Skip to main content

స్వలింగ సంపర్కం పాపమా ?

       స్వలింగ సంపర్కం పాపమా  ?

        

సెక్షన్ 377, ఇప్పుడు భారతదేశంలో చర్చించబడుతున్న ఒక ప్రాముఖ్యమైన అంశం.

భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు సెక్షన్ 377 ను కొట్టివేసి స్వలింగ సంపర్కం నేరం కాదు అని తీర్పునిచ్చి మరో సారి పెద్ద చర్చకు తెర లేపింది.

తీర్పు ప్రకారం ఇద్దరు వ్యక్తులు ( ఆడ మగ తేడా లేకుండా ) పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఏర్పరుచుకుంటే దానిని నేరంగా పరిగణించరు.

సెక్షన్ 377లో ఏముంది ?

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 లో "ఎవరైనా  ఇష్టపూర్వకంగా, ప్రకృతి విరోధముగా,
మగ వాడితో, ఆడవారితో , జంతువుతో లైంగిక సంపర్కం జరిపితే, వారికి పది సంవత్సరాల 
లేదా జీవిత ఖైదు లేదా జరిమానా విధించబడును అని వ్రాయబడింది".

1861 నాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకృతి విరోధమైన లైంగిక చర్యలను నిషేధిస్తూ అప్పట్లో చట్టం చేసింది.

అనగా ఆడవారు ఆడవారితో, మగ వారు మగవారితో లైంగిక చర్యలకు పాల్పడటం నేరంగా పరిగణించబడుతుంది.

పిదప సెక్షన్ 377కు వ్యతిరేకంగా సుప్రీమ్ కోర్టులో దాదాపు 30కి పైగా పిటిషన్లు దాఖలైనాయి. కేసులు వేసిన వారి వాదన ఏమిటంటే "లైంగిక హక్కులను మరియు ఆర్టికల్ 21
ప్రకారం జీవించే హక్కును తిరస్కరించే సెక్షన్ 377ను కొట్టివేయాలి".

పరస్పర అంగీకారంతో చేసే లైంగిక చర్యను మానవ హాక్కుగా వివరించి ఇది వారి వ్యక్తిగత 
స్వేచ్ఛకు సంబందించినది కావున ప్రశ్నించే హక్కు లేదు అని చెబుతున్నారు.

వారి ఒత్తిడితో ఒకనాడు నేరంగా పరిగణించిన స్వలింగ సంపర్కాన్ని నేడు అదే  న్యాయస్థానం నేరం కాదని తీర్పునిచ్చింది.

బైబిలు ఏమి బోధిస్తుంది ?

పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్వలింగ సంపర్కం గూర్చి క్రీస్తు పూర్వం దాదాపు 1405 సంIIలో
వ్రాయబడిన లేవీయకాండం 18:22 వచనంలో స్త్రీ శయనము వలె , పురుష శయనము 
కూడదు; అది హేయము అని వ్రాసిపెట్టింది.  

అనగా స్వలింగ సంపర్కము దేవునికి అసహ్యము అని అర్థం

దేవుడు ఎందుకు చర్యను అసహ్యించుకుంటాడు ?

ఆది 1:27లో దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను, పురుషుని గాను వారిని 
సృజించెను  అని మొదటి స్త్రీ పురుషులను గూర్చి వ్రాయబడింది. అంతే కాక 28 వచనంలో వారిరువురు ఫలించి, అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొనుడి అని 
ఆఙ్ఞాపించబడినారు

గమనించాల్సిన విషయమేమిటంటే దేవుడు స్త్రీ పురుషులను సృజించి వారి లైంగిక సంబంధం
ద్వారా ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పాడు అంతే  కానీ పురుషుడు-పురుషుడు మరియు
స్త్రీ-స్త్రీ మధ్య లైంగిక సంబంధం ద్వారా కాదు

స్త్రీ పురుషుల మధ్యగల లైంగిక సంబంధం దేవునిచే నిర్ణయించబడిన  భిన్న లైంగిక 
సంపర్కందీనికి వేరుగా ఉండేది దైవ విరుద్ధమైన ప్రక్రియ అని తెలుసుకుందాం

ముఖ్యమైన మాట భిన్న లైంగిక సంపర్కం కూడా వివాహ పరిధిలోనే దేవునిచే నియమించబడింది

ఆది 2:24 లో వారు ( స్త్రీ పురుషులు ) ఏకశరీరమైయుందురు అని వ్రాయబడింది

స్వలింగ సంపర్కం సృష్టి ధర్మానికి వ్యతిరేకమైన ప్రక్రియ

అంతే కాక క్రీస్తు శకం 56 సంII లో లిఖించబడిన 1 కొరింథీ 6:9 వచనంలో  జారులు,విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము కలవారు, పురుష సంయోగులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని పౌలు గారు బోధించారు

కోర్టు కేసులు, స్వలింగ సంపర్కుల ఒత్తిడితో న్యాయస్థానాలు తమ తీర్పులు మార్చి వేసాయి.  

కానీ అప్పటికీ, ఇప్పటికీ మారనిది " దేవుని వాక్యం". 

రోమా పత్రిక 1:26,27 వచనాల్లో కూడా విషయం వివరించబడింది

వ్యభిచారం, దొంగతనం, జారత్వము, విగ్రహారాధన ఇవన్నీ దేవుని దృష్టిలో విధంగా పాపాలో,
అదే విధంగా స్వలింగ సంపర్కం కూడా పాపమే

స్వలింగ సంపర్కం దేవుని వివాహలైంగిక ప్రణాళికకు విరుద్ధమైన ప్రక్రియ


శుభవార్త 

దేవుని వాక్యమైతే స్వలింగ సంపర్కం పాపమని బోధిస్తుందో, అదే దేవుని వాక్యం పాపము
నుండి విడుదల చెందించుటకు మార్గమును చూపించింది

మార్గమే "యేసు క్రీస్తు ".  

ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని, పశ్చాత్తాప హృదయముతో ప్రభువు యొద్దకు వస్తారో, వారిని
ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు.  

మానవ పాప విమోచనకై యేసు క్రీస్తు ప్రభువు తనను తాను సిలువ మరణానికి 
అప్పజెప్పుకున్నాడు. ఆయన మరణము ద్వారా మన పాపములకు వెల చెల్లించాడు

క్రీస్తు సువార్త మాత్రమే పాపమునుండి విడిపించుటకు శక్తిగలదైయున్నది

క్రీస్తునందు విశ్వాసముంచి, ఆయన వాక్యముపై ఆధారపడి జీవించినయెడల పాపమే కాక 
మరి పాపము నుండైనా విముక్తి లభించగలదు

ఒకవేళ ఎవరైనా పాపముతో బాధపడుతూ, దీని నుండి బైటికి రావాలని ఇష్టపడుతున్నట్లైతే 
ఇప్పుడే ప్రభువు యొద్ద పాపము ఒప్పుకొని, దేవా క్షమించమని ప్రార్థన చేసి, రోమా పత్రిక 6 
అధ్యాయము చదవండి.

ప్రతి దినం వాక్యధ్యానంలో గడిపి ప్రభువు శక్తిని పొందుకునులాగున 
ప్రార్థించండిఒక స్థానిక సంఘమునకు అంటుకట్టబడి, క్రమం తప్పక సంఘముతో కూడుకొని 
దేవుని ఆరాధించుట ప్రారంభించుట చాలా మంచిది

దేవుడు నీకు సహాయము చేయును గాక.... 


Comments

  1. Very detailed description of this immoral lifestyle.

    Let the people follow God's law

    ReplyDelete
  2. Good article Anna! Keep writing and encouraging.

    ReplyDelete
  3. Wow...great analysis...keep it up

    ReplyDelete
  4. Praise God for the boldness to write. It will be costly soon.

    ReplyDelete
  5. Flow was very nice to understand the picture of God's design for men and women relationship through marriage, and how sinful it is to have homosexual relationship. Even the secular court law was mentioned in this to understand how world is going against the law of God.
    Thanks for your efforts anna. Bless you.

    ReplyDelete
  6. It is well written dear Dr. Shankar Babu. Your article is true to the biblical teaching and you also offer hope of forgiveness for those who seek God's forgiveness that is available in Jesus Christ. You have simply addressed the issue in the light of the SC judgment (which was very obvious that it was going to come out before it actually came out). However, we need to address it from a more neutral or secular and ethical-philosophical perspective also and by this we will show why what God says in His word, the Bible is true and also show the consequences more clearly of not following God's way and of choosing to go our own way. SM, the Director of HITHA

    ReplyDelete
  7. Chala baga chepparu brother. Nenu chala varaki ee alavatu manukunnanu church ki velthunna vakyam chadhuvuthunna, messges vintunna but porn videos ni manaleka pothunna.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

సంఘముతో నిబంధన

క్రైస్తవులు వివాహం చేసుకునే సమయంలో ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు. బైబిల్లో ఈ విధంగా ప్రమాణాలు చేయాలని లేకపోయినప్పటికీ, వివాహం చాలా ప్రాముఖ్యమైనదని, ఇలా నిబంధన చేయడం ద్వారా దానిలోకి అడుగేయాలని సూచనగా ఈ ప్రమాణాలను క్రైస్తవులు చేస్తారు.  అయితే, క్రైస్తవులు రక్షించబడిన తర్వాత దేవుని కుటుంబమైన సంఘములో చేర్చబడటం, వివాహము కన్నా ప్రాముఖ్యమైనది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో (అపోస్త 20:28) సభ్యులుగా ఉండడం ప్రతి క్రైస్తవుని బాధ్యతగా ఉంది. ఒక ప్రత్యేక సంఘానికి అంటుకట్టబడకుండా, సంఘానికి వేరుగా ఉండడం వాక్యానుసారమైన క్రైస్తవ్యం కాదు. అందుకే, సంఘములో చేర్చబడడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం.  సరదాగా రెండు మూడు గంటల కార్యక్రమానికి వచ్చినట్టుగా సంఘానికి వచ్చే క్రైస్తవులు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. సంఘము పట్ల తీవ్రమైన ఆసక్తి, సంఘానికి నిబద్ధత కలిగి లేకపోతే క్రీస్తు సారూప్యంలో ఎదగడం కష్టమే. సంఘముతో నిబంధన చేసి, సంఘాన్ని ప్రేమిస్తూ, దేవుడు ఇచ్చిన వరాలను సంఘక్షేమాభివృద్ధికి ఉపయోగిస్తూ క్రీస్తు కొరకు జీవించే, క్రీస్తును ప్రకటించే క్రైస్తవులుగా ఉండటానికి మనం పిలవబడ్డాం. సం...

Joy of parenting

  Apostle Paul, in his letter to the Galatians, wrote, “But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control; against such things there is no law (Gal 5:22,23). A believer of Christ is called to bear the fruit of the Spirit, and one element in the fruit of the Spirit is joy. A follower of Christ is commanded to rejoice always (Phil 4:4). This joy of the Lord should be practiced in all areas of life.  One of the areas of practicing th is  Joy is in parenting. The writer of Proverbs says in Proverbs 23:24-25, “The father of the righteous will greatly rejoice; he who fathers a wise son will be glad in him. Let your father and mother be glad; let her who bore you rejoice”. Parenting our children is an outflow of how God parents us, because He is our heavenly Father. The Bible calls God the Father from whom all blessings flow to His children (James 1:17). Just as God delights when His children live by His sta...