1. వైవాహిక జీవితం
· అకుల మరియు ప్రిస్కిల్ల ఎప్పుడూ కలిసి ప్రస్తావించబడ్డారు (అపొ. కార్యములు 18:2,18,26; రోమా 16:3).
· వారు ఒక్కశరీరముగా ఉండడంలో బహుశా మాదిరిగా ఉన్నారు అనుకోవచ్చు.
· వారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో, పెళ్లై ఎన్ని సంవత్సరాలు అయ్యిందో తెలియదు కానీ వారి వైవాహిక జీవితం దేవునికి మహిమకరంగా ఉందని అనుకోవచ్చు.
· మన వివాహ బంధం ఒకటిగా ఉండాలి. ఒకదానితో ఒకటి పెనవేయబడిన రెండు తాళ్లు ఒక దృఢమైన తాడుగా బలంగా ఉంటుందో, వివాహం కూడా అలానే ఒక్క తాడుగా ఉండాలి.
· అందుకే దేవుని వాక్యంలో, వివాహంలో వారిని ఒక్కరిగా దేవుడు జతపరిచాడు అని చెబుతాడు.
· నిర్ణయాల్లో ఐక్యత, ప్రవర్తనలో ఐక్యత, ప్రేమలో ఐక్యత కలిగుండడానికి ప్రయత్నం చేయాలి.
· పెళ్లైన జంటను చూస్తే ఇతరులకు ఒక్కరిగానే కనబడాలి.
2. పరిచర్య మరియు ఆతిథ్యం మరియు సేవలో భాగస్వామ్యం
· దేవుని పరిచర్య సందర్భంలోనే వారు ప్రస్తావించబడ్డారు. అంటే వారి వైవాహిక జీవితాన్ని ప్రభువు పనిలో వెచ్చించడానికి నిర్ణయం తీసుకున్నారు.
· అపోస్త 18: 1-3 : ఏథెన్సు నుండి కొరింథులో ఉన్న అకుల ప్రిస్కిల్ల ఇంటికి పౌలు వెళ్లాడు. అంటే అప్పటికే వారు దేవుని పనిలో ఉన్నారని అర్థం. వారు పౌలును తమ ఇంట్లోకి ఆహ్వానించారు.
· పౌలు దేవుని పరిచారకుడు. సువార్తికుడు. అంటే దేవుని ప్రజల పట్ల ప్రేమను కనుపర్చడానికి కుటుంబంగా నిర్ణయం తీసుకున్నారు. దేవుని ప్రేమను సంఘముతో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నారు. కలిసి ఆతిథ్యం ఇచ్చారు.
· తరువాత వారి ఇంటిలో సంఘము కూడింది (1 కొరింథీ 16:19; రోమా 16:5).
- వారి ఇల్లు సహవాసం, ఆరాధన మరియు ప్రోత్సాహానికి కేంద్రంగా మారింది. అంటే ఎంత కష్టమైనా, ఇబ్బందైనా దేవుని ప్రజలను సేవించడానికి ఇష్టపడ్డారు. గొణుక్కునే వారు సంఘము వారింట్లో కూడుకోవడానికి ఓకే చెప్పేవారు కాదు.
- క్రైస్తవ దంపతుల ఇల్లు ఆతిథ్యం, శ్రద్ధ మరియు దానాల ద్వారా దేవుని పనికి శక్తివంతమైన సాధనమవుతుంది.
3. ఆపత్కాలంలోనూ విశ్వాసం గల జంట
- అకుల మరియు ప్రిస్కిల్లలు, హింస కారణంగా రోమ్ విడిచి వెళ్ళవలసి వచ్చింది - అపొ. కార్య 18:2,3 - యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు.
- అయినప్పటికీ వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవను కొనసాగించారు.
- కొరింథులో పరిచర్య చేశారు. పౌలుతో కలిసి పరిచర్యలో ప్రయాణం చేశారు (అపోస్త 18:18,19).
- పాఠం: మన జీవితాల్లో శ్రమలు ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే. అవి లేని సమయం కేవలం క్రీస్తు రెండవ రాకడ తర్వాతే.
- అయితే, కుటుంబంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని పరిచర్య చేయడానికి ఇద్దరూ సిద్ధంగా ఉండాలి.
- భర్త సంఘంలో పరిచర్య చేయడానికి వెళ్తుంటే, మన పరిస్థితి బాగాలేదు, ఎందుకెళ్తున్నావ్ అనకూడదు. వెళ్ళండి ప్రభువు సహాయం చేస్తాడు, దేవుని కోసం మన పని ఆపొద్దు అనాలి.
- దేవుడు మనకు చేసిన మేళ్లకు మనమేం చేసినా తక్కువే అనే ప్రోత్సాహం ఒకరికొకరు ఇచ్చుకోవాలి.
- ఒక భాగస్వామి, కృంగిపోయుంటే మరింత కృంగిపోయే మాటలు మాట్లాడొద్దు, ప్రభువు వైపు చూద్దాం అని పురికొల్పాలి.
- జీవితంలో కష్టాలు వచ్చినా, క్రైస్తవ దంపతులు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి.
4. ఇతరులను శిక్షణ ఇచ్చిన జంట
- వారు అపొల్లోకు "దేవుని మార్గమును మరింత సమగ్రముగా" వివరించారు (అపొ. కార్యములు 18:26).
- అపోల్లో అనే యూదుడు, విద్వాంసుడు, లేఖనాలలో ప్రవీణుడు (theologian). అయితే యోహాను బాప్తిస్మం మాత్రమే తెలిసినవాడు, యేసును గురించి కూడా చెప్పాడు కానీ లోతుగా దేవుని మార్గాలు మరింతగా తెలియదు.
- ఏం చేశారు? దంపతులుగా వారు ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి లేదా ప్రత్యేకంగా కూర్చొని ఆయనకు దేవుని మాటలు చెప్పారు. అంతేకాదు, అపోల్లో అకయకు పోవాలి అనుకున్నప్పుడు, తనని చేర్చుకోవాలని అక్కడ గల శిష్యులకు పత్రిక రాశారు.
- ఇక్కడ వారి జ్ఞానం : అందరిముందు చెప్పకుండా అపోల్లో గౌరవాన్ని కాపాడారు.
- తగ్గింపు : మాకు తెలుసు అనే తత్వం కాకుండా ప్రేమగా చెప్పడం
- పరిచర్యకు తోడ్పాటు : అపోల్లో బోధకుడు, ఆయన్ను సరిచేస్తే మరింత ప్రభావవతంగా దేవుని పరిచర్య ముందుకెళ్తుంది. ఆయన్ను సిఫార్సు చేసి దేవుని పని జరగడానికి ప్రయత్నం చేశారు. ఇతరులను శక్తివంతమైన సేవకు సిద్ధం చేశారు.
- పాఠం: దంపతులుగా కలిసి పుస్తకాలు చదవడం, చర్చించుకోవడం చేయాలి. శిష్యత్వం చేయడం, ఇతరులను విశ్వాసంలో బలపరచడం చేయాలి. ఇంకా ఎన్ని రోజులు మనం శిష్యులుగా అవుదాం. మంచిదే, శిష్యులుగా అవుతూనే ఇతరులను శిష్యులుగా చేయడం ఎప్పడు ప్రారంభిద్దాం?
5. దేవుని పని కోసం రిస్క్ తీసుకోడానికి ఇష్టపడిన జంట
· రోమా 16:3 - వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.
· ఎప్పుడో ఎలానో మనకు తెలియదు కానీ, 1 యోహాను 3:16 పాటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
· కుటుంబంగా ప్రభువు కోసం ప్రభువు ప్రజల కోసం చావడానికైనా సరే వెనుకాడని నిబద్ధత కలిగున్నారు.
· క్రీస్తు వారి కోసం మరణించి తిరిగి లేచాడు కాబట్టి కుటుంబంగా క్రీస్తు కొరకు చావడానికైనా సిద్ధంగా ఉన్నారు.
· ఎలా చనిపోయారో బైబిల్ మనకు చెప్పట్లేదు కానీ క్రీస్తు కొరకు జీవిస్తూ చనిపోయి ఉంటారని మాత్రం వారి సాక్ష్యం ప్రకారం అంచనా వేయగలం.
· 12 మంది శిష్యులను గుర్తుపెట్టుకున్నట్లుగా ఈ జంటను మనం గుర్తు పెట్టుకోము కానీ ఎవరికోసమైతే ఈ జంట జీవించారో మరణించారో ఆ క్రీస్తు ప్రభువును ప్రతి సారి గుర్తు చేసుకుంటూ కుటుంబాలుగా దేవుని పరిచర్యలో కొనసాగడానికి దేవుని సహాయం కోరుదాం.
ప్రోత్సాహం : ప్రిస్కిల్ల మరియు అకుల యొక్క అద్భుతమైన వివాహ జీవితం గురించి మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి, కలిసి ప్రార్థించండి. వారి వివాహంలో కనిపించే నిబద్ధతను ఇవ్వమని ప్రభువును అడగండి. మరియు మీ మిగిలిన రోజులను నమ్మకమైన భార్యాభర్తలుగా గడపడానికి సాయం చేయమని ఆయన ఆత్మ కొరకు దేవునికి ప్రార్థించండి, ఎంత ఖర్చైనా సరే, ఏమైనా సరే దేవుని రాజ్యం యొక్క పురోగతికి కట్టుబడి ఉండండి.
Ø మార్టిన్ లూథర్ మరియు కాథరినా వాన్ బోరా – సంఘ సంస్కర్త దంపతులు; కాథరిన్ గృహమును, ఆర్థికపరమైన పనులను నిర్వహించేది మరియు వేదాంతపరమైన చర్చల సమయంలో అందరికీ ఆతిథ్యమిచేది.
Ø జాన్ కాల్విన్ మరియు ఐడెలెట్ డి బ్యూర్ – కాల్విన్ భార్య జెనీవాలో కాల్విన్ పరిచర్యకు మద్దతు ఇచ్చింది మరియు అనాథల పట్ల శ్రద్ధ వహించింది.
Ø అడోనిరామ్ మరియు ఆన్ జుడ్సన్ – బర్మాకు మిషనరీలు; బైబిల్ అనువాదంలో సహాయం చేసింది మరియు కలిసి సువార్త పని చేసింది.
Ø డేవిడ్ మరియు సారా లివింగ్ స్టోన్ – ఆఫ్రికాలో మిషనరీలు; సువార్త మరియు బానిసత్వ వ్యతిరేక పని కలిసి చేశారు.
Ø హడ్సన్ మరియు మరియా టేలర్ – చైనాలో మిషనరీలు; చైనా ఇన్ ల్యాండ్ మిషన్ మార్గదర్శకులు.
Ø D. L. మూడీ మరియు ఎమ్మా మూడీ – D. L. మూడీ భార్య అతని సువార్త ప్రచారాలకు మద్దతు ఇచ్చింది.
Ø జాన్ స్టాట్ మరియు ఎలిజబెత్ స్టాట్ – ప్రభావవంతమైన సువార్త నాయకులు; ఎలిజబెత్ బోధన, రచన మరియు ప్రపంచవ్యాప్త పరిచర్యకు మద్దతు ఇచ్చింది.
Ø జాన్ మరియు నోయెల్ పైపర్ – ఆయన పరిచర్యకు మొదటి నుండి కూడా సపోర్ట్ చేసింది.
Ø పెట్రిషియా మెకార్థర్ ప్రార్థన సహాయం, జాన్ మెకార్థర్ పరిచర్యకు దోహదపడింది.
- డా. శంకర్ బాబు

Comments
Post a Comment