మార్కు సువార్త 12:30-31 వచనాలలో
ఈ ఆజ్ఞలను మనం చదవగలం.
ఈ ఆజ్ఞలను మనం చదవగలం.
మొదటిగా, “నీవు నీ పూర్ణ హృదయముతోను,
నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను,నీ పూర్ణ బలముతోను,
నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను”.
అనగా మన జీవితములో ప్రభువును
ప్రేమించుటే అతి ప్రాముఖ్యమైన
పనియై ఉన్నది.
ప్రేమించుటే అతి ప్రాముఖ్యమైన
పనియై ఉన్నది.
హృదయములో దేవునికి ప్రథమ స్థానం,
బలహీనతలను ఎదిరించి ప్రభువుతో
ప్రతిదినం సహవాసం, ఆయన రాజ్య వ్యాప్తికై
సిద్ధపడి సువార్త పని మరియు
శిష్యులను తర్ఫీదు చేయడం
ఇవన్నీ ప్రధానమైన కర్తవ్యాలుగా
ప్రతి క్రైస్తవుడు చేయవలసినవాడై యున్నాడు.
దేవుని వాక్యమును ధ్యానిస్తూ,
ఆయన గుణాలక్షణాలను కీర్తిస్తూ
ప్రతిరోజూ ప్రభువును ప్రేమించుటకు
మనం ప్రాథమికంగా పిలవబడినాము.
దేవుడు మన పట్ల చూపిన అపార
ప్రేమను బట్టికృతజ్ఞతాపూర్వకముగా
ఆయనను ప్రేమించుటయే
క్రైస్తవ బాధ్యతయై యున్నది.
ప్రేమను బట్టికృతజ్ఞతాపూర్వకముగా
ఆయనను ప్రేమించుటయే
క్రైస్తవ బాధ్యతయై యున్నది.
చాలా మంది క్రైస్తవులు ఈ ఆజ్ఞను
పాటించుటలోకొంత వరకు ప్రయత్నం
చేస్తూ కొనసాగుతున్ననూ,
పాటించుటలోకొంత వరకు ప్రయత్నం
చేస్తూ కొనసాగుతున్ననూ,
క్రీస్తు ఆజ్ఞాపించిన మరో ఆజ్ఞను మాత్రం
చాలా మట్టుకు నిర్లక్ష్యం చేయడం
సంఘాలలో గమనించగలము.
మార్కు 12:31లో ఆ మాటలు
“నిన్ను వలె నీ పొరుగు వానిని
ప్రేమింపవలెను” అని
వ్రాయబడియున్నవి.
ప్రేమింపవలెను” అని
వ్రాయబడియున్నవి.
ప్రాముఖ్యముగా ఈ మాటలు
క్రైస్తవ విశ్వాసులకే వర్తిస్థాయి.
అనగా మన పొరుగువారైన క్రైస్తవులను
ప్రేమించుమని ప్రభువు ఆజ్ఞాపించాడు.
1యోహాను 4:10లో దేవుడు తన
కుమారుని మన నిమిత్తం
ప్రాయశ్చిత్తముగా పంపి తన
ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడు అని
కుమారుని మన నిమిత్తం
ప్రాయశ్చిత్తముగా పంపి తన
ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడు అని
చెప్పిన పిదప 11వ వచనంలో
“దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా
మానమొకనికొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము”
అని వివరించబడింది.
దేవుని ప్రేమించువారు, ఆయన పిల్లలను
ప్రేమించబద్దులైయున్నారు.
ఇతరులను ప్రేమించకుండా దేవుని
ప్రేమించలేరు.
ప్రేమించలేరు.
నేటి క్రైస్తవులు తమ సంఘములో గల
వారిని కనీసం పలకరించక ప్రతి వారం
సంఘ కార్యక్రమాలకు
వారిని కనీసం పలకరించక ప్రతి వారం
సంఘ కార్యక్రమాలకు
హాజరవుతుంటారు. ఆ రోజు వచ్చామా,
పాటలు పాడి ప్రసంగం విన్నామా,
ఇంటికి తిరిగి వచ్చామా అనే రీతిలో
జీవితాన్ని గడిపే క్రైస్తవులతో సంఘాలు
నిండిఉండడం శోచనీయం.
పౌలు సంఘమును క్రీస్తు శరీరముగా
సంభోదించాడు (1కొరింథి 12:27).
అదే విధంగా సంఘము, దేవుని
కుటుంబముగా కూడా బైబిల్
నిర్వచిస్తుంది.
కుటుంబముగా కూడా బైబిల్
నిర్వచిస్తుంది.
కుటుంబములో పరిచయం,
ప్రేమ సంబంధం లేని
సభ్యులుంటారా ? ఉండరు.
ప్రేమ సంబంధం లేని
సభ్యులుంటారా ? ఉండరు.
కానీ స్థానిక సంఘములో ప్రేమ
అనే మాటను
అనే మాటను
పక్కనబెడితే కనీసం పేరు కూడా
తెలియకుండా జీవిస్తున్నారు.
ఇతర సభ్యుల పట్ల, ఆప్యాయత
నేటి దినాల్లో కరువైపోతుంది.
నేను,నా కుటుంబం, నా ఉద్యోగం ఇలా
“నా, నేను “ అనే ప్రపంచములో
క్రైస్తవులు జీవిస్తున్నారు.
క్రైస్తవులు జీవిస్తున్నారు.
అసలు ప్రేమించుట అనగా అర్థమేమిటి
అనే ప్రశ్న ఉత్పన్నమవ్వచ్చు.
పౌలు గారు జవాబుగా ఒక అధ్యాయమే
(1కొరింథీ 13) వ్రాసారు.
(1కొరింథీ 13) వ్రాసారు.
ప్రేమ దీర్ఘకాలము సహించును.
సహనం కలిగి యున్నావా ?
ప్రేమ స్వప్రయోజనం కోరదు. అనగా
ఇతరుల ప్రయోజనాలను నిర్లక్ష్యం
చేస్తున్నావా ?
ఇతరుల ప్రయోజనాలను నిర్లక్ష్యం
చేస్తున్నావా ?
త్వరగా కోపపడదు. నీ సహోదరులు
తప్పు చేసినయెడల
తప్పు చేసినయెడల
కోపముతో సరిదిద్దుతున్నావా
లేదా ప్రేమతో తప్పును సరిచేస్తున్నావా ?
అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
ఎవరైనా నీ పట్ల తప్పుగా మాట్లాడితే
అతనితో సమాధానపడే ప్రయత్నం
చేయక, ఆ వ్యక్తి పై ద్వేషమును
కలిగియున్నావా ?
అతనితో సమాధానపడే ప్రయత్నం
చేయక, ఆ వ్యక్తి పై ద్వేషమును
కలిగియున్నావా ?
సంఘ సభ్యుల కష్టాలలో నీ వంతుగా
ఆదుకునే ప్రయత్నం చేస్తున్నావా ?
వారి ఆత్మీయ జీవితమునకు
ఉపయోగకరమైన సలహాలు,
ఉపయోగకరమైన సలహాలు,
ప్రోత్సాహం అందిస్తున్నావా?
నీ కుటుంబ సభ్యుల కొరకే కాకుండా
నీ తోటి సోదర సోదరీమణులకై
ప్రార్థన చేస్తున్నావా ?
ప్రార్థన చేస్తున్నావా ?
కేవలం ప్రార్థనే చేస్తూ పలకరించక,
ఇతరుల పరిస్థితిని పట్టించుకోక
విస్మరిస్తున్నావా ?
విస్మరిస్తున్నావా ?
ఒక సారి పరీక్షించుకుంటే మంచిది.
కొన్నిసార్లు మన డబ్బు, సమయం,
శక్తి త్యాగం చేయడానికి సిద్దపడి ఉండాలి.
ప్రవచన వరమున్నా,ఎంతో జ్ఞానమున్నా,
బహు విశ్వాసమున్నా, ఆస్తి యంతయు
దానం చేసినా,ప్రేమలేని వాడవైతే
నీవు నేను వ్యర్థులమే (1కొరింథీ 13:1-4).
దానం చేసినా,ప్రేమలేని వాడవైతే
నీవు నేను వ్యర్థులమే (1కొరింథీ 13:1-4).
ప్రభువులో ఇతరుల కొరకు మనలను
మనము తగ్గించుకొని త్యాగపూరితమైన
భావన కలిగి యుండడమే
ప్రేమను ధరించుకోవడం
భావన కలిగి యుండడమే
ప్రేమను ధరించుకోవడం
అని తెలుసుకుందాం.
స్వార్థంతో నిండిన సమాజములో
స్వప్రయోజనమును కోరక సోదర ప్రేమ
కలిగియుండుటే దేవుడిచ్చిన ఆజ్ఞ.
కలిగియుండుటే దేవుడిచ్చిన ఆజ్ఞ.
మనము దేవుని ఆజ్ఞలు గైకొనుటయే
దేవుని ప్రేమించుట ( 1 యోహాను 5:3)
ఎవరైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని
చెప్పి,తన తోటి సహోదరుని
ద్వేషించిన యెడల
చెప్పి,తన తోటి సహోదరుని
ద్వేషించిన యెడల
అతడు అబద్ధికుడు (1 యోహాను 4:20)
అని వాక్యం సెలవిస్తుంది.
ప్రియ సోదరా, సోదరీ, దేవుడిచ్చిన
ఈ ఆజ్ఞను విస్మరించక,
నిర్లక్ష్యం చేయక
ఈ ఆజ్ఞను విస్మరించక,
నిర్లక్ష్యం చేయక
నీ తోటి సంఘ సభ్యులను
క్రీస్తు ప్రేమతో ప్రేమించి,
దేవుని రాజ్యమును కట్టే పనిలో
ఆయన మహిమకై జీవించాలని
ఆశిస్తున్నాను.

Comments
Post a Comment