజమా అని మీరు ఆశ్చర్యపడేలోపు మనుష్యులు శ్రమల్లో ఉన్నపుడు దేవుడు ఎక్కడ ఉంటాడో,ఎక్కడ ఉన్నాడో బైబిల్ నుండే చూపించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు దేవునికి గల ఒక ప్రాముఖ్యమైన గుణ లక్షణం గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఆత్మ.అంటే ఆయనకు శరీరం ఉండదు. ఈ ఆత్మ అయిన దేవుడు అన్ని ప్రదేశాల్లో తన ఉనికిని పూర్తిగా కలిగి ఉంటాడు. అందుకే దేవుడు సర్వవ్యాపి అని అంటుంటారు. సర్వవ్యాపి అయిన దేవుడు, మనుష్యులు శ్రమల గుండా వెళ్లనప్పుడు ఎక్కడ ఉంటాడో, అదే మనుష్...