"క్రైస్తవ జీవితంలోని అద్భుతమైన వాస్తవాలలో ఒకటి ఏమిటంటే,
ఈ క్షయమవుతున్న ప్రపంచంలో,
దేవుని దయ ఎప్పుడూ పాతబడదు అనే వాస్తవం.
ఆయన దయ ఎప్పటికీ ఆగిపోదు,ఎండిపోదు.
ఆయన దయ ఎప్పుడూ బలహీనమైపోదు, అలసిపోదు.
అవసరాన్ని తీర్చడంలో దేవుని దయ ఎప్పుడూ విఫలం కాదు.
ఆయన దయ ఎప్పుడూ నిరాశపరచదు,ఎన్నటికీ విఫలం కాదు. ఎందుకంటే ఆ దయ ప్రతి ఉదయం నిజంగా కొత్తగా మనకు లభిస్తుంది.
విస్మయం కలిగించే దయ
మందలించే దయ
బలోపేతం చేసే దయ
ఆశలు కలిగించే దయ
హృదయాన్ని బహిర్గతం చేసే దయ
కాపాడే దయ
మార్పు తెచ్చే దయ
క్షమించే దయ
పోషించే దయ
అసౌకర్యం కలిగించే దయ
మహిమను బయల్పరిచే దయ
సత్యాన్ని వెలిగించే దయ
ధైర్యాన్నిచ్చే దయ
దేవుని దయ ఒక రంగులో రాదు; ఆయన కృప అనే ఇంద్రధనస్సు యొక్క ప్రతి రంగు యొక్క నీడలో వస్తుంది.
దేవుని దయ వాయిద్యం యొక్క ఒక ధ్వని కాదు; ఆయన కృప అనే వాయిద్యం నుండి వెలువడే ప్రతి సంగీత ధ్వని దయగా వెలువడుతుంది.
దేవుని దయ సాధారణమైనది;
ఆయన పిల్లలందరూ ఆయన దయలో మునిగిపోయారు.
దేవుని దయ నిర్దిష్టమైనది; ప్రతి వ్యక్తి వారి వారి నిర్దిష్ట క్షణం కోసం రూపొందించబడిన దయను ఆయన ద్వారా పొందుకుంటారు.
దేవుని దయ ఊహించదగినది; అది ఆగిపోకుండా నీటిని వెదజల్లే ఫౌంటెన్ వంటిది.
దేవుని దయ ఊహించలేనిది; అది ఆశ్చర్యకరమైన విధంగా మనకు లభిస్తుంది.
దేవుని దయ ఒక ప్రాముఖ్యమైన వేదాంతశాస్త్రం మరియు అది వేదాంతశాస్త్రం కంటే ఎక్కువ;
ఆ దయను నమ్మే వారందరికీ ఇది జీవితంతో సమానం.
దేవుని దయ అనేది అంతిమ సౌలభ్యం.
అంతేకాదు కానీ అది సరికొత్త జీవన విధానానికి పిలుపు కూడా.
దేవుని దయ ఎవరికి ప్రసాదించబడుతుందో
ఆ దయ నిజంగా అన్నింటినీ శాశ్వతంగా మారుస్తుంది.
పాల్ డేవిడ్ ట్రిప్,
న్యూ మార్నింగ్ మెర్సీస్ ; అనుదిన ధ్యానాలు
అనువాదం : డా. శంకర్ బాబు
Comments
Post a Comment