Skip to main content

Posts

Psalm 27:4 says,  “One thing have I asked of the Lord, that will I seek after: that I may dwell in the house of the Lord all the days of my life, to gaze upon the beauty of the Lord.” Today, we do not have a physical temple in the same sense as Israel did, because God now dwells within us by His Spirit—we are His temples. Yet sadly, we often fail to do this  one thing  that David desired above all:  to gaze upon the beauty of the Lord —to worship Him, adore Him, and glorify Him with undivided hearts. We are busy with many good things: working, visiting others, preaching, serving, and helping. These are all valuable and God-honoring. But we often neglect the  primary  thing, the  one  thing that gives life and meaning to all the rest. Let us return to this “one thing” first—seeking the Lord’s presence and beholding His beauty—so that all the other things we do may truly be for the glory of God. - Dr. Shankar Babu  కీర్తనలు 27:4 -  యెహోవా ...
Recent posts

సంఘాన్ని చంపుతున్నదెవరు?

  ఒక పట్టణంలో ఒక సంఘం ఉండింది. ఆ సంఘంలో చాలా మంది ఉన్నారు కానీ, సంఘ పరిచర్యలో పెద్దగా ఎవ్వరూ పాల్గొనేవారు కాదు. చాలా సార్లు పాస్టర్ గారు వాక్యం నుండి బోధించినా ప్రజలు వాక్యానికి లోబడకపోయేవారు. వాక్యం పట్ల అవగాహన ఉంది కానీ, సంఘం పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల వారికి ఒక పాఠం నేర్పించాలని పాస్టర్ గారు ఆదివారం ఈ ప్రకటన చేశారు. "వచ్చే ఆదివారం మనకు ప్రత్యేక కూడిక ఉంటుంది. మనం సంఘం చచ్చిపోయింది, ఆ రోజు మన సంఘాన్ని మనం పాతిపెట్టబోతున్నాము. తప్పకుండా సంఘ అంత్యక్రియలకు హాజరవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను". సంఘానికొచ్చే ప్రజలు ఆశ్చర్యపోయారు. అదేంటి సంఘం చనిపోవడం ఏంటి ? అసలు ఏం జరిగింది? ఏం జరుగబోతుంది? అనే ప్రశ్నలు వారి మనసుల్లో కలిగాయి. ఆ ప్రశ్నలతోనే ఆదివారం అందరూ వచ్చారు. వారిలో కొందరు, కూడిక తర్వాత భోజనం చేసి వెళ్లొచ్చు అనుకుని కూడా వచ్చారు.  స్టేజి ముందు ఒక చక్కగా అలంకరించబడిన శవపేటిక ఉంచబడింది. పాస్టర్ గారు నిలబడి " ఈ ప్రత్యేక కూడికకు వచ్చినందుకు కృతజ్ఞతలు. మనం సంఘం చచ్చిపోయింది. మన సంఘాన్ని ఎవరు చంపారో మీకు చూపిస్తాను. ఒక్కొక్కరు వచ్చి మీ ముందు పెట్టబడిన శవపేటికలో చూడండి, మీకే తెలు...

ఒకవేళ

  ఒకవేళ ఆదాము పాపం చేయకపోతే ఏమయ్యేది? ఒకవేళ హవ్వ అపవాది మాటలను నమ్మకుండా ఉంటే ఏమయ్యేది?  ఒకవేళ ఆదాము హవ్వలు జీవ వృక్ష ఫలం తింటే ఏం జరిగేది?  ఈ ప్రశ్నలు ఊహాజనితమైనవి. ఎందుకంటే, ఇవన్నీ కూడా దేవుడు ఉద్దేశించిన సృష్టి పతనం విమోచన నూతన సృష్టి అనే దేవుని పనికి వేరుగా అడుగుతున్న ప్రశ్నలు.  మన థియాలజీ "ఏమైయుండవొచ్చు" లేదా "ఒకవేళ"  అనే ప్రశ్నలపై కట్టే ప్రయత్నం చేయకూడదు. దేవుడు తన చిత్తంలో ఏం చేశాడు అనే దానిపై మాత్రమే మన థియాలజీ కట్టుకోవాలి.  దేవుడు మనిషి పతనం గురించి ముందే అవగాహన లేనివాడు కాడు. ఆయన సర్వజ్ఞాని. అందుకే ఆదాము హవ్వల పాపం దేవుణ్ణి ఆశ్చర్యపరిచి ఉండదు. ఎందుకంటే ఆయన విమోచన ప్రణాళికలో భాగంగా ఆ పతనాన్ని అనుమతించాడు. అనుమతించడం, పాపాన్ని ఆమోదించడం ఒకటిగా చూడకూడదు. ఒకవేళ ఆమోదిస్తే పాపానికి శిక్ష వేయకూడదు. కానీ దేవుడు పాపాన్ని శిక్షించాడు. ఇక్కడ దేవుని సార్వభౌమత్వం, మనిషి బాధ్యత రెండూ మనకు కనిపిస్తాయి. తన సార్వభౌమ చిత్తంలో తన ప్రణాళిక నెరవేర్చడానికి తద్వారా తన మహిమ నిమిత్తం దేవుడు పతనాన్ని అనుమతించాడు.  మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనిషి చేసిన పాప...

అకుల మరియు ప్రిస్కిల్ల కుటుంబం నుండి క్రైస్తవ దంపతులకు 5 ముఖ్యమైన పాఠాలు

    1.      వైవాహిక జీవితం  ·        అకుల మరియు ప్రిస్కిల్ల ఎప్పుడూ కలిసి ప్రస్తావించబడ్డారు (అపొ. కార్యములు  18:2,18,26;  రోమా  16:3). ·        వారు ఒక్కశరీరముగా ఉండడంలో బహుశా మాదిరిగా ఉన్నారు అనుకోవచ్చు.  ·        వారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో, పెళ్లై ఎన్ని సంవత్సరాలు అయ్యిందో తెలియదు కానీ వారి వైవాహిక జీవితం దేవునికి మహిమకరంగా ఉందని అనుకోవచ్చు.  ·        మన వివాహ బంధం ఒకటిగా ఉండాలి. ఒకదానితో ఒకటి పెనవేయబడిన రెండు తాళ్లు ఒక దృఢమైన తాడుగా బలంగా ఉంటుందో, వివాహం కూడా అలానే ఒక్క తాడుగా ఉండాలి.  ·        అందుకే దేవుని వాక్యంలో, వివాహంలో వారిని ఒక్కరిగా దేవుడు జతపరిచాడు అని చెబుతాడు.  ·        నిర్ణయాల్లో ఐక్యత, ప్రవర్తనలో ఐక్యత, ప్రేమలో ఐక్యత కలిగుండడానికి ప్రయత్నం చేయాలి.  ·        పెళ్లైన జంటను చూస్తే ఇతర...

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

Joy of parenting

  Apostle Paul, in his letter to the Galatians, wrote, “But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control; against such things there is no law (Gal 5:22,23). A believer of Christ is called to bear the fruit of the Spirit, and one element in the fruit of the Spirit is joy. A follower of Christ is commanded to rejoice always (Phil 4:4). This joy of the Lord should be practiced in all areas of life.  One of the areas of practicing th is  Joy is in parenting. The writer of Proverbs says in Proverbs 23:24-25, “The father of the righteous will greatly rejoice; he who fathers a wise son will be glad in him. Let your father and mother be glad; let her who bore you rejoice”. Parenting our children is an outflow of how God parents us, because He is our heavenly Father. The Bible calls God the Father from whom all blessings flow to His children (James 1:17). Just as God delights when His children live by His sta...