స్వలింగ సంపర్కం పాపమా ?
సెక్షన్ 377, ఇప్పుడు భారతదేశంలో చర్చించబడుతున్న ఒక ప్రాముఖ్యమైన అంశం.
భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఈ సెక్షన్ 377 ను కొట్టివేసి స్వలింగ సంపర్కం నేరం కాదు అని తీర్పునిచ్చి మరో సారి పెద్ద చర్చకు తెర లేపింది.
ఈ తీర్పు ప్రకారం ఇద్దరు వ్యక్తులు ( ఆడ మగ తేడా లేకుండా ) పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఏర్పరుచుకుంటే దానిని నేరంగా పరిగణించరు.
సెక్షన్ 377లో ఏముంది ?
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 లో "ఎవరైనా ఇష్టపూర్వకంగా, ప్రకృతి విరోధముగా,
మగ వాడితో, ఆడవారితో , జంతువుతో లైంగిక సంపర్కం జరిపితే, వారికి పది సంవత్సరాల
లేదా జీవిత ఖైదు లేదా జరిమానా విధించబడును అని వ్రాయబడింది".
1861 నాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకృతి విరోధమైన లైంగిక చర్యలను నిషేధిస్తూ అప్పట్లో చట్టం చేసింది.
అనగా ఆడవారు ఆడవారితో, మగ వారు మగవారితో లైంగిక చర్యలకు పాల్పడటం నేరంగా పరిగణించబడుతుంది.
ఆ పిదప ఈ సెక్షన్ 377కు వ్యతిరేకంగా సుప్రీమ్ కోర్టులో దాదాపు 30కి పైగా పిటిషన్లు దాఖలైనాయి. కేసులు వేసిన వారి వాదన ఏమిటంటే "లైంగిక హక్కులను మరియు ఆర్టికల్ 21
ప్రకారం జీవించే హక్కును తిరస్కరించే సెక్షన్ 377ను కొట్టివేయాలి".
పరస్పర అంగీకారంతో చేసే లైంగిక చర్యను మానవ హాక్కుగా వివరించి ఇది వారి వ్యక్తిగత
స్వేచ్ఛకు సంబందించినది కావున ప్రశ్నించే హక్కు లేదు అని చెబుతున్నారు.
వారి ఒత్తిడితో ఒకనాడు నేరంగా పరిగణించిన ఈ స్వలింగ సంపర్కాన్ని నేడు అదే న్యాయస్థానం నేరం కాదని తీర్పునిచ్చింది.
బైబిలు ఏమి బోధిస్తుంది ?
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ స్వలింగ సంపర్కం గూర్చి క్రీస్తు పూర్వం దాదాపు 1405వ సంIIలో
వ్రాయబడిన లేవీయకాండం 18:22వ వచనంలో స్త్రీ శయనము వలె , పురుష శయనము
కూడదు; అది హేయము అని వ్రాసిపెట్టింది.
అనగా స్వలింగ సంపర్కము దేవునికి అసహ్యము అని అర్థం.
దేవుడు ఎందుకు ఈ చర్యను అసహ్యించుకుంటాడు ?
ఆది 1:27లో దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను, పురుషుని గాను వారిని
సృజించెను అని మొదటి స్త్రీ పురుషులను గూర్చి వ్రాయబడింది. అంతే కాక 28వ వచనంలో వారిరువురు ఫలించి, అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొనుడి అని
ఆఙ్ఞాపించబడినారు.
గమనించాల్సిన విషయమేమిటంటే దేవుడు స్త్రీ పురుషులను సృజించి వారి లైంగిక సంబంధం
ద్వారా ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పాడు అంతే కానీ పురుషుడు-పురుషుడు మరియు
స్త్రీ-స్త్రీ మధ్య లైంగిక సంబంధం ద్వారా కాదు.
స్త్రీ పురుషుల మధ్యగల లైంగిక సంబంధం దేవునిచే నిర్ణయించబడిన భిన్న లైంగిక
సంపర్కం. దీనికి వేరుగా ఉండేది దైవ విరుద్ధమైన ప్రక్రియ అని తెలుసుకుందాం.
ముఖ్యమైన మాట : ఈ భిన్న లైంగిక సంపర్కం కూడా వివాహ పరిధిలోనే దేవునిచే నియమించబడింది.
ఆది 2:24 లో వారు ( స్త్రీ పురుషులు ) ఏకశరీరమైయుందురు అని వ్రాయబడింది.
స్వలింగ సంపర్కం సృష్టి ధర్మానికి వ్యతిరేకమైన ప్రక్రియ.
అంతే కాక క్రీస్తు శకం 56వ సంII లో లిఖించబడిన 1 కొరింథీ 6:9 వ వచనంలో జారులు,విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము కలవారు, పురుష సంయోగులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని పౌలు గారు బోధించారు.
కోర్టు కేసులు, స్వలింగ సంపర్కుల ఒత్తిడితో న్యాయస్థానాలు తమ తీర్పులు మార్చి వేసాయి.
కానీ అప్పటికీ, ఇప్పటికీ మారనిది " దేవుని వాక్యం".
రోమా పత్రిక 1:26,27 వచనాల్లో కూడా ఈ విషయం వివరించబడింది.
వ్యభిచారం, దొంగతనం, జారత్వము, విగ్రహారాధన ఇవన్నీ దేవుని దృష్టిలో ఏ విధంగా పాపాలో,
అదే విధంగా స్వలింగ సంపర్కం కూడా పాపమే.
స్వలింగ సంపర్కం దేవుని వివాహలైంగిక ప్రణాళికకు విరుద్ధమైన ప్రక్రియ.
శుభవార్త
ఏ దేవుని వాక్యమైతే స్వలింగ సంపర్కం పాపమని బోధిస్తుందో, అదే దేవుని వాక్యం ఈ పాపము
నుండి విడుదల చెందించుటకు మార్గమును చూపించింది.
ఆ మార్గమే "యేసు క్రీస్తు ".
ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని, పశ్చాత్తాప హృదయముతో ప్రభువు యొద్దకు వస్తారో, వారిని
ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు.
మానవ పాప విమోచనకై యేసు క్రీస్తు ప్రభువు తనను తాను సిలువ మరణానికి
అప్పజెప్పుకున్నాడు. ఆయన మరణము ద్వారా మన పాపములకు వెల చెల్లించాడు.
ఆ క్రీస్తు సువార్త మాత్రమే ఈ పాపమునుండి విడిపించుటకు శక్తిగలదైయున్నది.
క్రీస్తునందు విశ్వాసముంచి, ఆయన వాక్యముపై ఆధారపడి జీవించినయెడల ఈ పాపమే కాక
మరి ఏ పాపము నుండైనా విముక్తి లభించగలదు.
ఒకవేళ ఎవరైనా ఈ పాపముతో బాధపడుతూ, దీని నుండి బైటికి రావాలని ఇష్టపడుతున్నట్లైతే
ఇప్పుడే ప్రభువు యొద్ద ఈ పాపము ఒప్పుకొని, దేవా క్షమించమని ప్రార్థన చేసి, రోమా పత్రిక 6వ
అధ్యాయము చదవండి.
ప్రతి దినం వాక్యధ్యానంలో గడిపి ప్రభువు శక్తిని పొందుకునులాగున
ప్రార్థించండి. ఒక స్థానిక సంఘమునకు అంటుకట్టబడి, క్రమం తప్పక సంఘముతో కూడుకొని
దేవుని ఆరాధించుట ప్రారంభించుట చాలా మంచిది.
దేవుడు నీకు సహాయము చేయును గాక....

Very detailed description of this immoral lifestyle.
ReplyDeleteLet the people follow God's law
praise be to God
DeleteGood article Anna! Keep writing and encouraging.
ReplyDeletepraise be to God
DeleteWow...great analysis...keep it up
ReplyDeletePraise God for the boldness to write. It will be costly soon.
ReplyDeletepraise be to God
DeleteFlow was very nice to understand the picture of God's design for men and women relationship through marriage, and how sinful it is to have homosexual relationship. Even the secular court law was mentioned in this to understand how world is going against the law of God.
ReplyDeleteThanks for your efforts anna. Bless you.
It is well written dear Dr. Shankar Babu. Your article is true to the biblical teaching and you also offer hope of forgiveness for those who seek God's forgiveness that is available in Jesus Christ. You have simply addressed the issue in the light of the SC judgment (which was very obvious that it was going to come out before it actually came out). However, we need to address it from a more neutral or secular and ethical-philosophical perspective also and by this we will show why what God says in His word, the Bible is true and also show the consequences more clearly of not following God's way and of choosing to go our own way. SM, the Director of HITHA
ReplyDeleteThe previous post is ours.
ReplyDeleteYes Anna... agree with you
ReplyDeleteChala baga chepparu brother. Nenu chala varaki ee alavatu manukunnanu church ki velthunna vakyam chadhuvuthunna, messges vintunna but porn videos ni manaleka pothunna.
ReplyDelete