మా సంఘంలో ఉన్న యవ్వనస్తులు కలిసి ఒక పుస్తకం చదువుతున్నారు. దానిలో భాగంగా Sex అనే చాప్టర్ మీద మాట్లాడడానికి నన్ను పిలిచారు. గతవారం ఆ పుస్తకంలోని విషయాలను, నా ఆలోచనలను కలిపి వారితో సెక్స్ గురించి మాట్లాడడం జరిగింది. దేవుడు, వివాహ పరిధిలో, భార్యా భర్తల మధ్య మాత్రమే లైంగిక సంబంధం అనుమతించాడు మరియు ఆజ్ఞాపించాడు (ఆది 1:28,2:24). పెళ్ళికి ముందు సెక్స్ చేయడం పాపం (1 కొరింథీ 6:9,7:1,2; గలతీ 5:19,20). పెళ్లికి ముందే సెక్స్ వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి (లైంగిక వ్యాధులు HIV/AIDS మొదలైనవి). ఆడవారిని సెక్స్ వస్తువులుగా చూపిస్తున్న నేటి సమాజంలో దేవుడు దృష్టిలో ఆడవారు ఎవరు ? పురుషులు స్త్రీల పట్ల ఏ విధమైన దృక్పథం కలిగి ఉండాలి ? ఇలాంటి చాలా విషయాలు బోధించడం జరిగింది. ఆ తర్వాత వారిని ప్రశ్నలు అడగండి అని చెప్పడంతో, మంచి ప్రశ్నలు అడిగారు. Sex అనే పదాన్ని మరియు సెక్స్ చేయడాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్న జనరేషన్లో మనం ఉన్నాము. పెళ్ళికి ముందు సెక్స్ చేయకపోతే నువ్వు మగాడివి కాదు, పెళ్లికి ముందే చేస్తే నీకు అనుభవం వస్తుంది, తప్పేం ల...