శరీరానికి వ్యాయామం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయాల్సిందే. మన శరీరంలో గుట్టగా పేరుకుపోయిన కొవ్వు తగ్గాలంటే కూడా వ్యాయామం తప్పనిసరి.దానిలో భాగంగా నేను కూడా జిమ్ కి వెళ్లడం ప్రారంభించాను. అక్కడ ట్రెడ్మిల్ మీద నడవడం మొదలుపెట్టాను. ప్రారంభంలో 5-7 నిమిషాలకే అలసిపోయే వాణ్ని. కానీ, రోజూ మెల్లిగా ఆ సమయం పెంచుతూ వచ్చాను. 7 నుండి 10 నిమిషాలు, ఆ తరువాత 15 నిమిషాలు, ఆ తరువాత 20 నిమిషాలకు చేరుకున్నాను.
ఇక్కడ నాకో విషయం అర్థం అయింది.
చాలా సార్లు మనం ఒకేసారి అన్ని పనులు చేసేద్దాం అనుకుంటాము. కానీ, చేయలేకపోతాం. ఎందుకంటే, ఒకే సారి ఆ పని చేసేద్దాం అనుకోవడం.
ఎంత పెద్ద భవనం అయినా ప్రతి రోజూ,ఒకదానిపై ఒక ఇటుక పేర్చి కడితేనే సాధ్యమవుతుంది. కొంచెం కొంచెంగా కూడబెడితేనే రేపు అవసరానికి డబ్బు ఉపయోగపడుతుంది. రాత్రికి రాత్రి ఏ మార్పు జరగదు. ఈ సంగతి మనకు తెలియంది కాదు.
అదేవిధంగా, క్రమశిక్షణగా ప్రతి రోజూ పని చేస్తేనే ఏ పనైనా సులభమవుతుంది, సంపూర్ణం అవుతుంది.
బైబిల్ మొత్తం చదివేసేయాలి అనుకుంటున్నారా? రోజూ 2-3 అధ్యాయాలు చదవండి.
గంట సేపు ప్రార్థన చేయాలని అనుకుంటున్నారా? రోజూ కొద్ది సమయం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి.
ఒక పుస్తకం చదవడం ముగించాలి అనుకుంటున్నారా? రోజూ 1-2 పేజీలు చదవడం క్రమశిక్షణగా పెట్టుకోండి.
బైబిల్ మొత్తం చదివేసేయాలి అనుకుంటున్నారా? రోజూ 2-3 అధ్యాయాలు చదవండి.
గంట సేపు ప్రార్థన చేయాలని అనుకుంటున్నారా? రోజూ కొద్ది సమయం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి.
ఒక పుస్తకం చదవడం ముగించాలి అనుకుంటున్నారా? రోజూ 1-2 పేజీలు చదవడం క్రమశిక్షణగా పెట్టుకోండి.
సంఘ సభ్యులతో సంబంధాలు కలిగియుండాలని ఇష్టపడుతున్నారా? రెండు రోజులకో, వారానికి ఒకసారో వారిని కలవడం, మాట్లాడటం చేయండి.
ఏ మంచి అలవాటైనా సరే, కొద్ది కొద్దిగా మొదలుపెట్టండి.
వారెన్ వియర్స్ బీ అనే రచయిత ఇలా అంటాడు : శిష్యత్వము అనేది అనుదిన క్రమశిక్షణ; మనము యేసును ఒక్కో రోజు ఒక్కో అడుగు వేస్తూ వెంబడిస్తాము.
మనం మన స్వశక్తితో కూడా ఇది చేయలేం కనుక ప్రభువు సహాయం కొరకు ప్రార్థించి, క్రమశిక్షణ కలిగిన ఆయన పిల్లలుగా ఎదుగుటకు ప్రయత్నం చేద్దాం.
- డా. శంకర్ బాబు

Comments
Post a Comment