ప్రభువు పని చేయాలంటే నాకు సమయం లేదు, చాలా బిజీగా ఉన్నాను అని చాలా మంది చెబుతుంటారు. మనలో చాలా మందికి ఉన్న సమస్య సమయం లేకపోవడం కాదు, సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోవడం. అనవసరమైన విషయాలకు ఎక్కువ సమయం వెచ్చించడం ఆపగలిగితే చాలా సమయం, చాలా అవసరమైన విషయాలకు మనం వాడుకోగలం.
ఈ నెల ప్రారంభం నుండి నేను చేసిన విషయాలను మీ ప్రోత్సాహం కొరకు రాస్తున్నాను.
1. సిరిసిల్లలో పాస్టర్ల సమావేశంలో శారీరక ఆరోగ్యం మరియు ఆత్మీయ ఆరోగ్యం అనే అంశం మీద ప్రసంగం కొరకు దాదాపు 5-8 గంటల స్టడీ చేశాను.
2. పాస్టర్ అంతరంగం అనే పుస్తకం మళ్ళీ ఒక 50 పేజీలు చదివి అక్కడ వారికి బోధించాను (8th august).
3. హామిల్టన్ రాసిన what is Biblical Theology పుస్తకం మొత్తం చదివాను (95 పేజీలు).
4. Biblical Theology కి సంబంధించి ఇతర పుస్తకాలు ఆర్టికల్స్ దాదాపు 50 పేజీలు చదివాను.
5. what is Biblical Theology సగం పుస్తకం తెలుగులో తర్జుమా చేసి discipleship training లో బోధించాను (10th august)
6. Doctrine of God చదవడం యొక్క ప్రాముఖ్యతను గురించి చదివి, సిద్ధపడి సంఘానికి బోధించాను (14th august).
7. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎలా అనే సెమినార్ కొరకు singleness,marriage and the will of God అనే పుస్తకం అక్కడక్కడా దాదాపు 30 పేజీలు చదివాను (ప్రశ్న - జవాబుల కొరకు).
8. ఆ సెమినార్లో నా టాపిక్ కొరకు దాదాపు 5-6 గంటల సమయం వెచ్చించాను, ఆ రోజు బోధించాను (15th august).
9. ఎఫెసీ పత్రిక నుండి ప్రసంగం కొరకు రెండు 10-15 గంటలు సిద్ధపడి ప్రసంగం (పరిశుద్ధాత్మను దుఃఖరచకుడి) చేశాను (18th august).
10. Ask pastor John 17వ ఆర్టికల్ ఎడిట్ చేసి దానికి వాయిస్ రికార్డింగ్ చేశాను (23rdausust).
11. రాబిన్ శర్మ రాసిన who will cry when you die పుస్తకం చదివాను ( 20th, 21stAugust ).
12. కవితలకు సంబంధించిన పుస్తకాల్లో గల కొన్ని కవితలు చదివాను. ఒక కవిత మరియు ఒక పాట రాశాను. ఆ పాట రికార్డింగ్ చేయడానికి రికార్డింగ్ స్టూడియోకి వెళ్లాను.
13. ఇద్దరు విశ్వాసులకు కౌన్సిలింగ్ చేశాను.
14. కుటుంబంగా ఒక కుటుంబానికి ఆతిథ్యం ఇచ్చాము.
15. అనారోగ్యంగా ఉన్న సంఘ సభ్యులను దర్శించాను.
16. ఆరోగ్య పరమైన సలహాలు సూచనలు కొందరికి చేశాను.
17. ఇవన్నీ కూడా డాక్టర్ గా ఆస్పత్రికి వెళుతూ నా ఉద్యోగం నేను చేస్తూనే చేశాను.
ఇవన్నీ నేను గొప్ప పనులు చేశాను అని డబ్బా కొట్టుకోడానికి కాదు, కేవలం మీ ప్రోత్సాహానికే పంచుకుంటున్నాను.
దేవుడు ఈ పనులు చేయడానికి సహాయం చేశాడు. ఆయన ఇచ్చిన కృప మరియు బలం మరియు జ్ఞానం చేత కష్టపడ్డాను కాబట్టే దేవుడు సహాయం చేశాడు.
Be encouraged My dear brothers and sisters.
సామెతలు 12:27 – సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము.
ప్రియులారా, దేవుడు మనకిచ్చింది ఒకటే జీవితం, దానిని ఆయన కొరకు వెచ్చిద్దాం.
దేవుడు మనందరికీ ఆ కృపనిచ్చును గాక. అమెన్.
- డా.శంకర్ బాబు

Comments
Post a Comment