Skip to main content

పవిత్రమైన వివాహములో అపవిత్రమైన ఆచారం

వరకట్నం అనగా నేమి ?
వివాహ విషయములో పెళ్లికుమారుని
కుటుంబానికి, పెళ్లి కుమార్తెతో పాటుగా
ఆమె  కుటుంబీకులు ఇచ్చే డబ్బు,
వస్తు సంపదలను వరకట్నముగా
నిర్వచిస్తారు.

వివాహ శుభ  ఘడియకు ముందు
ఈ కట్న కానుకల
సంప్రదింపులు చాలా ముఖ్యమైనవిగా
పరిగణించబడుతాయి.


భారతదేశములో మొట్టమొదటిగా ఈ
ఆచారము ఎప్పుడు మొదలైందో
చెప్పడం కష్టమే.
ఆ రోజుల్లో ఆడపిల్ల తండ్రి తన ఆస్తిలో
కొంతభాగం బాధ్యతగా, కాబోయే
పెళ్ళికూతురికి ఇచ్చేవాడు.

తన కూతురు కొత్త ఇంటికి వెళ్తుందనే
ఆలోచనతో ఆమెకు సహాయంగా
డబ్బు, వస్తు సంపదను
ఇష్టపూర్వకంగా ఇచ్చేవారు.
కాలానుగుణంగా ఈ ఆచారము
ఇష్టపూర్వకమైన కానుక నుండి
దురాశతో నిండిపోయి
డిమాండ్ చేసే స్థాయికి దిగజారిపోయింది.


సమాజమును పట్టి పీడిస్తున్న సామాజిక
దురాచారమైన వరకట్న వ్యవస్థను
క్రైస్తవులు కూడా పాటించడం
చాలా  బాధాకరం.
కొందరు వరకట్నపు మూలాలను మరియు
చరిత్రను ఎరుగకుండా, మరికొందరు
డబ్బు మీద ఆశతో
ఈ దురాచారాన్ని పాటిస్తున్నారు.
క్రైస్తవ జీవితమునకు పునాదియైన
బైబిల్ గ్రంథము దీనిని గూర్చి
ఏమి  బోధిస్తుందో తెలుసుకోవాల్సిన
అవసరతయున్నదని
నమ్మబద్ధులమైయున్నాము.

వరకట్నం వాక్య విరుద్ధం అనడానికి గల
కారణాలు ఈ పుస్తకంలో వివరంగా
చర్చించాము. కొన్ని సంగతులు
క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను.
వరకట్నం చెరిపివేస్తుంది.
దేవుడే వివాహమునకు కర్త మరియు కేంద్రముగా
ఉండాలి కానీ, నేడు ఈ కట్నం పెళ్ళిళ్లకు
ప్రధాన కేంద్రబిందువుగా మారిపోయింది.
వివాహ పత్రికలో పరిశుద్ధ వివాహం అని ముద్రించి,
వెనకాల వరకట్నమనే అపరిశుద్ధ సంప్రదాయమును
చాలా క్రైస్తవులు పాటించడం బాధాకరం.

2.  ఒక అమ్మాయిని వివాహం చేసుకోడానికి ధనమును,
ఆస్తులను షరతుగా పెట్టినట్లయితే అది మనకు
వాటిపై గల దురాశను, వాంఛను తెలియజేస్తుంది.
ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ( 1తిమోతి 6:10).
కానీ నేడు ధనమే వివాహాలకు మూలం అన్నట్లుగా
క్రైస్తవులు వరకట్నపు ఆచారమును పోషించడం  దుఃఖకరం.

3. క్రీస్తు సంఘమును ప్రేమించి తనను తాను
అప్పగించుకొన్నట్లుగా,పురుషులు తమ భార్యలను
ప్రేమించవలెనని (ఎఫెసీ 5:25) ఆజ్ఞాపించబడ్డారు.
అనగా తన భాగస్వామి క్షేమాభివృద్ధికై
నిస్వార్థంగా ఇవ్వడమే ప్రేమ కలిగియుండడం.
తాను వివాహం చేసుకోబోయే అమ్మాయికి
ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ, అమ్మాయి దగ్గర
గల డబ్బు, వస్తువులను
ఆశించే వ్యక్తిగా ఉండుట సరియైనది కాదు.
ప్రేమను పక్కనబెట్టి వ్యాపార లావాదేవీలతో
వివాహం చేసుకోవడం ఖచ్చితంగా తప్పే.

4. మనుష్యులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు
వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి (మత్తయి 5:14-16).

దేవుని ఎరుగని వారు పాటించే ఈ సాంఘిక దురాచారమును
వెలుగు సంబంధులుగా పిలవబడే క్రీస్తు శిష్యులు
అనుసరించడం వలన, లోకస్తులకు ,
క్రైస్తవులకు తేడా లేకుండా పోతుంది.

5. మీ అధికారులకు లోబడియుండుడి అని చెప్పే
దేవుని ఆజ్ఞను వరకట్న ఆచారం అతిక్రమిస్తుంది.
భారత చట్టం ప్రకారం వరకట్నం డిమాండ్ చేయడం,
ఇవ్వడం, పుచ్చుకోవడం నేరం.
చట్టవ్యతిరేక పనులు చేసి దేవుడిచ్చిన ఆజ్ఞను
వ్యతికేరించడం పాపమే.  

భారత ప్రభుత్వం ఒక దురాచారాన్ని రూపు మాపడానికి
చట్టాన్ని తీసుకువచ్చిందంటే అది ఎంత తీవ్రమైన
ఫలితాలకు దారి తీసి ఉంటుందో మనం
ఒకసారి ఆగి ఆలోచించాలి.

ప్రియమైన యవ్వన క్రైస్తవులారా మరియు
క్రైస్తవ తల్లిదండ్రులారా, మీరు ఉప్పుగా,
అనగా లోకము ఎదుట మంచి సాక్ష్యం కలిగియున్నారా ?

కేవలం క్రైస్తవ పనులు అనగా వాక్యం చదవడం,
ప్రార్థన చేయడం, సువార్త చెప్పడం మాత్రమే కాక
సమాజ దురాచారాన్ని ఎదిరించి నిలబడే
క్రీస్తు శిష్యులుగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు.

వరకట్నం యొక్క పరిణామాలు,
వరకట్నమును సమర్థించుకోడానికి సాకులు మరియు
ఈ అంశము పై మరింత సమాచారమునకు
పూర్తి పుస్తకం చదవగలరు.

పుస్తకం యొక్క కాపీల కొరకై,

www.ekklesiabooks.com

మొబైల్ నం : 09581829219




Comments

  1. Praise the Lord
    Dear brothers and sisters and all

    All words are wonderful
    thank God ,thank u dear loving brothers in Christ Jesus ...

    Note add it new ...
    warning

    Obey and be blessed
    Disobey brings curse
    Choose for obey future good & great results for u dear friends

    Abraham son isaac obeyed for marriage , To his father ...All things see sacrifices time ...His himself Obeyed ... Because of that ...Great nation of Jacob sons 12 tribes .... Came

    My dear saved children of God
    God loves u , His desire up on u ..To obey ....Like him

    Should not accept culture of world
    Behind cures ....Is there...


    Obey God ways wonderful future ...For ...All
    So Reject Dowrry...
    And come out of lover of money ,

    but be Lover of God and word ,wife ...
    Gift ... Precious life ... Sweetheart....

    Take repent and and renuwal heart in jesus mighty love be fill in everyone ... To be blessed of holy way and Gods will bless u , jesus grace be with u all ....Thank u ....

    My hope let everyone obey and
    let everyone be blessed Amen

    Happy to share
    Make it like speed breaker} Warning note ..Add some reference

    This by Servert of God
    Few and sweet words for u ....


    Thank u so much Dead and great Holy Friends of God .......See u ...Tq

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

సంఘముతో నిబంధన

క్రైస్తవులు వివాహం చేసుకునే సమయంలో ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు. బైబిల్లో ఈ విధంగా ప్రమాణాలు చేయాలని లేకపోయినప్పటికీ, వివాహం చాలా ప్రాముఖ్యమైనదని, ఇలా నిబంధన చేయడం ద్వారా దానిలోకి అడుగేయాలని సూచనగా ఈ ప్రమాణాలను క్రైస్తవులు చేస్తారు.  అయితే, క్రైస్తవులు రక్షించబడిన తర్వాత దేవుని కుటుంబమైన సంఘములో చేర్చబడటం, వివాహము కన్నా ప్రాముఖ్యమైనది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో (అపోస్త 20:28) సభ్యులుగా ఉండడం ప్రతి క్రైస్తవుని బాధ్యతగా ఉంది. ఒక ప్రత్యేక సంఘానికి అంటుకట్టబడకుండా, సంఘానికి వేరుగా ఉండడం వాక్యానుసారమైన క్రైస్తవ్యం కాదు. అందుకే, సంఘములో చేర్చబడడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం.  సరదాగా రెండు మూడు గంటల కార్యక్రమానికి వచ్చినట్టుగా సంఘానికి వచ్చే క్రైస్తవులు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. సంఘము పట్ల తీవ్రమైన ఆసక్తి, సంఘానికి నిబద్ధత కలిగి లేకపోతే క్రీస్తు సారూప్యంలో ఎదగడం కష్టమే. సంఘముతో నిబంధన చేసి, సంఘాన్ని ప్రేమిస్తూ, దేవుడు ఇచ్చిన వరాలను సంఘక్షేమాభివృద్ధికి ఉపయోగిస్తూ క్రీస్తు కొరకు జీవించే, క్రీస్తును ప్రకటించే క్రైస్తవులుగా ఉండటానికి మనం పిలవబడ్డాం. సం...

Joy of parenting

  Apostle Paul, in his letter to the Galatians, wrote, “But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control; against such things there is no law (Gal 5:22,23). A believer of Christ is called to bear the fruit of the Spirit, and one element in the fruit of the Spirit is joy. A follower of Christ is commanded to rejoice always (Phil 4:4). This joy of the Lord should be practiced in all areas of life.  One of the areas of practicing th is  Joy is in parenting. The writer of Proverbs says in Proverbs 23:24-25, “The father of the righteous will greatly rejoice; he who fathers a wise son will be glad in him. Let your father and mother be glad; let her who bore you rejoice”. Parenting our children is an outflow of how God parents us, because He is our heavenly Father. The Bible calls God the Father from whom all blessings flow to His children (James 1:17). Just as God delights when His children live by His sta...