ఆదివారం సంఘంగా కూడుకున్నపుడు చేసే పరిచర్యలలో ఒక పరిచర్య, సంఘ కాపరి సంఘం కోసం చేసే ప్రార్థన.నెలలో ఒక ఆదివారం సంఘ ఆరాధన సమయంలో దాదాపు 10 నిమిషాల పాటు సంఘ కాపరిగా నేను మా సంఘం కొరకు ప్రార్థన చేస్తాను. యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. అపోస్తలుడైన పౌలు సంఘాల కొరకు ప్రార్థన చేశాడు. సంఘ కాపరిగా సంఘము కొరకు ప్రార్థన చేయడం వాక్యానుసారమైన పరిచర్య. వారమంతా ప్రతి విశ్వాసుల ఆత్మీయ,భౌతిక విషయాల కోసం కాపరి ప్రార్థన చేయాలి అని నేను నమ్ముతాను, అలా ప్రార్థిస్తాను.అయితే ఆదివారం చేసే ఈ ప్రార్థన అందరి కొరకు ఒకేసారి ఆత్మీయ విషయాల కోసం ప్రార్థించడం. గత వారం మా ఆరాధన కార్యక్రమం అవ్వగానే ఒక సోదరి వచ్చి " అన్న, మీరు చేసిన ప్రార్థన నన్ను చాలా ప్రోత్సాహపరించింది. ముందు రోజు రాత్రి నాలో చెలరేగిన కలవరాన్ని పోగొట్టింది, థాంక్యూ " అని చెప్పింది. దేవునికి స్తోత్రము. దేవుడు మన పరిచర్యలను చూస్తున్నాడు. సంఘ క్షేమాభివృద్ది కొరకు మనం చేసే ప్రతి పరిచర్యను దేవుడు వాడుకుంటాడు.అందుకే, సంఘంగా కలవడానికి వచ్చే ముందు " దేవా, ఈ రోజు నన్ను ఎవరికైనా ప్రోత్సాహకరంగా వాడుకో " అని ప...