గత వారం విపరీతమైన తలనొప్పి , జ్వరం రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది . రక్త పరీక్షలలో డెంగ్యూ జ్వరం అని తేలింది . తల బద్దలైపోతున్నట్లు నొప్పి , ఒళ్ళంతా కాలడం వలన నిద్ర కూడా సరిగా పట్టలేదు . మూడు రోజులు ఆస్పత్రిలో ఇంజెక్షన్స్ మరియు iv ఫ్లూయిడ్స్ ఇచ్చారు . నాలుగవ రోజు డిశ్చార్జ్ చేశారు . నాకు బాగాలేదని చెప్పగానే పని పక్కన బెట్టి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లింది ఒక ఫ్యామిలీ . నేను వెళ్ళేలోగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని , ఇన్సూరెన్స్ తాలూకు పేపర్ వర్క్ అంతా సిద్ధం చేశాడు ఒక తమ్ముడు . కొంతమంది బ్రదర్స్ నాతో ఆస్పత్రిలో ఉండి నాకు సహాయం చేశారు . నా గురించి ప్రార్థించిన వారు , నన్ను కలిసి వెళ్ళినవారు మరికొందరు . వంతుల వారిగా రాత్రులు నాతో ఉండి సపర్యలు చేసింది మరికొంతమంది బ్రదర్స్ . మరోవైపు మా పిల్లలకు టైఫాయిడ్ జ్వరం ఉండడంతో వారిని రక్తపరీక్షలకు తీసుకెళ్లింది మరో బ్రదర్ . ఇంట్లో ఉండి నా భార్యకు సహాయం చేశారు కొందరు సిస్టర్స్ . ...