యోనా 1:1-3 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.
అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.
దేవుని మాటకు అవిధేయత చూపి దూరంగా పారిపోయాడు.
యోనా 3:1-3 - అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.
కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను.
దేవుని మాటకు విధేయత చూపాడు.
మధ్యలో ఏం జరిగింది?
తుఫానులో చిక్కుకున్నాడు
సముద్రంలో పడవేయబడ్డాడు
మత్స్యము కడుపులో మూడు రోజులు శ్రమను అనుభవించాడు.
ఈ శ్రమలు కలుగజేసింది ఎవరు?
1:14 - అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.
1:15 - యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను.
1:17 - గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించియుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను.
దేవుడే ఈ శ్రమలను కలుగజేశాడు.
పాఠం : మన అవిధేయతను, విధేయతకు మార్చడానికి కొన్నిసార్లు దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు.
చివరికి, దేవుడు పాఠం నేర్పిస్తాడు, కానీ తుఫాను గుండా తీసుకెళ్తాడు, అగాధంలోకి పడవేస్తాడు, అంధకారంలో నిలుపుతాడు.
ఈ శ్రమల గుండా వెళ్లకుండా దేవుని మాటలకు విధేయత కలిగి జీవించుట మంచిదేమో!
ఆలోచించుదాం.
ప్రార్థన : దేవా, విధేయతకు మాదిరిగా ఉన్న క్రీస్తును ముందు పెట్టుకుని విధేయులుగా బ్రతుకుటకు సహాయం చేయి దేవా, ఆమెన్.
- డా.శంకర్ బాబు

Comments
Post a Comment