గత ఆర్టికల్లో వాక్యానుసారమైన, ఆరోగ్యకరమైన సంఘమునకు
ఉండాల్సిన 2 లక్షణాలను నేను వివరించాను.
మొదటిది వాక్యానుసారమైన బోధ,
రెండవది సహవాసం.
మిగతా 3 లక్షణాలను ఇప్పుడు చూద్దాం.
III.సువార్త పని మరియు శిష్యత్వపు తర్ఫీదు
మార్కు16:15, మత్తయి 28:19, 20 వచనాలు
గమనిస్తే, దేవుడు మనకు అనగా సంఘానికి
ఒక పని అప్పచెప్పాడు అని తెలుసుకోగలం.
గమనిస్తే, దేవుడు మనకు అనగా సంఘానికి
ఒక పని అప్పచెప్పాడు అని తెలుసుకోగలం.
ఏమిటాపని?
సర్వలోకమునుకు వెళ్లి సువార్త చెప్పడం,
విశ్వసించినవారికి బాప్తీస్మమిచ్చి,
బోధ చేసి శిష్యులను తయారు చేయడం.
అపొస్తలులు చేసింది అదే, అపొస్తలలు కార్యములు,
పౌలు పత్రికలు చదివితే కనబడేది అదే.
పౌలు పత్రికలు చదివితే కనబడేది అదే.
అపొస్తలులు ఎక్కడెక్కడికైతే వెళ్లారో అక్కడ
దేవుని సువార్త చెప్పారు, స్థానిక సంఘము
స్థాపించారు, నాయకులను లేపారు,
విశ్వాసులకు వాక్య తర్ఫీదునిచ్చారు.
స్థాపించారు, నాయకులను లేపారు,
విశ్వాసులకు వాక్య తర్ఫీదునిచ్చారు.
ఇతరులకు సువార్త చెప్పడం అనేది
సంఘము యొక్క ప్రాముఖ్యమైన విధి.
సువార్త పని నిర్లక్ష్యం చేసి,ఇతర కార్యక్రమాలతో
బిజీగా ఉండే సంఘము వాక్యానుసారమైనది
కాదని నా అభిప్రాయం.
కాదని నా అభిప్రాయం.
సంఘముగా దేవుని శుభ సందేశమును
పాపములో నశిస్తున్న ప్రజలకు అందించాలి.
ఆదివారం ఆరాధన మాత్రమే కాక,
మిగతా ఆరు రోజులు దేవుని సువార్త పంచాలి
మరియు సువార్తకు తగ్గట్టు జీవించాలి.
మన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం,
ఉద్యోగం సువార్తను వెదజల్లేదిగా ఉండాలి.
అంతే కాక, సంఘములో గల విశ్వాసులు
శిష్యులుగా తర్ఫీదు పొందుకోవాలి.
సంఘము కలిసి కూర్చొని వాక్యము ధ్యానించి,
చర్చించి లోతుగా వాక్యసత్యాలను
తెలుసుకునేదిగా ఉండాలి.
చర్చించి లోతుగా వాక్యసత్యాలను
తెలుసుకునేదిగా ఉండాలి.
కాపరులు, సంఘమును ఆత్మీయ జీవిత విషయములో
తర్ఫీదునివ్వాలి.
కొలొస్స 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు
సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని,
సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి
బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు,
బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు,
ఆయనను ప్రకటించుచున్నాము.
సంఘము ఎలా సంపూర్ణతలో చేయబడుతుంది??
బుద్ధి చెప్పుట ద్వారా, బోధించుట ద్వారా.
సంఘానికి అంటుకట్టబడకుండా,
సంఘకాపరుల ఆత్మీయ నాయకత్వం కింద
లోబడి నేర్చుకోకుండా, సంఘముతో కలిసి
ప్రయాణం చేయకుండా క్రీస్తు స్వారూప్యములోకి
మారలేము.
సంఘము, శిష్యులను సువార్తలో వాక్యంలో
తర్ఫీదు చెందించడంలో ఓడిపోయింది కనుకనే
సంస్థలు పుట్టుకొచ్చాయి,ఇంకా పుడుతూనే ఉన్నాయి.
సంఘమే సెమినరీగా, బైబిల్ కళాశాలగా
సంఘస్తులను శిక్షణలో పెంచాలి.
సంఘముగా కలిసినప్పుడు బైబిల్ విషయాలను
చర్చించడం, కలిసి ఆత్మీయమైన పుస్తకాలు
చదవడం,ప్రశ్నోత్తరాల సమయం ద్వారా
నేర్పించడం ఇలా వివిధ రకాల పద్ధతులతో
విశ్వాసులను వాక్యంలో తర్ఫీదు
చెందించాల్సిన అవసరమున్నది.
చర్చించడం, కలిసి ఆత్మీయమైన పుస్తకాలు
చదవడం,ప్రశ్నోత్తరాల సమయం ద్వారా
నేర్పించడం ఇలా వివిధ రకాల పద్ధతులతో
విశ్వాసులను వాక్యంలో తర్ఫీదు
చెందించాల్సిన అవసరమున్నది.
అసలు ఎవరు శిష్యులను తయారు చేయాలి?
కేవలం పాస్టర్లే అని బైబిల్ చెప్పట్లేదు.
మత్తయి 28:19,20 ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన
ఆజ్ఞగా అర్థం చేసుకోవాలి.
ఆజ్ఞగా అర్థం చేసుకోవాలి.
కొంతమంది పాస్టర్లు క్రీస్తు శిష్యులను కాక
తమ స్వంత శిష్యులను తయారుచేసుకుంటారు.
పనులు చేయించుకోవడం, మీటింగ్లకు స్టేజ్
సిద్ధపరచడం, సోషల్ మీడియాలో
భజన చేయడం మొదలైన విషయాల్లో
పరిచర్య చేస్తారు.
సిద్ధపరచడం, సోషల్ మీడియాలో
భజన చేయడం మొదలైన విషయాల్లో
పరిచర్య చేస్తారు.
సువార్త పని చేయని, శిష్యులను
తయారుచేయని సంఘము,వాక్యానుసారమైన
సంఘము కాదు.
IV. సంఘ సభ్యత్వం మరియు
సంఘ క్రమశిక్షణ
సంఘ క్రమశిక్షణ
సభ్యత్వం అంటే, కొంత డబ్బిచ్చి పొందుకునే
విషయాలు, సంఘములో స్థానం గురించి కాదు.
కొన్నిసంఘాలలో ఇంత మొత్తం కడితే
విషయాలు, సంఘములో స్థానం గురించి కాదు.
కొన్నిసంఘాలలో ఇంత మొత్తం కడితే
కమిటీలో స్థానం, మాట్లాడే అవకాశం,
శ్మశానంలో సమాధికి స్థలం
శ్మశానంలో సమాధికి స్థలం
ఇది కాదు నేను చెబుతున్న సభ్యత్వం.
రక్షించబడిన వ్యక్తి ఒక స్థానిక సంఘానికి
అంటుకట్టబడి ఆ సంఘములో గల
నాయకులకు, ఇతరులకు
అంటుకట్టబడి ఆ సంఘములో గల
నాయకులకు, ఇతరులకు
జవాబుదారీతనంగా ఉండడం.
సంఘములో గల సభ్యులతో మంచి
సంబంధం కలిసి ఎదగడం.
సంబంధం కలిసి ఎదగడం.
సభ్యులు ఎవరో తెలిస్తేనే వారిని ప్రశ్నించడానికి,
వారి తప్పులను సరిచేయడానికి,
వారి కృపా వరాలను ప్రోత్సహించి
సంఘ క్షేమానికి ఉపయోగకరంగా
చేయడానికి సులువుగా ఉంటుంది.
సంఘ క్షేమానికి ఉపయోగకరంగా
చేయడానికి సులువుగా ఉంటుంది.
కొందరు కొత్తగా వస్తుంటారు,మరికొందరు
అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు.
అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు.
అందుకే సభ్యులెవరో, వచ్చిపోయేవారు
ఎవరో తెలియాల్సిన అవసరం ఉన్నది.
ఇతర సంఘాలనుండి మా సంఘముకు వచ్చి
సభ్యులుగా ఉండాలనుకునేవారిని వెంటనే
చేర్చుకోకుండా, వారితో సమయం గడిపి,
సువార్త అవగాహన గూర్చి చర్చించి,
చేర్చుకోకుండా, వారితో సమయం గడిపి,
సువార్త అవగాహన గూర్చి చర్చించి,
ఎందుకు పాత సంఘమును విడిచారని
తెలుసుకొని,వారికి సువార్త, సంఘమును
గూర్చిన బోధ, సంఘ విశ్వాసాలు
తెలుసుకొని,వారికి సువార్త, సంఘమును
గూర్చిన బోధ, సంఘ విశ్వాసాలు
ఇలా దాదాపు 8-10తరగతులు తీసుకొని,
వారిని పరీక్షించి సంఘం ఆమోదించిన పిదప
సభ్యులుగా తీసుకుంటాం.
సభ్యులుగా తీసుకుంటాం.
క్రమశిక్షణ కూడా చాలా ప్రాముఖ్యం.
సంఘ క్రమశిక్షణ లేకపోవడం వలన
సంఘసభ్యులు దేవునికి, వాక్యానికి భయపడక,
లోబడక పైపైన ఆత్మీయత కనబరుస్తున్నారు.
మత్తయి 18:15-20 లో సంఘములో
క్రమశిక్షణ విషయమై యేసుక్రీస్తు ప్రభువు
చక్కగా వివరించారు.
క్రమశిక్షణ విషయమై యేసుక్రీస్తు ప్రభువు
చక్కగా వివరించారు.
తప్పు చేసిన వ్యక్తిని సరిచేయడం, గద్దించడం
వాక్యానుసారమైన ప్రక్రియ.
ఈ క్రమశిక్షణ ప్రేమతో చేయాలి, సోదరుణ్ణి తిరిగి
ప్రోత్సహించి పొందుకోవాలని చేయాలి.
ఇది కొంతవరకు కష్టమైన పనే కాని,
సంఘ క్షేమం గూర్చి, దేవుని మహిమను
గూర్చి తప్పదు.
గూర్చి తప్పదు.
పాపము చేసిన వ్యక్తిని ప్రభువు ప్రేమతో గద్దిస్తే,
ఆ వ్యక్తికి అది కనువిప్పుగా ఉంటుంది
అదే విధంగా సంఘములో గల ఇతర వ్యక్తులకు
అది ఒక వాక్యానుసారమైన భయం కలిగిస్తుంది.
అదే విధంగా సంఘములో గల ఇతర వ్యక్తులకు
అది ఒక వాక్యానుసారమైన భయం కలిగిస్తుంది.
సభ్యులుగా ఉన్నవారినే క్రమశిక్షణ గుండా
తీసుకెళ్లగలం కావున, సభ్యత్వం చాలా
ప్రాముఖ్యమైనది.
తీసుకెళ్లగలం కావున, సభ్యత్వం చాలా
ప్రాముఖ్యమైనది.
సంఘ సభ్యత్వం మరియు సంఘ క్రమశిక్షణ
పాటించే సంఘము, ఆరోగ్యకరమైన సంఘము.
పాటించే సంఘము, ఆరోగ్యకరమైన సంఘము.
V. సంఘ అభివృద్ధి.
సంఖ్యలో మరియు ఆత్మీయతలో అభివృద్ధి
గురించి మనం చర్చించుదాం.
గురించి మనం చర్చించుదాం.
సంఖ్యలో అంటే ఇంత అని ప్రత్యేకంగా చెప్పలేము
కాని, నాయకత్వం పరిచర్య చేసే అవకాశం,
సరిపోయినంత నాయకులు, వాక్యసంబంధ ఆజ్ఞలు
పాటించుటకు అవకాశం ఉండడం చాలా ప్రాముఖ్యం.
కాని, నాయకత్వం పరిచర్య చేసే అవకాశం,
సరిపోయినంత నాయకులు, వాక్యసంబంధ ఆజ్ఞలు
పాటించుటకు అవకాశం ఉండడం చాలా ప్రాముఖ్యం.
మరీ లక్షల్లో సభ్యులుండి ఒకడే కాపరిగా
పరిచర్య చేయడం,డిజిటల్ స్క్రీన్లపై
సంఘాలను నడిపించడం అదో ఘోరం.
పరిచర్య చేయడం,డిజిటల్ స్క్రీన్లపై
సంఘాలను నడిపించడం అదో ఘోరం.
ఆత్మీయ అభివృద్ధికి కి సూచికలు
A.సంఘము క్రమముగా సువార్త పనిలో
పాల్గోవడం,సువార్తకు తగ్గట్టుగా జీవించడం.
సువార్త అందించడానికి కొత్త కొత్త ఆలోచనలతో
ముందుకెళ్లడం.
పాల్గోవడం,సువార్తకు తగ్గట్టుగా జీవించడం.
సువార్త అందించడానికి కొత్త కొత్త ఆలోచనలతో
ముందుకెళ్లడం.
B.సంఘమునకు ప్రాధాన్యతనివ్వడానికి కొన్ని
త్యాగాలు చేయడం.
త్యాగాలు చేయడం.
నాకు తెలిసిన ఒక సహోదరుడు ఒక స్థానిక
సంఘానికి దూరమైపోవద్దని తనకొచ్చిన
మంచి ఆఫర్ వదులుకొని సంఘానికి దగ్గర గల
ఆఫీసులో జాయిన్ అయ్యాడు.
సంఘానికి దూరమైపోవద్దని తనకొచ్చిన
మంచి ఆఫర్ వదులుకొని సంఘానికి దగ్గర గల
ఆఫీసులో జాయిన్ అయ్యాడు.
కొన్ని సార్లు సమయాన్ని,డబ్బును కూడా
త్యజించడానికి సిద్దపడిఉండడం.
త్యజించడానికి సిద్దపడిఉండడం.
C. కుటుంబాలలో భార్య భర్తలు వాక్యానికి
లోబడి కుటుంబాన్ని కట్టుకోవడం,
పిల్లలను క్రమశిక్షణలో పెంచడం.
D. కలిసినప్పుడు కాకమ్మ కబుర్లు కాకుండా
వాక్యసంబంధ విషయాలు మాట్లాడుకోవడం,
ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడం,
సాక్ష్యాలు పంచుకుంటూ ప్రోత్సహించుకోవడం.
E. అతి ప్రాముఖ్యముగా సంఘము
పాపమును ద్వేషిస్తూ, పాపమును చంపుతూ
పరిశుద్ధతకై ప్రయాస పడడం.
వీటిలో ఎదుగుతూ ఉన్న సంఘము
దేవుడు మెచ్చుకునే సంఘము అని
బల్లగుద్ది చెప్పగలం.
అభివృద్ధిని కేవలం సంఖ్యలో కాకుండా,
ప్రాముఖ్యముగా పైన తెలుపబడిన
లక్షణాలను బట్టి వివరించగలం.
ఇవి మాత్రమే ఆరోగ్యకరమైన సంఘానికి
సూచనలు అని చెప్పట్లేదు కానీ
ముఖ్యముగా ఈ విషయాలు
సూచనలు అని చెప్పట్లేదు కానీ
ముఖ్యముగా ఈ విషయాలు
సంఘ క్షేమానికి అవసరమైనవని చెప్పగలను.
దేవుడు నియమించిన సంఘ వ్యవస్థను,
దేవుని వాక్యానుసారముగా, దేవునికి మహిమ
తెచ్చే విధంగా కొనసాగింపజేయుటకు
ప్రయాసపడుదము గాక
తెచ్చే విధంగా కొనసాగింపజేయుటకు
ప్రయాసపడుదము గాక
Comments
Post a Comment