మీరు సంఘం నుండి వెళ్లాలని నిర్ణయించుకునే ముందు
1. ప్రార్థన చేయండి.
2. మీరు మరొక చర్చికి వెళ్లే ముందు లేదా మరొక నగరానికి మకాం మార్చడానికి మీ నిర్ణయం తీసుకునే ముందు మీ ఆలోచన గురించి మీ ప్రస్తుత పాస్టర్‌కు తెలియజేయండి. అతని సలహా కోసం అడగండి.
3. మీ ఉద్దేశాలను బేరీజు వేసుకోండి. పాపం, వ్యక్తిగత వైరుధ్యం లేదా నిరాశ కారణంగా మీరు విడిచిపెట్టాలనుకుంటున్నారా?
ఒకవేళ సిద్ధాంతపరమైన కారణాల వల్ల అయితే, ఈ సిద్ధాంతపరమైన సమస్యలు ముఖ్యమైనవా?
4. ఏవైనా సంబంధాలలో ఘర్షణ ఉంటే పునరుద్దరించటానికి మీ శక్తి మేరకు ప్రతిదీ చేయండి.
5. సంఘ జీవితంలో దేవుని పనిని మీరు చూసిన "కృపా సాక్ష్యాలను" పరిగణించండి.
దేవుని కృపకు సంబంధించిన ఏవైనా రుజువులను చూడలేకపోతే, మీరు మీ స్వంత హృదయాన్ని మరోసారి పరిశీలించుకోండి (మత్త. 7:3-5).
6.వినయంగా ఉండండి.
మీ దగ్గర అన్ని వాస్తవాలు లేవని తెలుసుకొని వ్యక్తులను మరియు పరిస్థితులను స్వచ్ఛందంగా అంచనా వేయండి.
మీరు వెళితే. . .
1. సంఘాన్ని చీల్చకుండా చూసుకోండి.
2. మీ సన్నిహిత మిత్రులలో కూడా మీ అసంతృప్తిని పంచకుండా అత్యంత జాగ్రత్త వహించండి.
ఈ సంఘంలో దయతో వారి ఎదుగుదలకు ఆటంకం కలిగించడానికి
పూనుకోవద్దని గుర్తుంచుకోవాలి.
(గాసిప్) కొండెములు చెప్పాలనే కోరికను తిరస్కరించండి.
3.సంఘం మరియు దాని నాయకత్వం కోసం ప్రార్థించండి మరియు ఆశీర్వదించండి.
దీన్ని ఆచరణాత్మకంగా చేసే మార్గాల కోసం చూడండి.
బాధ కలిగి ఉంటే, మీరు క్షమించబడినట్లే మీరు కూడా క్షమించండి.
ఎడిటర్ యొక్క గమనిక: మార్క్ డెవర్ గారు రాసిన "వాట్ ఈజ్ ఎ హెల్తీ చర్చ్"లోని 57వ పేజీలో రాయబడింది.
రచయిత : మార్క్ డెవర్
వాషింగ్టన్, D. C.లోని కాపిటల్ హిల్ బాప్టిస్ట్ చర్చి యొక్క సీనియర్ పాస్టర్ మరియు 9మార్క్స్ అధ్యక్షుడు.
అనువాదం : డా.శంకర్ బాబు
Comments
Post a Comment